Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమకి ధీరజ్ గులాబి ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ప్రేమ పొంగిపోతుంది. తీరా చూస్తే ప్రేమ ధీరజ్ గులాబి పట్టుకొని రావడంతో ఊహించుకుంటుంది. ధీరజ్‌ ప్రేమని పిలిచి ఉన్నట్టుండి ఏ లోకం లోకి వెళ్లావ్ అని అంటాడు. నీ లోకంలోకే అని ప్రేమ అంటుంది. నీతో ఓ విషయం చెప్పాలి అని ధీరజ్ అంటే నాకు ఆవిషయం తెలుసు. ముందే నా మనసుకి తెలిసిపోయిందని అంటుంది.  నువ్వు చెప్పే మాట ఎప్పుడెప్పుడు వింటానా అని మనసు ఆరాటపడుతుందని ప్రేమ అంటుంది.

Continues below advertisement

ధీరజ్‌తో త్వరగా చెప్పరా అని అంటే ధీరజ్ ప్రేమకి గులాబి ఇస్తాడు. ప్రేమ లవ్ ప్రపోజ్ చేస్తాడు అనుకుంటే ధీరజ్ ప్రేమతో ఈ పువ్వు నీకు ఆ పాప ఇవ్వమని చెప్పింది.. నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుందని అంటాడు. ప్రేమ డిసప్పాయింట్ అయిపోతుంది. ఇదే చెప్పాలి అనుకున్నావా అని అంటుంది. అవును అని ధీరజ్ వెళ్లిపోతాడు. ప్రేమ గాలి తీసేసిన బెలూన్‌లా అయిపోతుంది. మొత్తం రివర్స్ అయిపోయిందని అనుకుంటుంది. నర్మద వేరే వాళ్లతో మాట్లాడుతూ ఉంటే సాగర్ చూసి చిట్టినడుమునే చూస్తున్నా అని సాంగ్ వేసుకుంటాడు. నర్మదని చూసి ఏది అయితే అది అయింది అని అనుకొని నడుం గిల్లేస్తాడు. నర్మద అరిస్తే చూసుకో బంగారం అని అంటాడు. సచ్చినోడా అని నర్మద సాగర్ వెనక వెళ్తే సాగర్ నర్మదని గోడ చాటుకి తీసుకెళ్తాడు. దాంతో ఇదేం మాయదారి బుద్ధిరా నీకు అని తిడుతుంది. మీ ఆయన రొమాంటిక్ కింగ్ అని నర్మదని తెగ గోకేస్తాడు. ముద్దు ఇవ్వమని సాగర్‌ నర్మదని అడుగుతాడు. ఇంతలో ఇంకో ఇద్దరు వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అంటే సాగర్ భజన అంటాడు. భజన తలుపు వెనక చేయరు అని వాళ్లు అంటారు. ఒక్కటివ్వు అని సాగర్ అంటే తప్పదా ఒకటివ్వాలా అంతేనా అని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. ఒకటి చాలా ఇంకొకటి కావాలి అని అడుగుతుంది. సాగర్ అలిగి బుంగమూతి పెట్టుకుంటే చేతితో ముద్దు పెడుతుంది.

రామరాజు దగ్గరకు నర్మద తండ్రి వెళ్లి మీతో మాట్లాడాలి అని అంటాడు. ఆయన రామరాజుతో సాగర్‌ని ఇల్లరికం పంపిచమని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని రామరాజు అడుగుతాడు. నేను ఇలా మాట్లాడటం సబబు గానే ఉంది అందులో మర్యాద కూడా ఉంది అని అంటారు. ఏం మాట్లాడుతున్నారని రామరాజు అడిగితే మీ అబ్బాయి మీ దగ్గర ఉంటే ఎప్పటికీ రైస్ మిల్లులోనే ఉండిపోతాడు. అదే మాతో ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసుకొని మా స్థాయికి తగ్గట్టుగా ఉంటాడు అని ప్రసాద్‌ అంటారు. నా కొడుకు రైస్ మిల్లు ఓనర్‌ అని ఈ ఊరిలో నాకు మర్యాద ఉంది.. నా రైస్‌ మిల్లే మాకు గొప్ప అని రామరాజు అంటాడు. దానికి ప్రసాద్ మీకు ఊరిలో మర్యాద ఉంది అన్నారు ఇందాక కలెక్టర్ వస్తే మిమల్ని పట్టించుకోలేదు అదే నా కూతురు మీరు తన మామయ్య అనగానే మీకు మర్యాద ఇచ్చారు.. మీలా రైస్ మిల్లులో పని చేస్తే మీ కొడుకుకు మర్యాద ఉండదు అని ప్రసాద్ అంటారు. నా కొడుకు నాతోనే నా రైస్‌మిల్లులో ఉంటాడని అంటాడు.

Continues below advertisement

రామరాజు ప్రసాద్ గొడవ పడుతుంటే సాగర్, నర్మద, వేదవతి, నర్మద తల్లి విమల వస్తారు. సాగర్ తండ్రిని గొడవ వద్దు అంటాడు. ఇంతలో ప్రసాద్ రామరాజుతో నేనుం ఊరికే ఇక్కడికి రాలేదు మీ కొడుకు పిలిచాడు. మీరు మాతో మాట్లాడాలి మా కుటుంబంతో కలవాలి అని మీ కొడుకే బతిమాలాడు.. మీ కూతురికి మా ఇంట్లో అన్నీ ఉన్న మీరు లేని లోటు తీర్చలేకపోతున్నాం అన్నాడు అందుకే వచ్చాం.. మేం మిమల్ని మీ కొడుకుని అంగీకరించాలి అంటే మీ కొడుకు ఇల్లరికం రావాల్సిందే అంటాడు. మేం తనని బాగా చూసుకోవడం లేదా.. మా ఇంట్లో సంతోషంగా లేదా అని రామరాజు వెళ్లిపోతాడు.

భద్రావతితో భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుతారు. మీ పది లక్షలు ఇచ్చేస్తాం అని అంటుంది. ఎందుకు అని భద్రావతి అడిగితే మీరు మాతో పెట్టుకున్న డీలింగ్ వదిలేస్తాం అని అంటుంది భాగ్యం. ఆరోజు సరే అని ఈ రోజు వద్దు అంటావ్ ఏంటి అని అంటుంది. మీరు నా కూతురిని ఆ ఇంట్లో ప్రత్యేక హోదా రావడానికి మీరు సాయం చేస్తే మీకు మేం సాయం చేస్తాం అని అంటుంది. ఏం చేయాలి అని భద్రావతి అడిగితే నర్మద పొగరు అణచాలి అందుకు మీరు సాయం చేయాలి.. నర్మదకు గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా చేయాలని చెప్తుంది. విశ్వ భద్రావతితో ఓకే చెప్పమని అంటాడు. నర్మద ఉద్యోగం పోయింది మీరు హ్యాపీగా ఉండండి అని అంటుంది భద్రావతి.

ప్రేమ ధీరజ్‌తో కలిసున్న ఫొటోల లాకట్ పట్టుకుని నువ్వు అంటే నాకు ఇష్టంరా కానీ నా ప్రేమ చెప్పాలి అంటే భయంగా ఉంది. ఈ లాకెట్ నీకు ఇస్తా నా ప్రేమ తెలిసేలా చేస్తా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.