Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి కూల్ డ్రింక్ ఇచ్చి ప్రేమని కూల్ చేయాలని అనుకుంటుంది. అయితే కూల్ డ్రింక్ అనుకొని తిరుపతి మందు కలిపేసిన కూల్ డ్రింక్ తాగేస్తుంది. వల్లీ వణికిపోయి దాక్కుంటుంది. ప్రేమ మాత్రం అక్కాయ్ అని పిలుస్తుంది.
వల్లీ గదిలో ప్రేమని చూసి నువ్వు మళ్లీ వచ్చావా అని ఏడుస్తుంది. ప్రేమ కత్తి పట్టుకొని బుజ్జికి నీ మెడ బాగా నచ్చింది అంట అని అంటుంది. దాంతో వల్లీ ఏడుస్తుంది. నన్ను ఎంటర్‌టైన్ చేయ్ అని ప్రేమ అంటే వదిలేయ్ చెల్లి అని అంటుంది. వల్లీ ప్రేమని ఎత్తుకొని బయటకు తీసుకెళ్తుంది. ప్రేమ కుర్చీ మీద కూర్చొంటే వల్లీ చేతులు కట్టుకొని నిల్చొంటుంది. నీ డ్యాన్స్ చూసి గతసారి బెదిరిపోయా ఇప్పుడు డ్యాన్స్ వద్దు అని డైలాగ్ చెప్తా నవరసాల్లో చెప్పు అని అంటుంది. డైలాగ్ కూడా ప్రేమ చెప్తుంది. అమ్మా.. నేను వల్లిని అందరి జీవితాల్లో వేలు పెట్టే బల్లిని ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని పిల్లిని.. పని పాటలేకుండా అందరి రక్తం తాగే నల్లిని. ఛీ నా బతుకు చెడ అని డైలాగ్ చెప్తుంది. వల్లీ నవరసాల్లో డైలాగ్ చెప్పి అలిసిపోయి ప్రేమ కాళ్లమీద పడిపోతుంది. ప్రేమ నవ్వుకుంటుంది.
ప్రేమ ముత్తులో ధీరజ్ దగ్గరకు వెళ్తుంది. ప్రేమ ధీరజ్ దగ్గరకు వెళ్లి కూర్చొని పడుకున్న ధీరజ్‌ని చూసి ఓరేయ్ చచ్చినోడా ఎంత క్యూటీగా ఉన్నావ్‌రా అని ముద్దులాడుతుంది. ధీరజ్‌ని దోమ కుడితే దాన్ని పట్టుకొని చంపేస్తా నా ధీరజ్‌నే కుడతావా అని దాన్ని చంపేస్తుంది. ప్యాన్ తీసుకొని వచ్చి పెడుతుంది. అందరి ముందు నన్ను భార్య అని ఒప్పుకున్నావ్.. చాలా చాలా హ్యాపీరా అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం ఐలవ్‌యూరా.. అయినా నాకు ఎందుకురా పార్టీలో ముద్దు పెట్టుకున్నావ్ అని అడుగుతుంది. ధీరజ్ బుగ్గలు గిల్లేస్తుంది. ధీరజ్ లేచే టైంకి కింద పడుకుండిపోతుంది. ధీరజ్ చూసి ఇక్కడ పడుకుంది ఏంటా అనుకుంటాడు. ఎవరు గిచ్చారు అనుకుంటాడు. ధీరజ్ పడుకున్నాడు అని ప్రేమ లేచే చూసేసరికి ధీరజ్ కూర్చొంటాడు.
ప్రేమ వాలకం చూసి మందు తాగావా అని అడుగుతాడు. నా గురించి తర్వాత ముందు నువ్వు ఆ రోజు నాకు ముద్దు పెట్టావా లేదా అని అడిగి ధీరజ్ జుట్టు పట్టి పీకేస్తుంది. దాంతో ధీరజ్ పారిపోతాడు. తర్వాత ప్రేమ హాల్‌లో మొత్తం వెతుకుంది. ధీరజ్ వెంట పడుతూ సాంగ్స్ పెట్టి వెంటపడుతుంది. ఆ సౌండ్‌కి నర్మద, వేదవతి లేస్తారు. ప్రేమ కొంప ముంచేలా ఉందని నర్మద అంటుంది. కొంగు కొంచెం భద్రం పిల్లా సాంగ్‌కి డ్యాన్స్ చేస్తుంది. నర్మద, వేదవతి ఆపాలని చూసినా ఆగదు.. ధీరజ్ దాక్కుంటాడు. అత్తా, అక్కలతో కూడా స్టెప్పులేయిస్తుంది. ఇంతలో రామరాజు లేచేస్తాడు. రామరాజు బయటకు వచ్చే టైంకి వేదవతి వెళ్లి స్టెప్పులేసి రామరాజుని ఆపేస్తుంది. ప్రేమ, ధీరజ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఇక నర్మద సాగర్ కూడా డ్యాన్స్ చేస్తారు. ఆ రోజు నాకు ఎందుకు ముద్దు పెట్టావ్ అని ప్రేమ ధీరజ్‌ని అడుగుతుంది. దాంతో నేను పెట్టలేదే అని ధీరజ్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.