Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ నర్మద దగ్గరకు వచ్చి పార్టీ ఉంది ఏ  డ్రస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు అంటుంది. ఇద్దరం కలిసి సెలక్ట్ చేద్దాం అని నర్మద అంటుంది. ఇంతలో వేదవతి వచ్చి ఏం చేస్తున్నారు అంటే అత్తని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో అని  గూడు పుటానీ చేస్తున్నాం అని నర్మద అంటే నువ్వు అలాంటిదానివే నా మేనకోడల్ని మార్చేస్తావ్ అని అంటుంది. 

Continues below advertisement

నర్మద అత్తతో టెన్షన్ పడొద్దు బ్యాచిలర్ పార్టీకి డ్రస్ సెలక్ట్ చేస్తున్నాం అని చెప్తుంది. ఈ పార్టీల గురించి మీకు తెలీదు మీకు వయసు అయిపోయింది అని నర్మద అంటే చింతపండు వేసిన ఇత్తడి బిందెలా ఉంటాను అని వేదవతి అంటుంది. వేదవతి, నర్మద పొట్లాడుకుంటారు. ప్రేమ ఆపి తర్వాత కొట్టుకుందురు తర్వాత ముందు డ్రస్ సెలక్ట్ చేయండి అంటుంది. నర్మద వాళ్లు డ్రస్ సెలక్ట్ చేయడం మొదలు పెడతారు. పార్టీ కాబట్టి స్టైల్‌గా ఉండాలి అని నర్మద చెప్తుంది. ఊహల్లో డ్రస్ సెలక్ట్ చేద్దాం అని ముగ్గురు ప్రేమ రకరకాల డ్రస్‌లు వేసుకున్నట్లు ఊహించుకుంటారు. 

ప్రేమ ఫస్ట్ జీన్స్ వేసుకుంటుంది. తర్వాత క్రాప్ టాప్ వేస్తుంది. మోకాళ్లు కనిపించడంతో వేదవతి వద్దు వద్దు అని అనేస్తుంది. లంగావోణి చూద్దాం అని నర్మద అంటే చూద్దాం చూద్దాం అని ప్రేమ లంగావోణి రావడంతో వేదవతి అది ఓకే ఓకే అని ఆ డ్రస్ వేసుకోమని అంటుంది. ఇక నర్మద అత్తని వెళ్లిపోమని మేం పర్సనల్‌గా మాట్లాడుకుంటామని అంటుంది. వేదవతిని నర్మద పంపేసి ప్రేమతో ఆ డ్రస్‌ వేసుకొని నువ్వు వెళ్తే మీ ఆయన తన మనసులో ప్రేమ నీకు చెప్పేస్తాడు అని అంటుంది. ఇంట్లో ఉన్న అందరికీ నేనే రొమాన్స్ నేర్పించాలని నర్మద అనుకుంటుంది. 

Continues below advertisement

ధీరజ్ పార్టీకి టైం అవుతోందని ప్రేమని పిలిచి వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో ప్రేమ రెడీ అయి లంగావోణిలో రావడంతో ధీరజ్ ఫ్లాట్ అయిపోతాడు. ప్రేమ రాగానే పార్టీకి వెళ్దాం పద అని అంటాడు. ప్రేమ ధీరజ్‌ తనని పొగడాలని గాజులు బాగున్నాయా.. రింగులు బాగున్నాయా అని అడుగుతుంది. బాగున్నాయ్ రా వెళ్దాం అని ధీరజ్ అంటాడు. పొగడటం లేదు ఏంట్రా నీ కోసం ఇంత రెడీ అయితే కనీసం డ్రస్ బాగుంది అని చెప్పడం లేదని ప్రేమ ముసుగు వేసుకొని ఫీలైపోతుంది. ఇంతలో ధీరజ్ వెనక్కి వచ్చి ఈ డ్రస్‌లో చాలా బాగున్నావ్.. ఏంజెల్‌లా ఉన్నావ్ అని అంటాడు. ప్రేమ ధీరజ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి మురిసిపోతుంది. నర్మద చూస్తే చాలా హ్యాపీగా బాయ్ చెప్తుంది. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని నర్మద అనుకుంటుంది. వేదవతి నర్మద దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది నిజమే అని అంటుంది. 

ప్రేమ, ధీరజ్‌ల మధ్య గొడవలు రాకుండా ఉంటే బాగున్ను అని వేదవతి అంటే మీరు ఏం చేస్తున్నారు.. దగ్గరుండి పెళ్లి చేయడమే కాదు వాళ్ల జీవితం బాగుండాలి అంటుంది. నేనే కాదు నువ్వు కూడా పెళ్లిలో ఉన్నావ్ కదా నువ్వే నీ చెల్లి జీవితం చూసుకో అని అంటుంది. ప్రేమ ఫొటోల గురించి ఎదురింటి వాళ్లకి ఎలా తెలిసిందా అని నర్మద ఆలోచించి వల్లీని గుర్తు చేసుకుంటుంది. ప్రేమ, ధీరజ్ పార్టీకి వెళ్తారు. ఫ్రెండ్స్ అందరూ ధీరజ్, ప్రేమ రాగానే వెల్‌కమ్ చెప్పి సందడి చేస్తారు. ధీరజ్‌తో ఓ ఫ్రెండ్ ఐశ్వర్య వచ్చిందిరా అని చెప్తాడు. వచ్చిందా అని ధీరజ్ ఎగ్జైట్ అవుతాడు. ఇంతలో ఐశ్వర్య గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ధీరజ్ చూస్తూ ఉండిపోతాడు. ప్రేమ ధీరజ్‌ని చూస్తూ ఉంటుంది. ధీరజ్ ప్రేమని చూసి కళ్లు తిప్పుకొని ఐశ్వర్యని చూస్తాడు. 

ఐశ్వర్య డైరెక్ట్‌గా వచ్చి ధీరజ్‌ని హగ్ చేసుకొని హాయ్ చెప్తుంది. ఐశ్వర్యని చూసి ప్రేమ కుళ్లుకుంటుంది. ప్రేమ వెళ్లి ధీరజ్ చేయి పట్టుకుంటుంది. ధీరజ్ ఐశ్వర్యకి ప్రేమని భార్యగా పరిచయం చేస్తాడు. ఐశ్వర్య ప్రేమ ముందు ఇంటర్‌లో ధీరజ్‌తో తన లవ్ గురించి చెప్పి హగ్ చేసుకుంటే ప్రేమ కోపంగా వెళ్లిపోతుంది. నర్మద తిరుపతి దగ్గరకు వచ్చి సాయం అడుగుతుంది. నువ్వు నన్ను స్వతంత్రంగా అడగాలి కానీ ఇలా పర్మిషన్ అడగకూడదు అని 20 రూపాయలు ఇచ్చి పానీ పూరీ తిని వెళ్లు అని అంటాడు. ప్రేమ, కల్యాణ్ ఫొటోల విషయం ఎదురింటి వాళ్లకి ఎవరు చెప్పారో తెలుసుకొని చెప్పు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.