Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమకు సర్‌ఫ్రైజ్ ఇస్తాను అని చెప్పి కారులో ఎక్కించుకుంటాడు. ప్రేమకి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తే నువ్వే పెట్టు అని ప్రేమ అనడంతో ధీరజ్ పెడతాడు. ప్రేమ ధీరజ్‌ని చూస్తూ ఏంటీ.. ఏంటీ కొత్త వరస.. అంటూ సాంగ్ వేసుకుంటుంది. సర్‌ఫ్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది.
కాలేజ్‌కి బయల్దేరుతున్న అమూల్య దగ్గరకు వల్లీ వెళ్లి సండే బుక్ పట్టుకొని నీ జాతకం మామూలుగా లేదు.. ఊహించని మలుపులు తిరుగుతాయి.. ఎవరు నీతో ఏం చెప్పినా నీకు మంచి చేయడం కోసమే జరుగుతాయి. ఎవరు ఏం చెప్పినా పాజిటివ్‌గా తీసుకో అని చెప్తుంది. ఇంతకీ నువ్వు ఏ రాశి చదివావు వదినా.. నువ్వు చదివింది నా రాశి కాదు అని అమూల్య అంటుంది. అమూల్య కాలేజ్‌కి వెళ్లాలి టైం అవుతుంది అని అమూల్య అంటే వల్లీ పక్కనే కూర్చొపెట్టుకొని ఆ విశ్వ గాడు ఇంకా నీ వెంట పడుతున్నాడా.. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయి అని నేను చెప్పా ఏం ఆలోచించావ్ అని అడుగుతుంది. వాడో వెధవ వదినా ఇంకోసారి నా దగ్గరకు వచ్చి వాడు ఇంకోసారి చెప్తే వాడి సంగతి చెప్తా అని అంటుంది. వాడి మీద నీకు ప్రేమ మొదలైంది అని వల్లీ అంటే నాకు అలాంటిది ఏం లేదు వదినా అని అమూల్య అంటే లేదు ప్రేమ ఉంది తెలుసుకో అని వల్లీ అంటుంది. నాకు టైం అయిపోయింది వదినా అని అమూల్య వెళ్లిపోతుంది. కొంత వరకు దారిలోకి వచ్చింది అని వల్లీ అనుకుంటుంది.
ధీరజ్ ప్రేమని ఓ చెప్పుల షాప్‌కి తీసుకొస్తాడు. చెప్పుల షాప్‌కి ఎందుకు తీసుకొచ్చావురా అని ప్రేమ అనగానే కూరగాయలు కొనడానికి అని చెప్తాడు. వెటకారం ఆపి ఎందుకో చెప్పరా అని అంటే నువ్వు పోలీస్ అవ్వాలి అనుకున్నావ్ కదా ప్రాక్టీస్ చేయడానికి షూ ఉండాలి కదా అంటాడు. వద్దు అని ప్రేమ అంటే ఏం పర్వాలేదు.. మా నాన్నే కాదు ఎవరు చెప్పినా నీ కల నెలవేర్చాల్సిందే అని అంటాడు. ఇక ప్రేమ కోసం ధీరజ్ షూ సెలక్ట్ చేస్తాడు. షాప్‌లో ఉన్న వ్యక్తి ప్రేమకి షూ వేస్తూ ఉంటాడు.
ధీరజ్ అది చూసి అతను ప్రేమ కాలు ముట్టుకోవడం చూసి ఇబ్బందిగా ఫీలవుతాడు. ప్రేమ కూడా ధీరజ్‌ని ఉడికించడానికి అతనితో చాలా చాలా మోడల్స్ మార్పిస్తూ ఉంటుంది. దాంతో ధీరజ్ నేను చూసుకుంటా భయ్యా మీరు మీ పని చూసుకోండి అని ప్రేమకి షూ వేస్తాడు. అతను నా పాదం ముట్టుకోగానే చాలా పొసెసివ్ అయిపోయావ్ ఏంటి సంగతి అని అడుగుతుంది. నేను ఎందుకు ఫీలవుతా అని అంటాడు. ఏంటి మ్యాటర్ ప్రేమ అడుగుతుంది. అంత సీన్ లేదు అని ధీరజ్ అంటే అయితే లేవరా అతని పని అతను చేస్తాడు అని ప్రేమ అంటే ఇది కూడా నా బాధ్యత అని ధీరజ్ ప్రేమకి షూ వేస్తాడు. ప్రేమ మురిసిపోతుంది. తర్వాత ఇద్దరూ రిటర్న్ వెళ్తూ ఉంటే ఆ పెద్దయన బ్యాగ్ ప్రేమ చూస్తుంది. బ్యాగ్ నువ్వు ఇచ్చేయ్ నేను వెళ్లిపోతా అని ప్రేమ దిగుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ బాధ్యత అని అంటుంది.
అమూల్య కాలేజ్‌కి వెళ్తూ ఉంటే విశ్వ ఫాలో అవుతాడు. అమూల్య దగ్గరకు వచ్చి బైక్ ఆపి నీతో మాట్లాడాలి అని అంటాడు. దానికి అమూల్య నువ్వు ఎవడ్రా నాతో మాట్లాడటానికి.. నీతో నాకు ఏంట్రా మా వాళ్లకి తెలిస్తే నిన్ను చంపేస్తారు అని అంటుంది. చెప్పేయ్ అమూల్య నన్ను చంపేస్తారు అంతే కదా.. నేను చనిపోయిన తర్వాత అయినా నీకు నా ప్రేమ తెలుస్తుంది. ఒకప్పుడు నాకు మీ కుటుంబం అంటే ఎంత ద్వేషం ఉండేది.. ఇప్పుడు నీ మీద ప్రేమ కూడా అంతే నిజం అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.