Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమని పోలీస్‌ని చేస్తా అన్న విషయం మీద రామరాజు పంచాయితీ కొనసాగుతూ ఉంటుంది. పుల్లల వల్లీ ప్రేమ ఉద్యోగం చేస్తే మళ్లీ ఎదురింటి వాళ్లు నడిరోడ్డు మీద మామయ్యగారి షర్ట్ చింపేస్తారు అని గతంలో జరిగిన గొడవ గుర్తు చేస్తుంది. పాపం మామయ్య గారు అప్పటి బాధ నుంచే కోలుకోలేదు.. మళ్లీ ప్రేమ జాబ్ చేస్తే మళ్లీ మామయ్యకి సిగ్గులేదా అని అవమానిస్తారని రామరాజుని రెచ్చగొట్టేస్తుంది.
ధీరజ్ వల్లీని అడ్డుకొని ఎందుకు వదినా అలా అంటారు అలా ఏం జరగదు అని అంటే ఎందుకు జరగదు అదే జరుగుతుంది అని రామరాజు అంటాడు. వేదవతితో మీ వాళ్ల గురించి నీకు తెలీదా.. మొన్నటికి మొన్న నర్మదని అడ్డుపెట్టుకొని నా మీద పడ్డారు.. నేనే వాళ్ల ఆస్తులు సీజ్ చేయించా అన్నారు. అందుకే ప్రేమ ఉద్యోగం చేయడానికి వీళ్లేదు.. పోలీస్ అవ్వడానికి అస్సలు కుదరదు అని రామరాజు చెప్పేస్తాడు. ధీరజ్ తండ్రితో సారీ నాన్న ప్రేమ కలని నిజం చేయడం నా బాధ్యత అని నిర్ణయించుకున్నా. నా బాధ్యత నేను నెరవేర్చుతా.. ప్రేమని పోలీస్ చేస్తా అని అంటాడు. నన్నే ఎదురిస్తావా.. నా మాట కాదు అంటే నా నిర్ణయం కఠినంగా ఉంటుంది అని రామరాజు అల్టిమేటం జారీ చేస్తాడు.
కడుపు నిండిపోయింది.. కళ్ల చల్లబడ్డాయి అని శ్రీవల్లి బులెట్ బండి మీద పుట్టింటికి పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఇడ్లీబాబాయ్ చూసి మిర్చిలాంటి నా కూతురు వచ్చింది అని గెంతులేస్తాడు. బులెట్ మీద నా కూతురు వచ్చింది అంటే నా దశ దిశ మార్చడానికే అని అంటాడు. శ్రీవల్లి తల్లీదండ్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఈ సంతోషానికి కారణం ఏంటి అని భాగ్యం అడిగితే ప్రేమకి ఫుల్‌గా మా మామయ్య తిట్టాడు అని జరిగింది చెప్తుంది. ప్రేమ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఇక నర్మద కూడా ఏదో ఒకదానిలో ఇరుక్కుపోతే ఇద్దరితో జోడు గుర్రాల స్వారీ చేసేస్తా అని గంతులేస్తుంది.
ప్రేమ మామ మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటే ధీరజ్ వచ్చి పక్కనే కూర్చొని ఏంటి చాక్లెట్ పోయిందా.. అలిగి పుట్టింటికి వెళ్లిపోతావా అని అడుగుతాడు. ఎందుకురా మీ నాన్నని ఎదురు తిరిగావ్,, గొడవ పడ్డావ్ అని ప్రేమ అడుగుతుంది. నీ డ్రీమ్ నిజం చేస్తా అనడం తప్పేముంది.. అది ఆయన తెలుసుకోవాలి కానీ మొండిగా ఉండటం ఏంటి.. రేపు ఏదో జరుగుతుంది అని ఈ రోజు నిన్ను ఆపేయడం ఏంటి అని అంటాడు. నా వల్ల నీకు మీ నాన్నకు గొడవ జరిగితే నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదురా.. నాకు పోలీస్ జాబ్ వద్దు ఏం వద్దు అని అంటుంది. అలా అయితే నేను ఓడిపోయినట్లు అని ధీరజ్ అంటాడు. భార్య కల నిజం చేసి తన కల నెరవేర్చడం నా బాధ్యత అని అంటాడు.
ధీరజ్ వెళ్లిపోయిన తర్వాత నర్మద రావడంతో ప్రేమ విషయం చెప్తుంది. దాన్నే ప్రేమ అంటారు ప్రేమ నీ డ్రీమ్ నెరవేర్చడానికి తను తన తండ్రినే ఎదురిస్తున్నాడు అని చెప్తుంది. నువ్వు అంటే ధీరజ్‌కి ఆకాశం అంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అంటుంది.
రాత్రి రామరాజు ఉమ్మడి కుటుంబం మొత్తం ఆరు బయట కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కటి వదులుతా.. కవిత్వం చెప్తా అని తిరుపతి అంటే అందరూ వద్దు వద్దు అని బతిమాలుతారు. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో సేనాపతిని బెయిల్ మీద తీసుకొని భద్రావతి వస్తుంది. భద్రావతి రామరాజు వినేలా.. వాళ్లు చేసిన అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తా అని అంటుంది.
సేనాపతి ఇంట్లోకి వెళ్తూ కూతుర్ని మాట్లాడాలి రామ్మా అని పిలుస్తాడు. ప్రేమ వెళ్తుంది.. ధీరజ్ కూడా వెనకే వెళ్తుంటే రామరాజు ఆపుతాడు. ప్రేమ తండ్రి దగ్గరకు వెళ్తుంది. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు.. మీ అమ్మకి సంవత్సరం పట్టింది కోలుకోవడానికి.. ఇప్పుడు నువ్వు పొడిచిన వెన్నుపోటుకి ఈ జీవితం సరిపోదు అమ్మా నేను కోలుకోవడానికి.. నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా అంత సంతోషం లేదు.. కూతురు పుట్టగానే మహాలక్ష్మీ పుట్టిందని సంతోషపడ్డా.. నా సంతోషమే నా కూతురు అని పొంగిపోయాను.. కానీ నువ్వే ఈ నాన్నకి శత్రువు అవుతావు అని ఊహించలేకపోయానమ్మా.. కన్నతండ్రిని అరెస్ట్ చేయించే అంత గొప్ప ఎత్తుకి ఎదుగుతావని ఊహించలేకపోయాను అని ఏడుస్తాడు. ప్రేమ కూడా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.