గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 24 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 24th Episod
సత్యం ఇంట్లో రూమ్ కోసం గొడవ జరిగిందని.. బాలు మీనా కోసం సెపరేట్ గా రూమ్ కట్టిస్తున్నారని తెలుసుకుంటుంది శ్రుతి తల్లి శోభ. ఇదే అవకాశంగా ఆ ఇంట్లో చిచ్చుపెట్టేందుకు వెళుతుంది. దీపావళి రోజు ఇంట్లో అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇస్తుంది శోభ. రూమ్ కోసం మళ్లీ గొడవ జరిగిందని విన్నాను.. ఇదిగో నా వంతు సాయం అని 5 లక్షల చెక్ ఇస్తుంది. ప్రభావతి ఉత్సాహంగా తీసుకోవాలి అనుకుంటుంది. రోహిణి కూడా హమ్మయ్య ఇక మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని లోలోపల ఉత్సాహపడతారు. కానీ బాలు మాత్రం అడ్డుకుంటాడు. తీసుకో అమ్మా ఆగిపోయావ్ ఏం...ఆ 5 లక్షలతో మంచి రూమ్ కట్టించవచ్చు అంటాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని అంతా అనుకుంటారు. ఏంటండీ అలా అంటున్నారని మీనా అనగానే.. అవును మంచి రూమ్ కట్టిస్తే ఆవిడ , ఆమె భర్త వచ్చి ఇక్కడే ఉంటారు అంటాడు బాలు. మాకేం అవసరం ఇక్కడ వచ్చి ఉండేందుకు అని కోప్పడుతుంది శోభ. ఇప్పుడే కదా మనం అంతా ఓ కుటుంబం ...అందుకే ఈ డబ్బులు ఇస్తున్నా అని..అందుకే మీరిచ్చిన డబ్బులతో కట్టించిన రూమ్ లో మీరే వచ్చి ఉండండి అని సెటైర్ వేస్తాడు బాలు.
మీ కుటుంబం స్తోమత ఏంటో తెలుసుకాబట్టే ఇస్తున్నా..నెల నెలా చందాలు వసూలు చేసినట్టు అందర్నీ ఇబ్బందిపెట్టడం ఎందుకు అని ఇస్తున్నా అంటుంది. ఇంకా సత్యాన్ని అవమానించేలా మాట్లాడుతుంటే ఇక ఆపవమ్మా అని బాలు ఫైర్ అవుతాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే అని వేలు చూపిస్తాడు. ఏంటి వేలు చూపిస్తున్నావ్..పైపైకి వచ్చి మాట్లాడుతున్నావ్ ఏంటి కొడతావా అని మరింత రెచ్చగొడుతుంది శోభ. ఇక్కడి నుంచి వెళ్లకపోతే మెడపట్టి బయటకు గెంటేస్తా అని బాలు అనగానే..సత్యం వచ్చి చాచి కొడతాడు. తండ్రిని అవమానిస్తుంటే అడ్డుకున్న తనపై తండ్రి చేయిచేసుకోవడం భరించలేకపోతాడు బాలు. తాను వచ్చిన పని అయింది..కుటుంబంలో సంతోషం మాయమైందనే ఉత్సాహంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది శోభ.
శోభ వెళ్లిపోగానే అంతా బాలుని టార్గెట్ చేస్తారు. బుద్ధిలేదా అని ప్రభావతి అంటుంది, తల్లికి భార్యకు మర్యాద ఇవ్వలేని మొరటు మనిషి అని శ్రుతి... వాళ్లను ఇంట్లోంచి గెంటేయాలని ప్లాన్ చేస్తున్నావా అని రోహిణి... ఆవిడ తప్పుచేసి ఉండొచ్చు మధ్యలో నువ్వు ఎందుకు మాట్లాడావ్ అని రవి అంతా తప్పుపడతారు. అంతా ఆపండి.. ఆవిడ మాటలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతిశాయ్. మీ అమ్మ కిచెన్, హాలు మాత్రమే తీసుకొచ్చింది. లోన్ తీసుకుని నేనే మొత్తం కట్టించాను. బుద్ధి ఉంటే ఎవ్వరూ పుట్టింటినుంచి తీసుకొచ్చిన డబ్బుని తీసుకోవద్దని అర్థమైంది. నేను ఈ వయసులో కష్టపడలేను..ఎలా జరగాలి అనుకుంటే అలానే జరుగుతుంది వదిలేయండి అనేసి వెళ్లిపోతాడు.
రూమ్ కి వెళ్లిన తర్వాత శ్రుతి ఫైర్ అవుతుంది. మా అన్నయ్య లో కాదు నీలో ఉంది తప్పు... ఇక్కడి ప్రతిమాటా నువ్వు అక్కడకు చేరవేయడం సరికాదు. మా ఇంట్లో రూమ్ కి మా అమ్మ ఎందుకు డబ్బు ఇవ్వాలి అనగానే...మనోజ్ అని అడగలేదేం అని అంటుంది. వాడి బిజినెస్ కోసం పంపించారు.. మా నాన్న తీసుకోలేదు. కానీ ఇక్కడ మీ అమ్మ మా నాన్నన హర్ట్ చేసింది. మా మావయ్యను ఎందుకు అంటున్నావని అడిగి ఉంటే బాలు అన్నయ్య మాట్లాడి ఉండేవాడు కాదుకదా అని క్లాస్ వేస్తాడు. బాలు చేసింది తప్పు అంటుంది శ్రుతి.. అది కరెక్ట్ ని మా నాన్నే అనలేదు కదా అని రవి క్లారిటీ ఇస్తాడు. మధ్యతరగతి ఇళ్లలో కొత్త ఖర్చులువస్తే అప్పులు చేయకతప్పదు..కాబట్టి రూమ్ కట్టడానికి ఇబ్బంది ఉంది కానీ..ఎవరి దయా ధర్మాల మీద రూమ్ కట్టాలని అనుకోవడం లేదు అంటాడు. ఇంకెప్పుడూ మీ అమ్మతో మనింటి విషయాలు డిస్కస్ చేసేముందు నాతో చెప్పు ఓసారి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మేడపై ఉన్న మీనా..అంతా బాలుని అన్నమాటలు గుర్తుచేసుకుని ఏడుస్తుంది. ఇంతలో సత్యం అక్కడకు వెళ్లి నాపై కోపంగా ఉందా అని అడుగుతాడు. ఆయన మీ కొడుకు మావయ్య అంటుంది. కొడుకు అంటే ఎప్పటికీ కొడుకే అంటుంది. నన్ను అపరాధ భావం వెంటాడుతోందంటాడు సత్యం. ఆయన మనసు వేరు, ఉద్దేశం వేరు అది అర్థం చేసుకోకుండా అందరూ తలోమాట అన్నారు...అందుకే బాధ అనిపించింది అంటుంది మీనా. మీపై ఆయనకు కోపం ఉండదు..మీరు బాధపడకండి అంటుంది.
మీనాన్న నీవల్ల ఓ తప్పు జరగకుండా ఆపారు అని బాలుకి సర్దిచెబుతాడు రాజేష్. రూమ్ కట్టేందుకు ఒక్కరం కూడా సాయం చేయలేకపోతున్నాం అని బాధపడతాడు. ఆ రూమ్ గొడవ ఎందుకు అని రాజేష్ అడిగితే..అది మాకోసమే అని చెప్తాడు. రూమ్ కోసం జరిగిన గొడవంతా చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో మీనా వెయిట్ చేస్తుంటుంది ఇంటికి వెళతాడు బాలు. తూలిపడబోతుంటే తండ్రి సత్యం పట్టుకుని తాగివచ్చావా? ఏమైనా తిన్నావా? నేను కొట్టాను అని తాగావా? అని అడుగుతాడు. అందుకు కాదని చెప్పు మీనా అని రిప్లై ఇస్తాడు బాలు. నాది కోపంలా కనిపించిందా? వర్షంలో తడిస్తే తండ్రికి వచ్చేది కోపమా బాధా? అని అడుగుతాడు. నాకు అన్ని తెలివితేటలు లేవు...అన్ని ఉంటే మనోజ్ గాడిలా డబ్బు నేను ఎత్తుకుని పోయేవాడిని అంటాడు.
కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే! ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి