Brahmamudi Serial Today Episode: ఇంట్లో ఎదురొచ్చిన వస్తువునల్లా పగులగొడుతుంది యామిని. వైదేహి వచ్చి ఎంత ఆపినా ఆగదు. ఇంతలో యామిని వాళ్ల ఫాథర్‌ వస్తాడు. యామిని కూల్‌గా ఉండమని చెప్తాడు. అయినా వినకుండా ప్రవర్తిస్తుంది యామిని.

యామిని: ఇక ఆ కావ్యను వదలను దాన్ని అంతం చేసి బావను నా సొంతం చేసుకుంటాను.

యామిని ఫాథర్‌: నోర్మూయ్‌.. ఇక నీ పనులన్నీ ఆపేయ్‌. రాజ్‌ ఎప్పటికీ ఆ కావ్య సొంతమేనని ఇప్పుడు రుజువైంది. వాళ్లది విడదీస్తే విడిపోయే బంధం కాదని ఇవాళ రుజువైంది. ఇక రాజ్‌ను మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్‌ చేయ్‌

యామిని: రాజ్‌ను నేను మర్చిపోలేను డాడ్‌ అవసరం అయితే రాజ్‌ కోసం చచ్చిపోతాను.

యామిని ఫాథర్‌: చూడు యామిని ఒక తండ్రిగా నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత నాది కానీ నువ్వు అడుగుతుంది ఒక మనిషి ప్రేమ. అది డబ్బులకు రాదు.  నువ్వు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూ మమ్మల్ని సంతోషపెట్టావు.. ఇప్పుడు ఏడుస్తూ మమ్మల్ని బాధపెట్టకు ఇప్పటికైనా మారు.

అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. యామిని మాత్రం కోపంగా చూస్తుంటుంది. హాస్పిటల్‌ లో అందరూ  డాక్టర్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో ఐసీయూలోంచి డాక్టర్‌ వస్తాడు.  

అపర్ణ:  ఇప్పుడు చెప్పండి డాక్టర్‌ మా రాజ్‌కు ఏమైంది..?

డాక్టర్‌:  మీ రాజ్‌ ఎక్కడైతే గతం మర్చిపోయారో అక్కడే తిరిగి గతం గుర్తు చేసుకున్నాడు. ఆరోజు వాళ్లిద్దరూ శ్రీశైలం వెళ్లినప్పుడు యాక్సిడెంట్‌ అయ్యింది కదా మధ్యలో జరిగిన విషయాలు ఏవీ తనకు గుర్తు లేవు

రుద్రాణి:  ఏంటి డాక్టర్‌ ఏవేవో కట్టు కథలు చెప్పి మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారా..? గతం గుర్తొచ్చింది కానీ మధ్యలో విషయాలు మర్చిపోయారని కథలు చెప్తున్నారు. అలా ఎలా పాసిబుల్‌ అవుతుంది.

డాక్టర్‌: మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లి సెకండ్‌ ఓపినీయన్‌ తీసుకోవచ్చు అంతేకానీ ఇలా మీరు మమ్మల్ని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను

సుభాష్‌: రుద్రాణి నువ్వ కాసేపు నోరు మూస్తావా..? సారీ డాక్టర్‌ తనను పట్టించుకోకండి.. ఇప్పుడు తను అలా మర్చిపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా..?

డాక్టర్‌: ఎలాంటి ప్రాబ్లమ్‌ రాదు. ఇక నుంచి రాజ్‌ మీ అబ్బాయి లాగే ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలన్నీ గుర్తుకు ఉంటాయి. కాకపోతే యాక్సిడెంట్‌ జరగినప్పటి నుంచి జరిగిన విషయాలు మాత్రం గుర్తుకు ఉండవు..

ఇందిరాదేవి: ఆ దరిద్రాన్ని గుర్తు పెట్టుకోవాలని మేము కూడా అనుకోవడం లేదు డాక్టర్‌. ఇంతకీ మా మనవణ్ని ఎప్పుడు డిశార్చ్‌ చేస్తారు.

డాక్టర్‌: ఈరోజే డిశార్చ్‌ చేస్తాం.. కాకపోతే తను స్ట్రెస్‌ తీసుకోకుండా చూసుకోవాలి అంతే చాలు

అంటూ డాక్టర్‌ వెళ్లిపోతాడు.

ఇందిరాదేవి: ఏంటి కావ్య ఇంకా చూస్తున్నావు నువ్వు చేసిన పూజలు వ్రతాలు అన్ని ఫలించినట్టు ఉన్నాయి. ఆ దేవుడు కరుణించి నీ మొగుణ్ని నీకు అప్పగించేశాడు. వెళ్లు వెళ్లి వాడితో సంతోషంగా మాట్లాడు

సుభాష్: అమ్మా కావ్య ఇప్పుడు మా అందరి కంటే నీ అవసరమే వాడికి ఎక్కువ ఉందమ్మా.. వెళ్లు వెళ్లి మాట్లాడు.

అపర్ణ: వెళ్లు కావ్య వెళ్లి వాడితో మాట్లాడు కావ్య

కావ్య ఐసీయూలోకి వెళ్తుంది. రాజ్‌ పక్కన కూర్చుని చేయి పట్టుకుంటుంది. రాజ్‌కు మెలుకువ వస్తుంది.

రాజ్‌: ఎక్కడికి వెళ్లిపోయావు..?

కావ్య: మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లిపోతాను బయటే ఉన్నాను..

రాజ్:  ఇప్పుడు కాదు నేను కళ్లు తెరచినప్పుడు నా ముందు నువ్వే ఉండాలి కదా..? ఎందుకు లేవు..?

కావ్య: ( మనసులో) గతం గుర్తుకు రాగానే మొండితనం కూడా బయటపడుతుంది.

అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. నర్సు వచ్చి రాజ్‌ను డిశార్చ్‌ చేస్తున్నట్టు చెప్తుంది. కట్‌ చేస్తే అందరూ కలిసి ఇంటికి వస్తారు. గుమ్మం ముందు రాజ్ కు దిష్టి తీస్తారు. అందరూ లోపలికి వెళ్లిపోయాక హాల్లో కూర్చుని నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటే కావ్య మాత్రం ఏడుస్తూ..పైకి వెళ్తుంది.

రాజ్‌: అమ్మా కళావతి ఎందుకు ఏడస్తూ వెళ్లిపోయింది.  

ధాన్యలక్ష్మీ: కట్టుకున్న భర్తే అనమానిస్తే ఎవరైనా బాధపడతారు.

అని ధాన్యం అనగానే అందరూ షాక్ అవుతారు. నేను అవమానించడం ఏంటమ్మా అని రాజ్‌ అడుగుతాడు. రాజ్ కు యాక్సిడెంట్‌ అయిన తర్వాత జరిగిన విషయాలు మొత్తం అపర్ణ చెప్తుంది. వెంటనే రాజ్‌ పైకి వెళ్లి ఎమోషనల్ అవుతూ కావ్యను ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!