Illu Illalu Pillalu Serial Today Episode నర్మద తన తండ్రికి సాగర్ ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ఏడుస్తూ ఆలోచిస్తుంది. సాగర్ నర్మద దగ్గరకు వస్తాడు. నువ్వింకా మీ నాన్న తాలూక బాధలో ఉన్నావని అర్థమైంది. మరోసారి మీ నాన్నకి అలాంటి పరిస్థితి రాకుండా నీకు ఇలా బాధ పడే పరిస్థితి రాకుండా నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అని చెప్పా కదా ఇక బాధ నుంచి బయటకురా నర్మద అంటాడు.

నర్మద: నా బాధ మా నాన్నకి అలా జరిగినందుకే కాదు సాగర్. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తానని మా నాన్నకి ఇచ్చిన మాట గురించి కూడా.సాగర్: అదేంటి నర్మద అలా అంటావ్. నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తే మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరిస్తారు. నిన్ను ఇంటికి పిలుస్తారు. మీ కుటుంబంలో అందరికీ ఇది సంతోషకరమైన విషయమే కదా. మరి నేను మాటివ్వడం బాధ అంటావేంటి.నర్మద: ఎందుకంటే నీ ఆలోచన స్థిరంగా ఉండదు. ఈ రోజు ఒకలా రేపు ఒకలా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు సాగర్. సాగర్: నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించి తీరుతా.నర్మద: ఎలా నిన్ను నమ్మేది. ఆరోజు మా నాన్నకి భర్త్‌డే విష్ చేయాలని వెళ్లినప్పుడు నన్ను అవమానించారని గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అని రెండు రోజులు బాగానే చదివావ్ తర్వాత ప్రేమ విషయంలో నాతో గొడవ పడి రైస్ మిల్లు లోనే పని చేస్తా అని పుస్తకాలు విసిరి కొట్టావ్. ఎలా నిన్ను నమ్మేది. నువ్వు ఒక గోడ మీద పిల్లిలా ఉంటావ్ సాగర్. ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అంటే నువ్వు రైస్ మిల్‌ నుంచి బయటకు వచ్చేయాలి. మీ నాన్న చేతిలో నుంచి నీ చేతిని పూర్తిగా బయటకు తీసుకోవాలి. సాగర్: నేనేం మా నాన్నని మోసం చేయడం లేదు. నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి మంచి చేస్తా అని తాను గవర్నమెంట్ జాబ్ కొడతా అని కచ్చితంగా చెప్తాడు. మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నా నన్ను నమ్ము అని అంటాడు. నర్మద సంతోషంతో భర్తని వాటేసుకుంటుంది. 

నర్మద, సాగర్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వల్లీ చాలా ప్రయత్నిస్తుంది. ఇద్దరూ ఇంతలా మాట్లాడేసుకుంటున్నారు అంటే ఏదో పెద్ద మేటరే అయింటుంది అని అనుకుంటుంది.  చందు రెండు లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష ఏర్పాటు చేశా మరో లక్ష ఎలా చిన్నోడు మాట ఇచ్చాడు అంటే కచ్చితంగా చేస్తాడు కానీ ఒక వేళ సెట్ చేయకపోతే ఎలా అనుకుంటుంది. ఇంతలో వల్లీ వచ్చి తిందామని పిలిస్తే వల్లి మీద చిరాకుపడతాడు. నువ్వు నా జీవితంలో వచ్చినప్పుడు ఎలా ఉన్నావ్ ఇప్పుడు అలా లేవ్ కదా మారిపోయావ్ అంటాడు. మీ వాళ్లు వారం క్రితం ఆస్తులు పోయావి అని అంటే నువ్వు కూడా ఆ మాట నాకు చెప్పలేదు అంటాడు. 

వల్లీ ప్రామిస్ వేసి నాకు తెలీదు అంటే నేను నమ్మడం లేదు. దొంగ ఒట్లు వేయొద్దు.. ఎప్పుడైతే మీ వాళ్లు నన్ను మోసం చేశారో నువ్వు నన్ను మోసం చేశావని అర్థమైంది. ఆ సేటు నన్ను ఎంతలా టార్చర్ చేస్తున్నాడో నీకు తెలుసు కానీ మా అమ్మానాన్నలు ఊరిలోలేరు.. అని అబద్ధాలు చెప్పారు. ఒకటైంలో దొంగ చెక్కు ఇచ్చి  మోసం చేశారు. ఇప్పుడు ఆస్తి పోయింది అని చేతులెత్తేశారు. నా అమాయకత్వంతో నాతో భలే ఆడుకున్నారు. నన్ను పిచ్చోడిని చేసేశారు అని కోపంగా వెళ్లిపోతాడు. వల్లి చాలా ఏడుస్తుంది.  

ప్రేమ ఒంటరిగా పొలాల్లో తిరుగుతూ వదిలిపోయిన దరిద్రం మళ్లీ నాకు ఎందుకు తగిలింది.. ఆ వెధవ మాటలు నమ్మి వాడితో వెళ్లి చాలా మంది అమ్మాయిల్లా నేను ప్రేమ అని మోసపోయాను. ధీరజ్ రూపంలో ఆ దేవుడు నాకు ఓ మంచి జీవితం ఇచ్చాడని సంతోషపడ్డాను కానీ ఇంతలో మళ్లీ ఇలా కల్యాణ్ వచ్చాడేంటి. జరిగిన విషయం ఇంట్లో చెప్దామంటే అత్తయ్య, అక్క, ధీరజ్ లకు మామయ్య శిక్షిస్తారు. నా సమస్యకు పరిష్కారం ఏంటి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని ఏడుస్తుంది. ఎవరికైనా చెప్తే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటున్నాను. ధీరజ్‌కి చెప్తే ఈ సమస్య నుంచి నన్ను బయట పడేస్తాడు కదా.. కళ్ల ముందు ధీరజ్ అనే పరిష్కారం పెట్టుకొని ఎందుకు బాధ పడుతున్నాను. ముందు ధీరజ్‌కి ఈ విషయం చెప్పాలి అని పరుగులు తీస్తుంది. 

ధీరజ్ అన్నకి డబ్బు ఇవ్వాలని ఆ లక్ష కోసం ప్రయత్నిస్తుంటే ప్రేమ అన్నయ్య విశ్వ ధీరజ్ ముఖం మీద 2 లక్షలు విసిరి కొట్టి ఏరుకోరా..ఊర్లో అందర్ని అడుకుంటున్నావ్ కదా మీ బతుకులే అంత కదరా డబ్బులు కోసం అడుక్కోవడం లేదంటే డబ్బు ఉన్న వాళ్లని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం అంతే కదరా నీకు కావాలి అంటే ఎంత అయినా ఇస్తానురా ఎంత కావాలో చెప్పు అని అడుగుతాడు. ధీరజ్ బావ కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా కోపం వస్తుందా మీ నాన్న కూడా డబ్బు కోసమే మా చిన్నత్తని పెళ్లి చేసుకుంటే నువ్వు నా చెల్లిని డబ్బు కోసమే ట్రాప్ చేశావని అంటాడు. ధీరజ్ ఆవేశం అలా ఆపుకుంటూనే ఉంటాడు. ఇంతలో ఇద్దరూ గట్టిగా గొడవ పడే టైంకి ప్రేమ వచ్చి అన్నయ్యా అని అరవడంతో ప్రేమ అన్నయ్య వెళ్లిపోతాడు. 

ధీరజ్ కోపంతో వాడి కంటికి నేను డబ్బు కోసం పెళ్లాన్ని వదిలేసే వాడిలా కనిపిస్తున్నానా.. నిన్ను ఎలాంటి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకున్నానో వాడికి తెలీదా.. నేనే కాదు మానాన్న కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారంట. ఎలా మాట్లాడుతున్నాడో చూడు నేను చేయని తప్పునకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. అసలు నేను ఎందుకు అక్కడికి రావాలి నీకు ఎందుకు పెళ్లి చేసుకోవాలి.. అసలు ఆ కల్యాణ్‌ గాడిని తీసుకొచ్చి మీ వాళ్ల ముందు పడేసి ఓరేయ్ వెధవ వీడి వల్ల మీ చెల్లి మోసపోయింది. చావాలని ప్రయత్నిస్తే నేను పెళ్లి చేసుకున్నారా..అని గూబ పగలగొట్టి చెప్పాలని ఉంది. అని అంటాడు. ప్రేమ చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టిఎపిసోడ్ పూర్తయిపోతుంది.