Illu Illalu Pillalu Serial Today Episode నర్మద దగ్గరకు వల్లి వచ్చి సాగర్‌ పరీక్ష రాశాడు కదా ఆ ఎగ్జామ్ ఏంటి ఎందుకు అని అడుగుతుంది. నర్మద షాక్ అయి ఆయన ఎగ్జామ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నా ఫ్రెండ్ మిమల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసిందని అంటుంది. నువ్వు ఎవరికీ తెలీకుండా పరీక్ష రాయించింది కొత్త ఉద్యోగం కోసమా అని అంటుంది. దాంతో నర్మద నీకే బుద్ధి లేదు కదా నీ ఫ్రెండ్‌కి కూడా లేదా అని తిడుతుంది.

వల్లీ అప్పటికీ వదలకుండా పెళ్లికి వెళ్తారు కదా.. ఫొటోలు చూపించు అని అంటుంది. దానికి నర్మద నువ్వు అడుగుతావ్ అని తెలీదు కదా ఈ సారి ఎక్కడికి వెళ్లినా ఫొటోలు దిగి నీకు చూపిస్తాలే అని అంటుంది. వల్లి మనసులో ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తుంది దీని పని చెప్తా అనుకుంటుంది.  

ప్రేమ కల్యాణ్‌ గురించి ఆలోచించి దొరికుంటే వాడి పని అయిపోయింది.. కానీ తప్పించుకున్నాడు అని అనుకుంటుది. ఇంతలో వల్లీ వచ్చి నిన్న నిన్ను రోడ్డు మీద చూశా ఒకబ్బాయిని తరుముతున్నావు.. ఎవరు అతను ఎందుకు వెంటపడ్డావు అని అడుగుతుంది. ప్రేమ షాక్ అవుతూనే నీ ముఖం నేను రోడ్డు మీద పరుగెత్తడం ఏంటి కళ్లు ఎక్కడైనా చూపించుకో అని అంటుంది. దానికి వల్లీ ఎందుకు అలా అంటావ్ ప్రేమ ఓ అక్కలా అడిగాను అదే నా మనసులో కుళ్లు కుతంత్రం ఉంటే ఈ విషయం డైరెక్టుగా మామయ్య గారికి చెప్పేదాన్ని కదా అని బెదిరిస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ చిరాకు తెప్పించకు పో అని ప్రేమ వల్లీని తరిమేస్తుంది. మనసులో మాత్రం ఈ విషయం మామయ్యతో చెప్పేస్తుందేమో అని అనుకుంటుంది.

వల్లీ ప్రేమ ఇంత ఈజీగా కవర్ చేస్తుంది అంటే ఏదో విషయం ఉంది అని తెగ ఆలోచిస్తుంది. ఇంతలో ఓ పేపర్ ఎగిరి వచ్చి రోడ్డు మీద ప్రేమ కల్యాణ్‌ని తరిమినట్లు ఉన్న ఫొటో చూస్తుంది. ఆధారం  దొరికింది అని గెంతులేస్తూ రామరాజు దగ్గరకు పరుగులు పెడుతుంది. మరోవైపు భద్రావతి చెప్పినట్లు విశ్వ అమూల్యని ట్రాప్ చేయడానికి రెడీ అయిపోతాడు. అమూల్య కాలేజ్‌కి వెళ్లే టైం కావడంతో ఇంటి గేటు ముందు వెయిట్ చేస్తూ అమూల్య రావడంతో అమూల్యకు లైన్ వేస్తుంటాడు. చూస్తూ నవ్వుతాడు. అమూల్య అనుమానంగా చూస్తుంది. భద్రావతి మేడ మీద నుంచి చూస్తుంది. 

అమూల్య నడిచి వెళ్తుంటే విశ్వ బైక మీద ఫాలో అవుతాడు. హాయ్ అమూల్య అంటాడు. కొంచెం ఎక్స్‌ట్రాలు ఎక్కువయ్యావని అంటుంది. మేనత్త కూతురివి కదా అని పలకరించాను అని అంటాడు. అమూల్య కోపంగా చూడటంతో నువ్వు మా మేనత్త కూతురివే అని అలా అన్నా తప్పా సరే నేను మీ కాలేజ్ వైపే వెళ్తున్నా రా డ్రాప్ చేస్తా అంటాడు. దానికి అమూల్య చెప్పు చూపిస్తుంది.  విశ్వతో పాటు భద్రావతి కూడా షాక్ అయిపోతుంది. అమూల్య కోపంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా.. నువ్వు ఎంత వెదవవో నాకు తెలుసు. నేను రామరాజు కూతుర్ని ఇంకోసారి నా వెంట పడితే మా అన్నయ్యలకు చెప్తా నిన్నూ ఊరంతా తిప్పి కొడతారు గుర్తు పెట్టుకో అని అంటుంది.

విశ్వ భద్రావతితో దాన్ని పడేయడం అంత ఈజీ కాదు అత్త అని అంటే దాన్ని పడేయడానికి ఆ ఇంట్లో నుంచి మనకు ఎవరో సాయం కావాలి అనుకుంటుంది. ఇంతలో వల్లీ పేపర్ పట్టుకొని ప్రేమ జుట్టు నా చేతికి దొరికిందని గెంతులు వేయడం చూస్తారు. వల్లిని వాడుకోవాలని భద్రావతి అంటే ఆ పిల్ల పెద్ద తింగరిది అత్త దాని వల్ల ఉపయోగం అండదు అని విశ్వ అంటాడు. దానికి భద్రావతి అది ఒత్తి బొమ్మే కానీ ఈ బొమ్మని ఆడించేది దాని అమ్మ అటు నుంచి నరుక్కొని వద్దాం అని అంటుంది.

వల్లి రామరాజుతో మామయ్య గారండీ పేపర్ చదవండి.. అత్యవసర న్యూస్ ఉంది అని ప్రేమ తరిమిన విషయం చూపిస్తుంది. రామరాజు, వేదవతి, తిరుపతి షాక్ అయిపోతారు. ఆ అమ్మాయి అచ్చం మన ప్రేమలా ఉంది కదా అంటే ప్రేమలా ఉండటం ఏంటి మన ప్రేమే కదా అని రామరాజు అంటాడు. ఒకబ్బాయి వెనక ప్రేమ పరుగెత్తడం వెనక పెద్ద మేటర్ ఉంది అని వల్లి అంటే అమ్మా నీకు ఓ దండం నువ్వు ఆగమ్మా అని ప్రేమని పిలుస్తుంది. ప్రేమకి రామరాజు ఆ ఫొటో చూపించి ఏంటమ్మా ఇది అని అడుగుతాడు. ప్రేమ కంగారు పడుతుంది. తను ఎవరు అతని వెనక నువ్వు ఎందుకు పరుగెడుతున్నావ్ అని అడుగుతారు. వల్లీ కూడా  రెట్టించి అడగటంతో నర్మద మనసులో ఇదు మామూలుగా ఎగరడం లేదు కదా అని అనుకుంటుంది. తను చెప్పే వరకు ఉండలేవా.. అంత కడుపు ఉబ్బరం ఏంటి నీకు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.