Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమతో క్యాబ్ డ్రైవర్‌గా చేరానని చెప్తాడు. నీకు ఇష్టమే కదా అని అంటాడు. ప్రేమ ఏం మాట్లాడకుండా అన్నం తినిపిస్తుంది. రామరాజు, వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నేను అనాథని పిలవడానికే ఎవరూ లేని లేరు పోయేటప్పుడు మోయడానికి నలుగురు ఉంటారో లేరో అని చాలా బాధ పడేవాడిని.. ఇప్పుడు నాకు ఈ కుటుంబమే సర్వస్వం. నా కుటుంబాన్ని నేను వీడలేను.. కోడి తన పిల్లల్ని పట్టుకున్నట్లు నేను పట్టుకునే ఉంటాను. నా నుంచి నా పిల్లల్ని ఎవరూ దూరం చేసినా నేను ఊరుకోను అని రామరాజు బాధ పడి ఏడుస్తాడు.
సాగర్ నర్మదతో మా నాన్నకి ఎందుకు సారీ చెప్పావ్.. అంటే నేను తప్పు చేశా అనే కదా అని అంటాడు. మీ నాన్న బాధ పడుతున్నాడు అని అలా చెప్పాను అని నర్మద అంటుంది. నన్ను ఇల్లరికం అడిగినందుకే మా నాన్న అంత బాధ పడితే ఒక్కగానొక్క కూతురి అయిన నీకు సంబంధం లేకుండా ఉండటం తప్పే కదా.. మీ నాన్న అలా అడగటంలో తప్పేముంది. దానికి మా నాన్న అంత పంచాయితీ పెట్టడం కరెక్టేనా అని అంటాడు. సాగర్ ఇది మనకు చిన్న విషయమే కానీ కన్నవాళ్లకి ఇది పెద్ద విషయం అని అంటుంది. కన్న వాళ్లకి దూరం అయిన కూతుర్ని తన వాళ్లకి దగ్గర చేయాలి అనుకోవడం తప్పు ఎలా అవుతుంది. అది మా నాన్నకి ఎందుకు అర్థం కావడంలేదు చెప్పు అని అంటాడు. నీ బాధ ప్రతీక్షణం పక్కన ఉండే నాకు తెలుస్తుంది కానీ మా నాన్నకి ఎలా తెలుస్తుంది.. నేను మా నాన్నతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మధ్యలో సారీ చెప్పావ్ నాకు నచ్చలేదు నర్మద అని సాగర్ కోపంగా ఉంటాడు. సాగర్‌ని కూల్ చేయడానికి నర్మద ముద్దు పెట్టి కూల్ చేస్తుంది.
విశ్వ ముగ్గు పెడుతున్న వల్లీతో అమూల్య నా గురించి ఏం అంటోదని అడుగుతుంది. అమూల్యతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పు అని అంటాడు. నా వల్ల కాదు నన్ను చంపేస్తారని శ్రీవల్లి అంటే భద్రావతి వచ్చి వాళ్లకి కాల్ చేయండిరా పది లక్షలు ఇచ్చేయమని చెప్దాం అంటుంది. సరే చెప్తా అని వల్లీ అంటుంది. నువ్వేం చెప్పొద్దు కానీ అమూల్యని సందు చివర ఉన్న షాప్‌కి తీసుకురా మేం మాట్లాడుకుంటాం అని భద్రావతి అంటుంది. వల్లీ సరే అని అంటుంది.
వల్లీ వెళ్తుంటే నర్మద ఎదురు పడి వాళ్లతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. మాట్లాడటం కాదు వాళ్లతో పోట్లాడుతున్నా అని చెప్తుంది. ఏం విషయం అని అడిగితే వల్లీ తడబడుతుంది. మామయ్య గురించి బ్యాడ్ మాట్లాడారని చెప్తుంది. కావాలనే నర్మద ముందు వార్నింగ్ ఇస్తుంది. ముందు నీ కాపురం గురించి చూసుకో ఈ వార్నింగ్‌లు ఎందుకు అని నర్మద అంటుంది. వల్లీ దేవుడికి దండం పెట్టుకుంటూ తన భర్తకి తన మీద చాలా చాలా ప్రేమ ఉండేలా చేయు స్వామి అని మొక్కుకుంటుంది.
చందు దగ్గరకు వెళ్లి మాట్లాడమని వల్లీ అడుగుతుంది. చందు ఏం మాట్లాడడు తప్పించుకొని వెళ్లిపోతుంటే నువ్వు మాట్లాడకపోవడం కంటే నేను చనిపోవడం మంచిది బా.. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని ఏడుస్తుంది. దాంతో చందు వచ్చి వల్లీని హగ్ చేసుకుంటాడు. ముద్దు కూడా పెట్టుకుంటాడు. వల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మా ఆయన నాకు ముద్దు పెట్టాడోచ్ అంటూ ఇళ్లంతా తిరుగుతూ చిందులేస్తుంది.
వల్లీ గెంతులు హాల్లో ఉన్న నర్మద, వేదవతి, ప్రేమ చూస్తారు. వింతగా చూస్తారు. శ్రీవల్లి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. నర్మద వల్లీతో నువ్వేంటి ప్రపంచంలో మా ఆయన నీకు ముద్దు పెట్టినట్లు అంతలా మెలికలు తిరిగిపోతావ్.. మా ఆయన కూడా నాకు ముద్దు పెట్టాడు నేను అరిచానా.. మామయ్య గారు కూడా అత్తయ్య గారికి ముద్దులు పెట్టుంటారు నీలా అరిచి గోల చేశారా.. అంతెందుకు బ్యాచిలర్ పార్టీలో ప్రేమని ధీరజ్ ముద్దు పెట్టాడు. మరి ప్రేమ కూడా నీలా పార్టీ నుంచి మా ఆయన నాకు ముద్దు పెట్టాడు అని గోల చేసిందా ఏంటి అని అంటుంది. నువ్వేంటే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్ అని వేదవతి నర్మదని అడుగుతుంది. వల్లీ ముందు చెప్పావ్ అని ప్రేమ సైగ చేస్తుంది. నర్మద సారీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.