Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం భద్రావతి వాళ్లకి ప్రేమ ఫొటోలు గురించి చెప్పందని క్లారిటీతో తెలుసుకున్న నర్మద కోపంగా వల్లీ దగ్గరకు వెళ్లి ఫోన్‌ చేస్తావో.. వెళ్లి పిలుస్తావో తెలీదు రేపు పొద్దన్నకి మీ అమ్మ నా ముందు ఉండాలి అంటుంది. ఏంటి మా అమ్మా ఉండాలి.. విషయం ఏంటి అని వల్లీ అడిగితే విషయం రేపే చెప్తా నువ్వు ముందు అర్జెంట్‌గా మీ వాళ్లని పిలుచుకురా అని చెప్తుంది. 

Continues below advertisement

వల్లీ గుచ్చి గుచ్చి అడగటంతో విషయం తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నావ్ సరే నేనే చెప్తా.. ప్రేమ ఫొటోల విషయం గురించి నీకు తెలుసా అని మీకు అడిగాను.. కూనిరాగాలు తీసి తెలీదు అన్నారు.. కానీ రేపు ఆ మేటర్ ఎదురింటి వాళ్లకి ఎవరు లీక్ చేస్తారో నేను తేల్చుతా.. మీరు మీ వెదవ తెలివి తేటలు వాడి ఇక్కడికి రాకుండా తప్పించుకుంటే నేను డైరెక్ట్ మామయ్యకి విషయం చెప్పేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. 

వల్లీ అమ్మకి కాల్ చేసి విషయం చెప్తుంది. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపినట్లు లేదు.. వేడి వేడి పెనం మీద పెట్లినట్లు ఉంది.. ఎప్పుడు పొయ్యిలో పడతానో తెలీదు అని అంటుంది. ఇడ్లీ బాబాయ్ ఏం చేద్దాం అని టెన్ష్ పడతాడు. ఒక వైపు రామరాజు రమ్మన్నాడు ఇప్పుడు నర్మద ముందు పొయ్యి.. వెనక స్టవ్‌ అదీ మన పరిస్థితి అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. భాగ్యం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. 

Continues below advertisement

ధీరజ్‌ తాగిన మత్తులో ఉన్న ప్రేమని బైక్‌లో ముందు కూర్చొపెట్టుకొని తీసుకొస్తాడు. ప్రేమ మత్తులో రకరకాలుగా మాట్లాడుతుంది. నా బుజ్జి ధీరజ.. అది ఎవర్తిరా నీతో మాట్లాడటానికి.. అది మంచి వాచ్ పెట్టుకొని వచ్చింది.. అందుకే దాని టైం బాగుంది.. గుడ్లు పీకేస్తా దానికి అని అంటుంది. ధీరజ్ ప్రేమతో కదలకుండా కూర్చొ అసలే తాగున్నావ్ మా నాన్న చూస్తే ఏంటా పరిస్థితి అని భయంగా ఉందని అంటాడు. దానికి ఎందుకురా అంత భయం మీ నాన్నని చూడొద్దని చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ అని అంటుంది. గుడ్లగూబలో ఎంత అందంగా ఉన్నావే.. పైగా తాగినా కూడా సెన్సాఫ్ హ్యూమర్.. నీ సెన్సాఫ్ హ్యూమర్ తగలెయ్య అని అంటాడు.

తాగిన మైకంలో ఉన్న ప్రేమని ధీరజ్ ఇంటికి తీసుకొస్తాడు. ప్రేమ తూగుతూ ఉంటే ధీరజ్ కష్టపడి తీసుకెళ్లి డోర్ కొడతాడు. వల్లి డోర్ తీస్తుంది. ధీరజ్ షాక్ అయితే ప్రేమ చూసి ఏంట్రా స్మశానానికి తీసుకొచ్చావ్.. దెయ్యం ఉంది ఏంట్రా.. అని అంటుంది. వల్లీ బిత్తరపోతే తను వల్లీ అని ధీరజ్ అంటాడు. వల్లీనా బల్లా దాని తల్లా.. ఏయ్ అగ్గిపుల్ల అక్క నువ్వు నిద్రపోవా.. నైట్ కూడా పడుకోవా అని అడుగుతుంది. దానికి వల్లి ధీరజ్‌తో ఏంటి ప్రేమ తూగుతుంది. కొంపతీసి మందు తాగిందా అని అడుగుతుంది.లేదని ధీరజ్ అంటాడు. ప్రేమ ధీరజ్‌తో నాకు పెద్ద కత్తి కావాలిరా ఈ రాక్షసి బల్లిని పొడిచేసి రక్తం తాగేస్తా అని అనడంతో వల్లి భయపడుతుంది. నిన్ను చంపేస్తా పొడిచేస్తా అని ప్రేమ గోల గోల చేస్తుంది. వల్లీ భయంతో పరుగులు పెడుతుంది.

గదిలోకి వెళ్లిన వల్లి ప్రేమ తాగేసి వస్తావా నీ పని మామయ్యతో చెప్తా ఇక్కడ గంటేస్తే నీ పుట్టింటిలో పడేస్తా అని రామరాజుకి చెప్పడానికి బయటకు వెళ్తుంది. రారాయ్ అంటూ ప్రేమ ఉయ్యాలలో ఊగుతూ కత్తి పట్టుకొని వల్లీని పిలుస్తుంది. నీ చేతిలో కత్తి ఉంది నేను రాను అని వల్లీ అంటే.. నువ్వు రాకపోతే నేను చంపేస్తా అని అంటూ వల్లీ మెడ మీద కత్తి పెడుతుంది. ప్రేమ వల్లీని భయపెడుతూ చిన్ని పిల్లలా సంకలో ఎక్కిపోతుంది. అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావ్ నిన్ను చంపేస్తానే అని ప్రేమ అంటే వల్లీ కాళ్లు పట్టుకొని ఇంకెప్పుడూ తప్పు చేయను అని బతిమాలుతుంది. వల్లీని ప్రేమ డ్యాన్స్ చేయమని చెప్తుంది. డ్యాన్స్ మూమెంట్స్ మర్చిపోతే చంపేస్తా నా కోపం పోయే వరకు డ్యాన్స్ ఆడు అని అంటుంది. వల్లీ డ్యాన్స్‌లు చేస్తుంది. ఇదే డ్యాన్స్ వేరేలా చేయ్ అని గాజు పెంకులు తెస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.