Illu Illalu Pillalu Serial Today Episode చందు ఇద్దరు తమ్ముళ్లకి వాళ్ల భార్యల విలువ చెప్తాడు. ఇద్దరూ మిమల్ని నమ్ముకొని మిమల్ని ప్రేమించి తన వాళ్లని వదిలేసి మీ కోసం వచ్చారురా.. వాళ్లకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా దూరం పెడితే వాళ్లేమైపోతారురా.. వాళ్లు అందర్ని వదిలేసి అనాథుల్లా మీ కోసం వచ్చారు మీరు ఇప్పుడు దూరం పెట్టి నిజంగా వాళ్లని అనాథల్ని చేయకండిరా అని చందు చెప్తాడు. ప్రేమ, నర్మదలు ఏడుస్తూ ఉంటారు.
ప్రేమ: అక్క మనం ఈ ఇంట్లో ఎవరిమో.. మన స్థానం ఏంటో అర్థం కావడం లేదు. అంతా శూన్యంలా అనిపిస్తుంది. నిజంగా మనం దురదృష్టవంతులం కదా అక్కా. నర్మద: అవును ప్రేమ నిజంగా మనం దురదృష్టవంతులం. మనల్ని కట్టుకున్నవాళ్లు మనతో మాట్లాడటం లేదు.. అత్తమామలు మన ముఖం చూడటానికి అసహ్యించుకున్నారు. ఈ ఇంట్లో అందరూ మనల్ని దూరం పెడుతున్నారు.ప్రేమ: మనం కన్నవాళ్లకి దూరం అయినా అత్తమామల ప్రేమ మనకి కన్నవాళ్ల ప్రేమని మరిపించేది. మనవాళ్లు మనకు లేరు అనే బాధ దూరం చేసింది. నర్మద: కానీ ఇప్పుడు ఈ ఇళ్లు మనది కాదు.. ఈ ఇంట్లో వాళ్లు మనల్ని దూరం పెడుతున్నారు ఆ బాధ భరించడం నరకంలా ఉంది.ప్రేమ: అక్క ఎవరూ మనతో మాట్లాడరు అనేది ఒక బాధ అయితే అత్త మాట్లాడట్లేదు అనే బాధమాత్రం మరో ఎత్తు. నర్మద: అమ్మ ఒడిలో తల పెట్టి పడుకుంటే ఎంత బాధ అయినా తేలికైపోతుంది. కానీ మన బాధ చెప్పుకోవడానికి అమ్మ ప్రేమ మనకు దూరంగా ఉంది. ప్రేమ: అమ్మలాంటి అత్త ఒడి కూడా ఇప్పుడు మనకు దూరం అయిపోయింది. మా అమ్మతో మాట్లాడే అవకాశం లేదు అనే బాధ తప్ప అమ్మ మాట్లాడట్లేదని బాధ ఎప్పుడూ లేదు కానీ మొదటి సారి ఇప్పుడు అమ్మ గుర్తొస్తుంది అక్క. చాలా చాలా గుర్తొస్తుంది. నర్మద: నాకు కూడా అమ్మ పక్కనే ఉంటే బాగున్ను అనిపిస్తుంది. వేదవతి: ఇద్దరు కోడళ్ల మాటలు విని ఏడుస్తూ ఇద్దరి మధ్య కూర్చొని ఇంకోసారి అమ్మ లేదు అని ఎవరైనా అంటే కాళ్లు విరగ్గొడతాను. అమ్మ గుర్తొస్తుందంటా.. అమ్మ పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తుందంటా.. మరి ఇక్కడున్నదెవరు దెయ్యమా..
వేదవతి అలా అనడంతో నర్మద, ప్రేమ సంతోషంతో వేదవతి భుజంపై వాలిపోతారు. ముగ్గురు ఏడుస్తారు. ఉదయం శ్రీవల్లి కంగారుగా లేచి అచ్చబాబోయ్ ఇంత పెద్ద పీడ వచ్చింది ఏంటి నా తాళాలు ఏవి.. అని తాళాలు వెతికి పట్టుకొని దేవుడా ఎవరో తీసుకున్నారని చాలా భయపడిపోయా.. ఈ ఇంట్లో నా మాటే శాసనం అన్నట్లు ఉండిపోయేలా చూడు దేవుడా.. తోడికోడళ్లతో ఆడుకోవాలి. అత్త ఆ కోడళ్లని అసహ్యించుకోవాలి. మామయ్య నేను చెప్పే ప్రతీ దానికి గొర్రెలా తలాడించాలి దేవుడా ఇప్పుడైతే తోడికోడళ్లతో ఓ ఆట ఆడుకుంటా అని బయటకు వెళ్తే అక్కడ నర్మద, ప్రేమ, వేదవతిలు ఒక్కటై నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి వల్లి బిత్తరపోతుంది. వాట్ ఈజ్ దిస్ ప్రకృతి వైపరిత్యం పొద్దున్నే ఏంటిరా దేవుడా ఇది అని కళ్లు తిరిగి పడిపోతుంది.
నర్మద, ప్రేమలు నీళ్లు చల్లి లేపుతారు. వల్లి కంగారుగా మీ ఇద్దరూ అత్తయ్యగారితో కలిసిపోయారా.. అని అడుగుతుంది. వల్లీ అని అరుస్తూ వేదవతి వస్తుంది. నర్మద వేదవతికి కన్ను కొడుతుంది. దాంతో వేదవతి నేను వీళ్లతో కలిసిపోవడం ఏంటి నాన్‌సెన్స్.. వీళ్లతో కలిసిపోవడం కలలో కూడా జరగదు అని అంటుంది. దానికి నర్మద తాను కూయకపోతే తెల్లారదని అనుకుందంట ఓ కోడి.. అని అత్తని చూసి అంటుంది. ఇక ప్రేమ అయితే మీరు మాట్లాడకపోతే మాకు పొద్దు పోదా తెల్లారదా గొంతులో ముద్ద దిగదా అని అంటుంది. నన్ను ఇలా అంటారా మీ కొప్పులు కత్తిరించేయాలి అని అత్త అంటే మీరు గయ్యాలి.. కోడళ్లని కాల్చుకుతినే అత్త అని అంటారు. ముగ్గురు గొడవ పడినట్లు వల్లి ముందు తెగ నటించేస్తారు. వల్లి అది చూసి ఇది నిజంగానే గొడవ లేక డ్రామాలా ఏం అర్థం కావడం లేదు.. ఇలాంటి షాక్ తగిలింది ఈ రోజు ఇంకేం జరుగుతాయో అనుకుంటుంది.
చందు కోసం ఇంటికి పదిలక్షలు అప్పు ఇచ్చిన సేటు వస్తాడు. రామరాజు గారు రామరాజు గారు అని అరుస్తాడు. చందు అది విని షాక్ అయిపోతాడు. సేటు తన తండ్రితో విషయం చెప్పేస్తాడని భయపడి సేటుని బతిమాలి పక్కకి తీసుకెళ్తాడు. మీకు ఇవ్వాల్సిన అమౌంట్‌కి చెక్ ఇచ్చాను కదా అంటాడు. నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. అకౌంట్‌లో డబ్బు లేకపోయినా చెక్ ఇస్తావా మీ నాన్నకి చెప్తా ఆగు అంటాడు. నర్మద చూసి ఏమైంది బావగారు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. దాంతో చందు నా జాబ్ కోసం వచ్చారని అంటాడు. చందు సేటుని బతిమాలడం నర్మద చూస్తుంది. సేటు చందు కాలర్ పట్టుకోవడం మొత్తం చూస్తుంది. చెక్కు బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు సేటు.. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది మొత్తం నేను సెట్ చేస్తా అంటాడు. మీ నాన్నకే ఆ డబ్బు అడిగి తీసుకుంటా అని సేటు అంటాడు. చందు కాళ్లు పట్టుకోవడానికి కూడా రెడీఅయిపోతాడు. సేటు రేపు ఉదయం వరకు టైం ఇస్తాడు.
నర్మద చందు దగ్గరకు వెళ్లి ఏంటి మీ ప్రాబ్లమ్ జాబ్ విషయం అయితే అతను మిమల్ని ఎందుక బెదిరిస్తాడు. మీరు ఎందుకు ఆయన్ని బతిమాలుతారు అని అడుగుతుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏంట్రా పెద్దోడా ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదని చందు అంటే నువ్వు ఒట్టి అమాయకుడివిరా ఎంత పెద్ద విషయం అయినా నీలో నువ్వు పెట్టుకొని బాధపడతావు కానీ బయటకు చెప్పవు ఏమైందో చెప్పురా నీలోనువ్వు బాధ పడకురా అని అంటారు. నర్మద చందుతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి అందరం కలిసి పరిష్కరించుకుందాం అంటుంది. ఇది చిన్న విషయం నేను చూసుకుంటా నర్మద ఇక ఈ విషయం కూడా ఎవరికీ చెప్పొద్దు అని అంటాడు.
చందు శ్రీవల్లిని లాక్కొని వస్తాడు. ఎక్కడికి బా అని వల్లి అడిగితే మీ ఇంటికి మా నాన్న ఫేక్ చెక్ ఇచ్చాడు. ఆ సేటు మన ఇంటికి వచ్చాడు. కొంచెం ఉంటే నేను అతని దగ్గర పదిలక్షల అప్పు తీసుకున్నట్లు తెలిసిపోయేది.. అదే జరుగుంటే నేను మా నాన్నకి నా ముఖం చూపించకుండా ఎక్కడికైనా పారిపోయే వాడిని. మీరు దొంగ చెక్కు ఇచ్చి నన్ను మోసం చేశారు. బా నేను మా అమ్మావాళ్లకి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటా అంటుంది.చందు వల్లీని ఫోన్ కాదు ఇంటికెళ్లి తేల్చుకుందాం అని ఈడ్చుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.