Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ తన మీదకు గులాబి విసిరితే అది ప్రేమ తీసుకొని ఏంట్రా ఈ ప్రకృతి వైపరీత్యం నువ్వు అక్కడే పడేయాలి కదరా ఇలా తీసుకొస్తావేంట్రా అని అంటుంది. ఎదుటి వారు ఇచ్చిన వాటికి విలువ ఇవ్వకుండా నేను అంత సీరియస్‌గా మాట్లాడితే ఏం చేస్తున్నావే అని ప్రేమ డ్రాయింగ్ వేస్తుంటే ఆ బుక్ తీసుకుంటాడు.

Continues below advertisement

బుక్‌లో ప్రేమ రెండు ఫ్యామిలీలు వాటిలో ప్రేమ, ధీరజ్‌లులు చెరో వైపు ఉండి చేతులు కలుపుకునేలా ఉంటుంది. ఏంటే ఈ డ్రాయింగ్ అంటే ఈ రెండు కుటుంబాలు కలవాలి అది నా కలరా అందుకే ఈ డ్రాయింగ్ వేశా అంటే ధీరజ్ ఆ డ్రాయింగ్ చింపేస్తాడు. ఇది జరగదు అని అంటాడు. రెండు కుటుంబాలు కలవడం అనేది జరగదు.. రెండు కుటుంబాల మధ్య గొడవలకు నువ్వు కారణం అవ్వకు.. రెండు కుటుంబాలు కలవాలి అనే ఆలోచన నీలో కనిపించినా.. ఇలాంటి డ్రాయింగ్‌లు ఇంకోసారి వేసినా అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. 

ప్రేమ కోపంగా వెళ్లి అపురూపంగా దాచుకున్న ధీరజ్ ఇచ్చిన పువ్వుని తీసి ధీరజ్ ముఖం మీద కొడుతుంది. అక్కడే పడేశా అంది ఇంత అపురూపంగా దాచుకుంది.. ఈ తింగరిది ఈ జన్మకి అర్థం కాదు అని ధీరజ్ అనుకుంటాడు. ప్రేమ బయటకు వెళ్లి ఒంటరిగా కూర్చొని బాధ పడుతుంది. 

Continues below advertisement

భాగ్యం మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఇడ్లీబాబాయ్ పచ్చిమిర్చి బజ్జీలు ఇస్తవా.. పండు మిరపకాయలిస్తవా అని పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాడు. భాగ్యం కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇంతలో వల్లీ కాల్ చేసి చందు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తుంది. వస్తారులే మాకు ఫోన్ చేయడం ఎందుకు అల్లుడికి చేయ్ అంటుంది. దాంతో వల్లీ పార్క్‌లో చందు అమూల్యని చూసిన విషయం గురించి చెప్తుంది. ఇంటికొస్తే ఎంత గొడవ అవుతుందో అని వల్లీ అంటే భాగ్యం ఐడియా ఇస్తుంది. 

అమూల్య, విశ్వ సైగలు చేసుకుంటూ ఉంటారు. అది వల్లీచూసి మీ వల్ల నా కాపురం ఎక్కడ పడిపోతుందో అని నేను చస్తుంటే మీకు లవింగ్స్ కావాలా లవింగ్స్ అని అనుకుంటుంది. చందు ఇంటికి వస్తే విషయం మొత్తం చెప్పేస్తాడని వల్లీ టెన్షన్ పడుతుంటుంది. వేదవతి డల్‌గా కూర్చొని ఉంటే ప్రేమ, నర్మద వెళ్లి ఏమైంది ఇలా ఉన్నారు అంటే నాతో మాట్లాడకండీ అని కసిరేస్తుంది. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటారు ఈ అత్తని వదిలేసి హ్యాపీగా పార్క్‌కి వెళ్తారా.. మాట వరసకి అయినా నన్ను పిలిచారా అని అంటుంది. యంగ్ కపుల్స్ వెళ్తూ ముసలి వాళ్లని తీసుకెళ్తామా అని నర్మద అంటుంది. అయినా మీరు పార్క్‌కి వచ్చి ఏం చేస్తారు మేం మా మొగుళ్లతో రొమాన్స్ చేస్తే మీరు మీ ఆయనతో రొమాన్స్ చేస్తారా ఏంటి.. అని నర్మద అంటుంది. ఏంటే అంత పచ్చిగా మాట్లాడుతావ్ అని వేదవతి అంటుంది. 

కావాలి అంటే మీరు మీ ఆయనతో వెళ్లండి.. మీ ఆయన మీకు బయటకు తీసుకెళ్లరు అని మా మీద పడి ఏడుస్తున్నారు అని అంటుంది నర్మద. ఏంటే మా ఆయన నన్ను బయటకు తీసుకెళ్లడా ఇప్పుడే చూడు మా ఆయనతో సెకండ్‌ షో సినిమాకి వెళ్తా అని అంటే అది జరగని పని అని నర్మద నవ్వుతుంది. ఇప్పుడే వెళ్తా చూడు అని వేదవతి వెళ్తుంది. 

వేదవతి రామరాజు దగ్గరకు వెళ్లి ఏవండీ ఎంత సేపు రైస్ మిల్లు లెక్కలేనా ఈ భార్య అంటే లెక్క లేదా అని సెకండ్ షో సినిమాకి వెళ్దాం అంటుంది. ఈ వయసులో ఏంటి బుజ్జమ్మా అని రామరాజు అంటే ఏంటి అందరూ వయసు వయసు అంటారు.. అని సినిమాకి తీసుకెళ్తారా లేదా అని రచ్చచేస్తుంది. తీసుకెళ్తారా అలిగి కూర్చొవాలా అని అంటుంది. దాంతో రామరాజు సరే అంటాడు. వేదవతి నర్మదని చూసి మా ఆయన నన్ను సినిమాకు తీసుకెళ్తున్నారు లవ్ యూ అండీ అని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.