Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు మందు తాగుతూ ఉంటూ బావ ఒక్క పెగ్గు అంటూ తిరుపతి వెళ్తాడు. రామరాజు తాగిన మత్తులో ఆ ప్రసాద్‌రావు నేను అల్లారుముద్దుగా పెంచుకున్న నా కొడుకుని ఇల్లరికం పంపించమని అడుగుతాడేంట్రా.. గుండెలో బాధగా ఉందిరా అని రామరాజు ఫీలవుతాడు. తిరుపతి మాత్రం నిజమే బావ కానీ ఒక్క పెగ్గు ఇవ్వు అని మందు అడుగుతూ ఉంటాడు.
సాగర్ ఎందుకురా నామోషీగా ఫీలవుతున్నాడు. రైస్‌మిల్లే వాడిదిరా ఎందుకు అంతలా నామోషీగా ఫీలవుతున్నాడు.. ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు.. ఇప్పుడు నా చుట్టూ అన్నీ ఉన్నాయి అని రామరాజు బాధ పడుతుంటే తిరుపతి మాత్రం మందు గోలలో ఉంటాడు. ఆయన ఎవరో మాట వరసకు అన్నాడు బావ వదిలేయ్ ముందు నాకు మందు పోయ్ అని తిరుపతి అంటాడు. నువ్వు నాకు మందు పోయవా ఈ రోజు మందు ఎలా తాగాలో నాకు తెలుసు అని వెళ్లిపోతాడు.
వల్లి రామరాజు మందు తాగడం చూసి హమ్మయ్యా ఉన్న ఒక్క బాటిల్ మామయ్య తాగేశారు. ఇక ప్రేమ మందు తాగే అవకాశమే లేదు. నా జోలికి వస్తుంది అనే భయం కూడా లేదు ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకుంటుంది. అయితే తిరుపతి తనకు బావ మందు పోయలేదు అని వేరే బాటిల్ తీసుకొచ్చి ఓ కూల్‌డ్రింక్ బాటిల్‌లో మందు కలిపేస్తాడు. సరిగ్గా తాగే టైంకి వేదవతి వచ్చి ఏం చేస్తున్నావ్రా అని అడుగుతుంది. ఏం లేదు అక్క కూల్డ్రింక్ అని అంటాడు. అక్కకి ఏనాడు అయినా కూల్డ్రింక్ కొనిచ్చావారా నాకు ఇవ్వరా అని వేదవతి తీసుకొని వెళ్లిపోతుంది.
వేదవతి హాల్లోకి వెళ్లి తాగే టైంకి నర్మద వచ్చి మీరు ఒక్కరే తారేస్తారా అని అంటుంది. నీకు ఇస్తాలే అని అంటుంది. ఇద్దరూ తాగే టైంకి ప్రేమ వచ్చి లాక్కుంటుంది. ప్రేమ దగ్గర నుంచి వల్లీ లాక్కుంటుంది. ఈ ఇంట్లో పెద్ద కోడల్ని నేను ఏదైనా నాకు కాస్త ఎక్కువ కావాలి అంటుంది. ఎప్పుడూ కూల్గ్రింక్ తాగని వాళ్లలా నలుగురు కూల్ డ్రింక్ కోసం కొట్టుకుంటారు. చివరకు నర్మద నలుగురం గేమ్ ఆడుదాం ఎవరు గెలిస్తే వాళ్లే మొత్తం తాగొచ్చు అని అంటుంది.
నర్మద ట్రూత్ ఆర్ డేర్ ఆడుదాం అని అంటుంది. నలుగురు కూర్చొని గేమ్ ఆడుతారు. మొదట వేదవతి నిజం చెప్తా అనడంతో నర్మద అత్తతో ఈ రోజు మీరు మామయ్యకి ఎన్ని ముద్దులు పెట్టారు అని అడుగుతుంది. ఏయ్ ఇదేం ప్రశ్నే అని వేదవతి నోరెళ్ల బెడుతుంది. వేదవతి చెప్పకుండా నా వల్ల కాదు నేను ఓడిపోయాను అని తప్పుకుంటుంది. తర్వాత ప్రేమ వంతు వస్తుంది. ప్రేమ కూడా ట్రూత్ అంటుంది. దాంతో నర్మద ప్రేమకు ధీరజ్ అంటే నీకు చచ్చేంత ప్రేమ అవునా కాదా అని అడుగుతుంది. కూల్ డ్రింక్ కోసం నన్నే ఇలా ఇరికించావా అని పాస్ అని చెప్పేస్తుంది. వల్లీ మనసులో ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మరి చెప్పడం లేదు ఏంటి అని వల్లీ అనుకుంటుంది.
నర్మద వంతు వస్తే వల్లీ ప్రశ్న అడుగుతా అని అంటుంది. నువ్వు సాగర్ కలిసి మామయ్య గారికి తెలీకుండా ఏదో గూడు పుటానీ చేస్తున్నారు ఏంటి అది అని అడుగుతుంది. గూడు పుటానీ పల్లీ బటానీ లేదు పాస్ అని నర్మద అంటుంది. దాంతో వల్లీ మీరంతా ఓడిపోయారు నేనే గెలిచాను అని అంటుంది. కూల్ డ్రింక్ మొత్తం వల్లీ తీసుకుంటుంది. ప్రేమకి కూల్ డ్రింక్ ఇచ్చి కూల్ చేసేస్తా అని ప్రేమకి కూల్ డ్రింక్ ఇస్తుంది. ప్రేమ మొత్తం తాగేస్తుంది. ప్రేమ వాలకం మారిపోయింది ఏంటా అని వల్లీ అనుకుంటుంది. ఎక్కడో కొడుతుందే అని వల్లీ అనుకుంటుంది. ఇంతలో తిరుపతి వచ్చి బాటిల్ మొత్తం తాగేశారా ఇది కూల్ డ్రింక్ కాదు మందు అని చెప్తాడు. వల్లీ బిత్తరపోతుంది. మంచం చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అక్కాయ్ ఇటు రారాయ్ అని నన్ను వాయించేస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ అక్కాయ్ అని పిలుస్తుంది. వల్లీ వణికి పోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.