Illu Illalu Pillalu Serial Prema's Twist 'గోవింద చూడవయ్య వీళ్ళిద్దరి మాయ గోల.. ఇద్దరి మధ్య హేట్ యూ.. అంటూ హ్యాపీ మూవీలో జెనీలియా, అల్లుఅర్జున్ ఒకర్ని ఒకరు ఇరిటేట్ చేసుకున్నట్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో జరుగుతోంది. ఇంతకీ ఎవరు ఎవర్ని ఇరిటేట్ చేస్తున్నారో తెలుసా.. అదేనండీ మన పెద్ద రాయుడు రామరాజు ఇంట్లో ప్రేమ ధీరజ్‌ని తెగ ఇరిటేట్ చేసేస్తోంది. ఈ మధ్య ధీరజ్‌ని వెంట పడి మరీ లవ్ చేసేస్తున్న ప్రేమ సడెన్‌గా మళ్లీ పాత ప్రేమలా మారిపోయి ధీరజ్‌ని టార్చర్ చేయడానికి కారణమేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ధీరజ్, ప్రేమల జంట భలే క్యూట్‌గా ఉంటుంది. వరసకు బావమరదళ్లు అయిన వీళ్లు ఇంటి గొడవల కారణంగా టామ్ అండ్ జర్రీల్లా ఉంటారు. అనుకోకుండా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడంతో అందరూ ఈ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లితో ప్రేమ, వేదవతిల పుట్టిళ్లు రామరాజుని మరింత దారుణంగా చూస్తున్నారు. అయితే మొదటి నుంచి గిల్లిగజ్జాలు ఆడుకునే ధీరజ్, ప్రేమల్లో ధీరజ్ తనకోసం చదువుకుంటూ పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడటం చూసిన ప్రేమకు భర్త ధీరజ్ మీద ప్రేమ మొదలవుతుంది. భర్తకి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్న ప్రేమ ఇంట్లో ఎవరికీ తెలీకుండా డ్యాన్స్ క్లాస్‌లు చెప్తుంది. ఆ విషయం ప్రేమ పుట్టింట్లో తెలిసి రచ్చ చేస్తారు. రామరాజుని నడిరోడ్డు మీద నిలబెట్టి బట్టలు చింపేసి దారుణంగా అవమానిస్తారు. ఈ టైంలో ధీరజ్.. తండ్రి అవమానానికి ప్రేమ కారణం అని ప్రేమ మీద కోపం పెంచుకుంటాడు.
ఒక టైంలో ప్రేమతో గొడవ పడి నిన్ను నేను భార్యగా కాదు కదా మనిషిలా కూడా చూడటం లేదు.. ఇంట్లో వస్తువులు ఎలాగో నువ్వు నాకు అలాగే నా దృష్టిలో నువ్వు ఓ వస్తువువే.. కేవలం నీ మెడలో తాళి కట్టినందుకు నీకు తిండి, నీ అవసరాలు తీర్చడం నా బాధ్యత అని అంటాడు. ధీరజ్ మాటలకు ప్రేమ గుండె ముక్కలైపోతుంది. అప్పటి నుంచి ధీరజ్‌కి టార్చర్ మొదలవుతుంది. ధీరజ్ ఏ పని ప్రేమకు చెప్పినా నేను వస్తువుని కదా.. వస్తువులు పని చేయవు.. వస్తువులు మాట్లాడవు.. వస్తువులు తినవు అంటూ ధీరజ్ తాటతీస్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో అయితే ఈ జంట మధ్య సీన్స్ సీరియల్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు..
ధీరజ్ ఉదయం నిద్ర లేచేసరికి గది మొత్తం పొగ ఉంటుంది. కంగారు పడిన ధీరజ్ ఎదురుగా చూసేసరికి ప్రేమ చేతబడి చేసినట్లు ధీరజ్ ఫొటో చుట్టూ చేతబడి ముగ్గు వేసి ఆ ఫొటోకి ధూపం వేసి గంట కొట్టి తెగ హడావుడి చేస్తేంది. చేతబడి చేస్తున్నావానే అని ధీరజ్ అడిగితే కాదు లేరా కంగారు పడకు.. నా మెడలో తాళి కట్టినందుకు నన్ను చూసుకోవడం నా అవసరాలు తీర్చడం నీ బాధ్యత అన్నావు కాబట్టి నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని పూజ చేస్తున్నా అంటుంది. ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ ధీరజ్‌కి కాఫీ పెట్టి ఇవ్వమని చెప్తుంది. నీకు పిచ్చా నాకు చెప్తున్నావ్ అని ధీరజ్ అంటే నన్ను చూసుకోవడం నీ బాధ్యత అన్నావు కదా నాకు సంబంధించి ప్రతీ పని నువ్వే చేస్తా అన్నావు కదా ఇప్పుడు తీసుకురా అంటుంది.
ధీరజ్ కిచెన్‌లోకి వెళ్లి తిప్పలు పడి కాఫీ తెస్తాడు. ప్రేమ చక్కగా రాళ్లతో ఆడుకుంటూ కాఫీ తాగుతుంది. తర్వాత ఆకలేస్తుంది అంటుంది. ఇప్పుడే కదే గేదె కుడితి తాగినట్లు కాఫీ తాగావ్ అంటాడు. ముందు నేను చెప్పినట్లు పుల్లట్ల పుల్లాయమ్మా హోటల్‌కి వెళ్లి నాలుగు పుల్లట్లు తీసుకురా అంటుంది. ఓసేయ్ అది నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందే నా దగ్గర బైక్ కూడా లేదు అని ధీరజ్ అంటే నాకు అదంతా తెలీదు.. నన్ను చూసుకోవడం నీ బాధ్యత వెళ్లి తీసుకురా అంటుంది. నేను తీసుకురాను అని ధీరజ్ అంటే బాధ్యత అని రాసిన స్లోగన్ చూపించి ధీరజ్‌ని పంపిస్తుంది. ధీరజ్ తిట్టుకుంటూ వెళ్తాడు. ప్రేమ ఓరేయ్ ధీరజ్ అంటూ పెద్ద కుండ పగలగొడుతుంది. ఇక ధీరజ్ టిఫెన్ తీసుకురాగానే మొత్తం లాగించేస్తుంది. ఓసేయ్ నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కి తీసుకొచ్చానే మాట వరసకు అయినా ముక్క తింటావా అని అడగవేంటే అని అంటే వస్తువులు అడగవు అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ ఈ టార్చర్ నావల్ల కాదు బాబోయ్ అంటాడు. ఇప్పుడే ఏంట్రా ముందుంది నీకు ముసళ్ల పండగ అని ప్రేమ అనగానే ధీరజ్ నా వల్ల కాదు అంటూ పడిపోతాడు. ఈ సీన్ మొత్తానికి హ్యాపీ మూవీలోని గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గోల సాంగ్ రావడంతో ఈ రోజు ఎపిసోడ్‌లో ఈ సీన్ చూసే వారికి భలే ఎంటర్‌టైన్‌గా ఉంటుంది.