Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్‌ని పోలీసులు జైలులో పెడతారు. రామరాజు వాళ్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి శోభ తండ్రితో మాట్లాడుతారు. నా కొడుకు అలాంటి వాడు కాదు సార్ వాడికి అక్కా, చెల్లి ఉన్నారు అని చెప్తాడు. శోభ తండ్రి రామరాజు మీద సీరియస్ అవుతాడు. నేనే నా కూతుర్ని నీ కొడుకు కారులో ఎక్కించా.. తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొస్తావా అని కోప్పడతాడు.

Continues below advertisement

ధీరజ్‌ తప్పు చేయలేదు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సాగర్, చందులు శోభ తండ్రి మీదకు వెళ్లబోతే రామరాజు ఆపుతాడు. కేసు వాపస్ తీసుకోమని బతిమాలుతాడు. నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తే కేసు వాపస్ తీసుకుంటా అని అంటాడు. రామరాజు గొడవ పెట్టడంతో రామరాజు వాళ్లని బయటకు గెంటేస్తారు. నా కొడుకుని విడిచిపెట్టేవరకు ఇక్కడ నుంచి కదలను అని రామరాజు కూర్చొంటాడు. సాగర్, చందు తండ్రికి ధైర్యం చెప్పి లాయర్‌తో మాట్లాడటానికి వెళ్తారు.

ప్రేమ ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని రామరాజు అడిగితే ప్రేమతో పాటు వచ్చిన నర్మద తనని ఆపడం మా వల్ల కాలేదు అందుకే తీసుకొచ్చానని చెప్తుంది. ధీరజ్‌ని చూడాలి అని ప్రేమ ఏడుస్తుంది. తిరుపతి ప్రేమని ఆపుతాడు. నేను ధీరజ్‌ని చూడాలి అని ప్రేమ ఏడుస్తుంది.

Continues below advertisement

శ్రీవల్లి తల్లీదండ్రులకు విషయం చేరవేస్తుంది. ఈ అవకాశం వాడి ధీరజ్ మీద చాడీలు చెప్పి ధీరజ్ ప్రేమని ఇంటి నుంచి గెంటేలా చేద్దాం అని వల్లీ అంటుంది. రామరాజుకి పిల్లలు అంటే ప్రాణం అలా ఎప్పటికీ చేయడు అని భాగ్యం అంటుంది. మరి ఈ అవకాశం మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని వల్లీ అంటే సానుభూతిని మించిన ఆయుధం ఇంకొటి లేదు అని రామరాజకి ఫోన్ చేస్తుంది.

రామరాజు స్పీకర్ పెట్టి మాట్లాడుతాడు. భాగ్యం ఏడుపు నటిస్తూ ధీరజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది నా గుండె బద్ధలైపోయింది అదీ ఇదీ అని మా పర్సనల్‌ లాయర్ ఉన్నారు పోలీస్ స్టేషన్‌కి పంపిస్తామని మా లాయర్‌ పవర్ ఫుల్ అని చెప్తుంది. రామరాజు పనిలో ఉన్నాను అని ఫోన్ పెట్టేయాలని చూస్తే భాగ్యం ఒప్పుకోదు.. రామరాజు విసిగిపోతాడు. దాంతో నర్మద నేను మాట్లాడుతానని చెప్పి తీసుకుంటుంది. మా లాయర్‌ని పంపిస్తా ఫీజు కూడా మేమే చూసుకుంటాం అని భాగ్యం అనేస్తుంది. దాంతో నర్మద సరే పంపించు 5 నిమిషాల్లో ఇక్కడ లాయర్ ఉండాలి అని అంటుంది. భాగ్యం, వల్లీ బిత్తరపోతారు. సిగ్నల్ లేదు అని ఫోన్ కట్ చేసి తెగ టెన్షన్ పడిపోతారు. లాయర్‌ని ఇప్పుడు ఎక్కడ నుంచి తీసుకొస్తాం అని అనవసరంగా కొత్త టెన్షన్ తెచ్చావని శ్రీవల్లి అంటుంది.

ప్రేమ ధీరజ్‌ని బయట ఉన్న కిటికీ నుంచి చూసి బాధగా సైగలు చేస్తుంది. ఏంట్రా ఇది అని అంటే ధీరజ్ ఇదంతా నా ఖర్మ అంటాడు. నా మాట వినుంటే ఇలా జరిగేది కాదు అని ప్రేమ అంటే నాకు అంత బుర్ర లేదు.. సారీ అని అంటాడు. ప్రేమ ఏడిస్తే సైగ చేస్తూ ఏంటి ప్రేమ ఏడ్వకు అని చెప్పి వెనక్కి తిరిగి ధీరజ్ కూడా ఏడుస్తాడు. నర్మద ప్రేమ దగ్గరకు వచ్చి ఓదార్చుతుంది.

సాగర్, చందు లాయర్ దగ్గరకు వెళ్తారు. కేసు చెప్పగానే ఆడపిల్ల కిడ్నాప్ కేసు అంటే బెయిల్ కష్టం కనీసం 6 నెలలు శిక్ష పడతాయి.. రకరకాలుగా విచారణ చేస్తారు అన్నీ క్లియర్ అయితే అప్పుడు విడుదల చేస్తారు అంటారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు అని చందు అంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అమ్మాయి తండ్రి కారు నెంబరుతో సహా ఫొటో తీశాడు అని అంటారు. ధీరజ్ రిలీజ్ అవ్వాలి అంటే కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకురావాలి అంటారు. చందు, సాగర్ దిగులుగా వచ్చేస్తారు. ఇద్దరూ అమ్మాయిని వెతికే పనిలో ఉంటారు.

ప్రేమ ఏడుస్తుంది.. నర్మద ఓదార్చుతుంది. ధీరజ్ చాలా మంచోడు అక్క నేను వాడి గదిలోనే ఉన్నా నన్ను తప్పుగా చూడడు.. అలాంటిది మరో ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా అని అంటుంది. ఎవరో  కుట్ర చేసినట్లు ఉన్నారు అని నర్మద అంటుంది. ధీరజ్‌తో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తారు. నర్మద కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ధీరజ్‌తో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని చెప్పమని బతిమాలుతారు. దాంతో కానిస్టేబుల్ సరే అని ధీరజ్ దగ్గరకు వెళ్లి  విషయం అడుగుతారు. దాంతో ధీరజ్ జరిగింది చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.