Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు, వేదవతిలు కొడుకు, కోడళ్లని తీసుకొని బతుకమ్మ వేడుకకు వెళ్తారు. బతుకమ్మ ఏర్పాటు చేసిన దగ్గర చిన్న పిల్లల నాట్యాలు, దండియా ఆడుతూ సందడిగా ఉంటుంది. నర్మద, ప్రేమ, శ్రీవల్లిలు వాళ్లు చేసిన బతుకమ్మలు తీసుకొని బతుకమ్మ దగ్గర పెట్టి సందడి చేస్తారు. ముగ్గురు భర్తలు వాళ్ల భార్యల్ని చూసి సందడి, సంతోషం చూస్తే హ్యాపీగా ఉందని అనుకుంటారు.

Continues below advertisement

రామరాజు వచ్చి మీ భార్యల సంతోషం మాత్రమే కనిపిస్తుంది కానీ వాళ్ల మనసులో ఉండే బాధ మీకు అర్థం కావడం లేదు.. అర్థం చేసుకోలేకపోతున్నారు.. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని పుట్టింటి గడప దాటిటే బాధ పడుతుంది. అలాంటిది శాశ్వతంగా దూరం అయితే ఇంకెలా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ప్రేమిస్తే సరిపోదురా.. వాళ్ల దిగులు అర్థం చేసుకోవాలి.. వాళ్లకి ఏ బెంగ లేకుండా చూసుకోవాలి.. నేను మీ అమ్మని అలాగే చూసుకున్నానురా.. పుట్టింటి గుర్తు రాకుండా చేశా కానీ పుట్టింటికి దూరం అయిపోయా అనే దిగులు లేకుండా చేయలేకపోయా.. ఈ విషయంలో నేను  ఓడిపోయానురా.. నా పరిస్థితి మీకు మీ అమ్మ పరిస్థితి మా భార్యలకు రాకూడదు అనే ప్రేమ పెళ్లి చేసుకోవద్దని చెప్పా.. కానీ మీరు అదే పని చేశారు.. వాళ్లని తీరని బాధ పెట్టారని అంటారు. ముగ్గురు కొడుకులు బాధ పడతారు.

అందరూ బతుకమ్మ ఆడుతుంటే నర్మద, ప్రేమ, వేదవతి బాధగా నిల్చొని ఉంటారు. అప్పుడే భద్రావతి కుటుంబంతో కలిసి వస్తుంది. ప్రేమ చూసి అక్క మావాళ్లు వచ్చేస్తున్నారని అంటే నర్మద పద పద అని పరుగున వెళ్తూ వల్లీని తోసేస్తుంది. వల్లీకి డౌట్ వస్తుంది. వేదవతి కూడా వెళ్తుంటే వల్లి ఆపి ఎక్కడికి అని అంటే పువ్వులు తెస్తా అని వేదవతి కూడా వచ్చేస్తుంది. నర్మద ప్రేమతో ప్లాన్ గుర్తుంది కదా పద అంటుంది. వేదవతి వచ్చి గొడవ ఏం కాదు కదా అని అడుగుతుంది. మీరు ధైర్యం అది ఇదీ అంటారు కానీ మీకు చాలా భయం అని నర్మద అంటుంది. నాది భయం కాదే జాగ్రత్త అంటుంది. బాగా కవర్ చేస్తున్నారు అని నర్మద అనడంతో ఇద్దరు నవ్వుకుంటారు.

Continues below advertisement

నర్మద ప్రేమ వెళ్తూ ప్రేమ తల్లిని ఢీ కొట్టి తల్లి దగ్గర బతుకమ్మ తీసుకుంటుంది. నీకేం కాలేదు కదామ్మ అని ప్రేమ అంటే దానికి నర్మద ప్రేమ ఎంత అరిష్టం ఆపావు నువ్వు.. బతుకమ్మ కింద పడి ఉంటే ఇంక అంతే ఈ బతుకమ్మ నువ్వే తీసుకెళ్లాలి.. కానీ మనకి అర్జెంట్ పని ఉంది కదా అని అంటుంది. భద్రావతి కోపంగా బతుకమ్మ తీసుకోమని రేవతితో అంటుంది.  చేతులు మారితే తప్పు కదా అంటే ఏం కాదు అని భద్రావతి అంటుంది. ఇంతలో వేదవతి వచ్చి ఆ బతుకమ్మ వాళ్లి ఇచ్చేఅని అంటుంది. ప్రేమ బుంగమూతి పెట్టుకొని మన పుట్టింటికి అరిష్టం అన్నా నువ్వు పట్టించుకోవా అని అంటారు. భద్రావతి కోపంగా రేవతిని తీసుకోమంటుంది. అరిష్టం అరిష్టం అని ప్రేమ బతుకమ్మను ఇవ్వదు. 

వల్లీ మొత్తం చూసి అత్తాకోడళ్లు ఏదో చేస్తున్నారు. మామయ్యకి చెప్పాలి అని పరుగులు తీస్తుంది. ఇక వేదవతి తన మాట వినలేదు అని అలిగిపోయినట్లు యాక్టింగ్ చేసి వెళ్లిపోతుంది. ఇక ప్రేమ పుట్టింటి తరుఫున బతుకమ్మ పట్టుకొని వెళ్తుంది. చాలా హ్యాపీగా ఫీలవుతుంది. వల్లీ మామని తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రేమ, నర్మదల్ని కూడా రామరాజు చూస్తారు. మీకు అర్థమైంది కదా మామయ్య అని ప్రేమ అంటుంది. ఇక ప్రేమ పుట్టింటితో కలిసి బతుకమ్మ పెడుతుంది. వేదవతి నర్మదని పక్కకి తీసుకెళ్లి గిరగిరా తిప్పేసి నా బంగారు తల్లి ఎదుటి వారి మనసు అర్థం చేసుకుంటావ్.. ప్రేమ బతుకమ్మ తీసుకెళ్లడం చాలా మందికి చిన్న విషయం కాదు.. మాకు మాత్రం చాలా సెంటిమెంట్ అంటుంది.

నర్మద దగ్గరకు సాగర్ వచ్చి ఎదుటి వాళ్ల బాధ అర్థం చేసుకుంటావ్ వాళ్లకి ఏం కావాలో అది చేస్తావ్ మరి కన్నవాళ్లకి దూరం అయినందుకు నీ మనసులో బాధ నువ్వు ఎవరికీ చెప్పుకోవా.. ఆ బాధ దూరం చేసి సంతోషం అందించమని నన్ను అడగవా  కనీసం నీ కన్నవాళ్లని చూడాలి అని ఉందని నాకు చెప్పవా అని అంటాడు. నర్మద ఏడుస్తుంది. ఇంతలో నర్మద తల్లిదండ్రుల్ని సాగర్ చూపిస్తాడు. నర్మద చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అంత కలగా ఉందమ్మా  అని నర్మద అంటుంది. దీంతో ఇవాళ్టి  ఎపిసోడ్ పూర్తయిపోతుంది.