Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమని గ్రౌండ్‌కి తీసుకెళ్లడానికి బయటకు వస్తాడు. నర్మద, సాగర్ కూడా రెడీ అయి గుడికి బయల్దేరుతారు. రెండు జంటలు చెరో వైపు నుంచి వస్తూ ఉంటారు. రెండు జంటలు బయటకు వెళ్తూ బయట ముగ్గు వేస్తున్న వల్లీని చూసి చెరోవైపు దాక్కుంటారు.

Continues below advertisement

వల్లీ ముగ్గు పెడుతుంటే తిరుపతి, రామరాజు బయట నుంచి వస్తూ ఉంటారు. తిరుపతి వల్లీ దగ్గరకు వెళ్లి ఏరి కోరి మంచి కోడల్ని తీసుకొచ్చావని పొగిడేస్తారు. మనం బయటకు వెళ్లడం కుదరదురా.. ఈ డ్రస్‌లో నన్ను మామయ్య చూస్తే ఇక అంతే అని ప్రేమ ధీరజ్‌తో చెప్తుంది. దాంతో ధీరజ్ ఐడియా అని ప్రేమని లోపలికి తీసుకెళ్తాడు. 

మరోవైపు నర్మద, సాగర్ కూడా మామయ్యకి దొరికిపోతాం అని టెన్షన్ పడతారు. ఉదయమే గుడికి ఎందుకు అని అడుగుతారని రిజల్ట్స్‌ గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడతారు. ఇక ధీరజ్ ప్రేమకి ఓ చీర ఇచ్చి కట్టుకోమని చెప్తాడు. దగ్గరుండి ప్రేమకి చీర చుట్టేస్తాడు. ఇక ఇద్దరూ బయటకు వస్తారు. రామరాజు చూసి ఎక్కడికిరా అని అడిగితే ధీరజ్ గుడికి అని చెప్తాడు. గుడికి అంట అని నర్మద, సాగర్ నోరెళ్లబెడతారు. నీది ఎప్పుడూ గుడికి వెళ్లే ముఖం కాదు కదరా అని రామరాజు అడుగుతాడు. ఇక జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్తాడు.

Continues below advertisement

వల్లీ ధీరజ్, ప్రేమల షూ చూసి ఇద్దరినీ ఆపుతుంది. ఇక ప్రేమతో చీరని ఎవరైన కట్టుకుంటారు నువ్వేంటి చుట్టేశావ్.. ఎక్కడో తేడా కొడుతుంది అని అంటుంది. తేడా లేదు ఏం లేదు వెళ్లనివ్వు వల్లీ అని రామరాజు అంటారు. ప్రేమ, ధీరజ్ వెళ్లిపోతారు. ఇక నర్మద, సాగర్ మనం ఏం చేద్దాం అని అనుకుంటారు. 

నర్మద, సాగర్ గోడ దూకుతుంటే వల్లీ చూసేస్తుంది. ఎక్కడికి అని అడిగితే చల్లగాలి కోసం వచ్చామని అంటారు. సాగర్ మరిది ఇంత పొద్దున్న లేవరు కదా అని అంటే నీకు మామయ్య పిలుస్తున్నారు.. ఇంతకు ముందే కోడలు అంటే నీలా ఉండాలి అని పొగిడారు అని అంటుంది. దాంతో వల్లీ తన మంచి పేరు అని వెళ్తుంది. ఇంతలో నర్మద, సాగర్ గోడ దూకేస్తారు. ఇద్దరూ గుడికి వెళ్లిపోతారు. ఇద్దరూ గుడికి వెళ్లి పూజలు చేసుకొని మాట్లాడుకుంటారు. నువ్వు కచ్చితంగా వీఆర్‌ఓ అవుతావు అని నర్మద అంటుంది. ఈ జాబ్‌ నాకు వస్తే భర్తగా గెలిచాను అనే సంతోషం చాలా ఉంటుంది నర్మద అని సాగర్ చెప్తాడు. మీ నాన్న చాలా గర్వంగా ఉంటారు. నా కూతురిలాగే అల్లుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని పొంగిపోతారు  అని అంటాడు. ఇదే కచ్చితంగా జరుగుతుంది అని నర్మద అంటుంది. 

అమూల్య కాలేజ్‌కి వెళ్తూ ఉంటే విశ్వ చూసి నిన్ను అడ్డు పెట్టుకొని మీ నాన్నని మానసికంగా చంపేయడానికి ఎంతో దూరం లేదు అని అనుకుంటూ అమూల్యని ఫాలో అవుతాడు. అమూల్య దగ్గరకు వెళ్లి డ్రాప్ చేస్తా బైక్ ఎక్కు అంటాడు. అక్కర్లేదు అని అమూల్య అంటుంది. విశ్వ ఫాలో అవుతూ రమ్మని పిలుస్తాడు. ఇక అమూల్య విశ్వ ఇచ్చిన చైన్‌ వేసుకోవడం చూసి విశ్వ అమూల్యని చూసినవ్వుతాడు. అమూల్య బైక్ ఎక్కుతుంది. వేదవతి, రామరాజు ఇద్దరూ కూరగాయల కోసం వెళ్లి వస్తుంటారు. ఇక విశ్వ బైక్‌లో అమూల్య వెళ్లడం వేదవతి చూసేస్తుంది. ఇదేంటి విశ్వ బైక్‌లో అమూల్య వెళ్తుంది డ్రస్ కూడా సేమ్ ఉంది అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.