Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ప్రేమ నగలు తాను తీసుకొని తన గిల్ట్‌ నగలు ప్రేమ నగల్లో కలిపేస్తుంది. ప్రేమ తల్లి ఆ నగలు గుర్తు పడుతుంది. కానీ మళ్లీ గొడవలు అవుతాయని ఎవరితో చెప్పదు. తిరుపతి ఇచ్చి వచ్చేయడంతో శ్రీవల్లి నగలు చక్కగా చూశారా.. తీసుకున్నారా.. ఏమైనా అన్నారా అని అడుగుతుంది. అన్నిసార్లు అడుగుతావేంటి అని తిరుపతి అడుగుతాడు. ఆ నగలు వాళ్లు తీసుకున్నారని తెగ సంతోషపడుతుంది.

శ్రీవల్లి తిరుపతిని అడగటం ప్రేమ చూస్తుంది. ఏంటి నన్ను దొంగలా చూస్తున్నావ్ అని వల్లి ప్రేమని అడిగితే నీ ప్రవర్తన దొంగలానే ఉందని అంటుంది. ఆ నగలు నీవా.. నాకు లేని బాధ నీకు ఎందుకు ఉంది.. నువ్వు ఎందుకు ఆ నగల విషయంలో అంతలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావ్ అని శ్రీవల్లిని నిలబెట్టి ప్రశ్నించేస్తుంది. శ్రీవల్లి నీళ్లు నములుతుంది. ప్రేమ ప్రశ్నించడంతో నేను ఈ ఇంటి పెద్ద కోడలిని కదా అందుకే అడిగాను అని కవర్ చేసి వెళ్లిపోతుంది. ప్రేమ వల్లి ప్రవర్తన తేడాగా ఉందని కాస్త దృష్టి పెట్టాలని అనుకుంటుంది. 

సాగర్ గదిలో కూర్చొని ఉంటే నర్మద వెళ్లి పక్కనే కూర్చొంటుంది. సాగర్ లేచి వెళ్లిపోతుంటే ఆపుతుంది. సాగర్‌ని పట్టుకొని హగ్ చేసుకొని సాగర్ ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు నాతో మాట్లాడు ప్లీజ్. అత్తయ్య మామయ్య నాతో మాట్లాడటం లేదు ఆ బాధే నేను భరించలేకపోతున్నా ఇప్పుడు నువ్వు కూడా దూరం పెడితే నేను భరించలేను నాతో మాట్లాడు సాగర్ అని ఏడుస్తుంది. సాగర్ మాత్రం ఏం మాట్లాడకుండా నర్మద చేయి తీసేసి పక్కకి వెళ్లిపోతాడు. నీతో మాట్లాడనందుకే నీకు ఇంత బాధ ఉంటే నడిరోడ్డు మీద మా నాన్న చొక్కా చింపేసి ఘోరంగా అవమానించారు మా నాన్న చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా అంటాడు. ప్రేమ డ్యాన్స్‌ క్లాస్‌కి నాకు ఏం సంబంధం లేదు అని నర్మద అంటే ఇంకా అబద్ధాలు చెప్తున్నావ్ చూడు నాకు బాధగా ఉందని అంటాడు. ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అని నర్మద అంటే సాగర్ కోపంగా నమ్మించాలి అని చూసిన వాళ్ల మీద ప్రేమ కాదు అసహ్యం వస్తుందని అంటాడు. నర్మద కుప్పకూలి పోయి ఏడుస్తుంది. 

శ్రీవల్లి తల్లికి కాల్ చేస్తుంది. నువ్వు చెప్పినట్లే చేశానమ్మ నగలు మార్చేశానని అంటుంది. తల్లి చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. ఇక ప్రేమ డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లడం పెద్ద గొడవ అవ్వడం అత్త ఇద్దరు కోడళ్లని దూరం పెడుతుందని అంటుంది. వల్లితో వాళ్ల అమ్మ ఇదే నీకు మంచి అవకాశం మీ అత్త మళ్లీ కరిగిపోకముందే నువ్వు  చేయాల్సిన పని ఉందని ప్లాన్ చెప్తుంది. వెంటనే అల్లుకుపోతానని శ్రీవల్లి చెప్తుంది. 

ప్రేమ ధీరజ్‌ తనని వస్తువులా చూస్తున్నాడని చెప్పిన మాటలు తలచుకొని బాధగా కూర్చొంటుంది. ధీరజ్ సంతోషంగా ప్రేమ దగ్గరకు వెళ్లి నీకో సర్‌ఫ్రైజ్ అని అంటాడు. ప్రేమ మాత్రం బాధగా కన్నీరు పెట్టుకుంటుంది. నీకో సర్‌ఫ్రైజ్ అది చూసి నువ్వు ఎగిరి గంతులేస్తావ్ అని చెప్పి ఎంత పిలిచినా ప్రేమ ఉలుకు పలుకు ఉండదు. ధీరజ్ పేపర్‌ తీసి ఇదిగో నీ డ్రీమ్ నీ ఎంబీఏ ఎంట్రన్స్ అప్లికేషన్ అని ఇస్తాడు.  ప్రేమ అప్లికేషన్ చింపేస్తుంది. ధీరజ్ కోప్పడితే నేను ఒక వస్తువుని నా గురించి నీకు ఎందుకు అని అడుగుతుంది. నీ లైఫ్ ఇదే కదా అని ధీరజ్ అంటే ఒకప్పుడు నా లైఫ్ అదే కాని ఇప్పుడు నా లైఫ్ ఇంకొకటి. నిన్ననే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఆ క్లారిటీ నువ్వే ఇచ్చావ్ అని అంటుంది. నీ మాటలు నాకు అర్థం కావడం లేదని ధీరజ్ అంటాడు.

దానికి ప్రేమ నా మనసు అర్థమైతేనే నీకు మాటలు అర్ధమవుతాయి అని అంటుంది. నీ జీవితం నాశనం చేసుకోకు అని ధీరజ్ అంటే నాకు జీవితమే లేదు ఇంక నాశనం చేసుకోవడానికి ఏం ఉంది నా గురించి ఎక్కువ ఆలోచించకు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. శ్రీవల్లి సీరియస్‌గా బ్యాగ్ సర్దేస్తుంది. చందు ఎంత అడిగినా ఏం చెప్పదు. బ్యాగ్ పట్టుకొని నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా అని అంటుంది. శ్రీవల్లి బయటకు వెళ్లడం రామరాజు చూస్తాడు. అందరూ అక్కడికి వస్తారు. ఏమైంది అని రామరాజు అడిగితే నేను ఇక్కడ ఉండలేను అండీ ఈ ఇంట్లో ఉండటం నా వల్ల అస్సలు కావడం లేదండీ అందుకే మా పుట్టింటికి వెళ్లిపోతున్నా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!