Illu Illalu Pillalu Serial Today Episode విశ్వ అమూల్యతో మాట్లాడి ఎలా అయినా పెళ్లికి ఒప్పించాలి అనుకుంటాడు. అమూల్యని చూసి సైగ చేసి పిలుస్తాడు.  సాయంత్రం పార్క్‌కిరా నీతో మాట్లాడాలి అంటాడు. ఏం అర్థం కాలేదు అని అమూల్య సైగ చేస్తుంది. దాంతో విశ్వ ఓ పేపర్ మీద సాయంత్రం 4 గంటలకు పార్క్‌లో కలుద్దాం.... అని రాసి విసురుతాడు.

Continues below advertisement

అమూల్య ఆ పేపర్‌ పట్టుకొని మేటర్ చదువుతుంది. ఓకే అని విశ్వకి చెప్తుంది. తర్వాత అమూల్యని నర్మద పిలవడంతో పేపర్ విసిరేస్తుంది. అది అక్కడే బైక్ తుడుస్తున్న చందు చూస్తాడు. ఎదురుగా బట్టలు ఆరేస్తున్న వల్లీని చూసి వల్లినే అనుకొని ఆ పేపర్‌ని రాకెట్‌లా చేసి వల్లీ మీదకి విసిరి ఓకే అని అంటాడు. వల్లీ అది చూసి తన భర్త తనని బయటకు తీసుకెళ్లాలి అనుకున్నాడని అనుకొని పార్క్‌కి తీసుకెళ్తున్నాడని గెంతులేస్తుంది. తర్వాత వల్లీ సంతోషంలో ఆ పేపర్ విసిరేస్తుంది. అది వెళ్లి అటుగా వస్తున్న ప్రేమ పట్టుకున్న పూల బుట్టలో పడుతుంది. 

ప్రేమ వెళ్లి ధీరజ్‌ని ఢీ కొడుతుంది. ధీరజ్ పూలు తీసి బుట్టలో వేసి ఆ పేపర్ ప్రేమకి ఇస్తాడు. అది ప్రేమ చూసి కుదరదురా అని అంటుంది. ఏంటి కుదరదు అని ధీరజ్ అంటే ఏంటే అని అంటాడు. సరే అడక్క అడక్క అడిగావ్ కదా సరే అని అంటుంది. ఏంటే సరే అంటున్నావ్ అని ధీరజ్ అడిగితే కనపడవు కానీ చాలా వేషాలు ఉన్నాయిరా నీకు అని ఆ పేపర్ ధీరజ్ చేతిలో పెడుతుంది. ధీరజ్ అది చూసి పార్క్‌కి తీసుకెళ్లాలి అని డైరెక్ట్‌గా అడగొచ్చు కదా అని అనుకుంటాడు.

Continues below advertisement

ధీరజ్ ఆ పేపర్ పడేస్తే నర్మద చూస్తుంది. అది తనకు సాగర్ విసిరాడు అనుకుంటుంది. పేపర్ తీసుకొని సాగర్ దగ్గరకు వెళ్లి వేషాలు చాలా ఉన్నాయి సార్‌ గారికి అని అంటుంది. నాకా అని సాగర్ అంటే పేపర్ సాగర్ జేబులో పెడుతుంది. సాగర్ అది చూసి ఓకే అని నర్మదకి చెప్తాడు. సాగర్ వెళ్తూ వెళ్తూ పేపర్‌ని విసిరేస్తాడు. అది వెళ్లి తిరుపతి దగ్గర పడుతుంది. తిరుపతి అది చదివి తనకు ఎవరో అమ్మాయి పిలిచిందని పొంగిపోతాడు. ఈ జగదేకవీరుడిని పార్క్‌కి పిలిచిన అతిలోక సుందరి ఎవరు.. ఎవరో నా స్వప్న సుందరి నాతో ఆడుకుంటుంది. అది ఎవరో కనిపెడతా అని అరుస్తాడు.

అమూల్య విశ్వతో పార్క్‌కి వెళ్తుంది. ఎవరు చూసేస్తారా అని అమూల్య ముఖానికి ముసుగు వేసుకుంటుంది. ఎవరైనా చూసి మా నాన్నకి తెలిస్తే అంతే ఇక అని అంటుంది. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు. వెనక్కి వెళ్లిపోదాం అని అమూల్య అంటే ఎవరూ గుర్తు పట్టరులే అని విశ్వ చెప్తాడు. విశ్వ అమూల్య చేయి పట్టుకొని నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా అమూల్య.. నీతో మాట్లాడటానికి అవకాశం దొరక్క పిచ్చోడిని అయిపోతున్నా.. అందుకే ఇక్కడికి పిలిచా మరి నువ్వు ఇలా టెన్షన్ పడితే ఎలా మాట్లాడాలి అని అంటాడు. దాంతో అమూల్య విశ్వ చేయి పట్టుకుంటుంది. ఇద్దరూ పక్కకి వెళ్తారు. 

చందు, వల్లీ అదే పార్క్‌కి వస్తారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత సాగర్, నర్మద కూడా వస్తారు. చివరకు ప్రేమ, ధీరజ్ కూడా వస్తారు. నాలుగు జంటలు నాలుగు వైపులు తిరుగుతూ ఉంటారు. ప్రేమ ధీరజ్‌తో సడెన్‌గా సార్‌లో ఈ మార్పు ఏంటి.. అని అంటే నువ్వు నన్ను పార్క్‌కి తీసుకురమ్మని చెప్పి నా మీద చెప్తావేంటే అని ధీరజ్ అడుగుతాడు. ఇద్దరూ నువ్వు పిలిచావ్ అంటే నువ్వు పిలిచావ్ అని గొడవ పడతారు.

తిరుపతి కూడా బాగా రెడీ అయి పోయి ఎక్కడున్నావ్ నా స్వప్న సుందరి అని పార్క్ మొత్తం తిరిగేస్తాడు. అందరూ చెరో చోట చేరి మాట్లాడుకుంటారు. చందు, వల్లీ ఓ చోట మాట్లాడుకుంటూ ఉంటే తిరుపతి వాళ్లని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.