Continues below advertisement

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 04 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 4thr Episod

అన్న పెళ్లిలో ఉండకూడదు..వాడు పొరపాటున వెళ్లిపోతే పిల్లను తమ్ముడికి అంటగడతారు. జీవితాంతం తప్పించుకోలేం అని బాలు గబగబా మాట్లాడేస్తాడు. తర్వాత తన స్నేహితుడి నుంచి శుభలేఖ తీసుకుని..తనని డ్రాప్ చేసేందుకు వెళతాడు. తిరిగి వచ్చేలోగానే... ప్రభావతి నోటి దురుసు చూపిస్తుంది. బయటివారి ముందు బాలు పరువుతీశాడని రోహిణి ఫైర్ అవుతుంది. నీకు అలా అర్థమైందా? వాడు పరువుతీసింది మనోజ్ ది కాదు..మీనాది అని అసలు విషయం సంబరంగా చెబుతుంది. మీనాను పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని..వాళ్ల నాన్న గుదిబండలా తగిలించాడు కాబట్టి కాదనలేక కాపురం చేస్తున్నాననే విషయం ఇన్నాళ్లకు బయటపెట్టాడని అంటుంది. మాటలు విన్న మీనా బాధపడుతుంది. బాలు వెళ్లిపోయిన తరవాత ఇంట్లోంచి వెళ్లిపోతుంది. చీకటిపడి అందరూ ఇంటికి వస్తారు కానీ మీనా రాదు. సత్యం, బాలు కంగారుపడతారు. ప్రభావతి మాత్రం వంటచేయలేదు..ఇంకా రాలేదు..ఊరిపై పడి తిరుగుతోంది అంటూ నోటికి పనిచెబుతుంది. ఏం చేయాలో అర్థకాని బాలు మీనా పుట్టింటికి కాల్ చేస్తాడు. అక్కడకు రాలేదని తెలిసి తన స్నేహితుడు రాజేష్ ని తీసుకుని వెతికేందుకు వెళతాడు.

Continues below advertisement

మరోవైపు మీనా లేకపోవడంతో తాను వంట చేయాల్సి రావడంతో రోహిణి చికాకుపడుతుంది. నాకేం అవసరం అనుకుంటూ విసుక్కుంటుంది. మరి ఇన్నాళ్లూ మీనా ఎలా చేసిందని శ్రుతి అడుగుతుంది. మీనా అంటే చదువుకోలేదు , ఉద్యోగం చేయడం లేదు..మనకేం పని అని మళ్లీ విషాన్ని కక్కుతుంది రోహిణి. శ్రుతి మాత్రం గట్టిగానే ఇచ్చిపడేస్తుంది.

మీనా రూమ్ అంతా వెతకడం ప్రారంభిస్తారు ప్రభావతి, కామాక్షి, శ్రుతి, రోహిణి... లెటర్ దొరుకుతుంది. లెటర్ ఓపెన్ చేసి కామాక్షి చదువుతుంది. నా చావుకి ఎవరూ కారణం కాదు.. ఒక్కరు తప్ప అని ఉందని చదువుతుంది కామాక్షి.. ఒక్కరు మా అత్తగారు అంటుంది. ప్రభావతి షాక్ అవుతుంది. మీరే కదా ఆంటీ తనని టార్చర్ చేశారని శ్రుతి అంటుంది. అమ్మో నా పేరు రాయలేదు బతికిపోయాను అనుకుంటుంది రోహిణి. ఇదే అదనుగా కామాక్షి ప్రభావతిని ఆడుకుంటుంది. సత్యం కూడా ప్రభావతిపై ఫైర్ అవుతాడు.

మరోవైపు చీకటి పడిన తర్వాత మీనాకోసం తిరిగి తిరిగి అలసి పోయి గుడి ముందు నిల్చుని దేవుడికి దండం పెట్టుకుంటాడు బాలు. నేను ఏం తప్పు చేశానో తెలియదు కానీ మీనా కనిపించడం లేదు..నాతో మీనా ఉంటే చాలు.. తను ఎక్కడున్నా నా దగ్గరకు పంపించు అని కన్నీళ్లతో వేడుకుంటాడు. అదే గుడిలో మీనా కనిపిస్తుందో లేదంటే..ఇంకెక్కడైనా ఉందో తెలియాలి. ఫోన్ స్విచ్చాఫ్ చేసేసింది. పూలబండి తీసుకెళ్లకుండా వెళ్లిపోయింది. మీనా పుట్టింట్లో లేదు కాబట్టి నేరుగా బాలుని పెంచిన సుశీలమ్మ ఇంటికి వెళ్లిపోయిందా? బాలుకి ఆ విషయంపై క్లారిటీ వస్తే చాలు నేరుగా వెళ్లి ఎలాగైనా బతిమలాడి ...అవసరం అయితే కాళ్లు పట్టుకుని బతిమలాడిమరీ తీసుకొచ్చేస్తాడు. 

 అసలు తను చేసిన తప్పేంటో బాలుకి అర్థమవుతుందా?

మరోసారి బాలు నోరుజారకుండా ఉంటాడా?