Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంది. మంచి భర్త, మంచి కుటుంబం, గొప్ప అత్తామామలు అందర్ని మోసం చేశాం.. నా కాపురం నాశనం అయిపోతుంది. మనం పేదవాళ్లం అని ముందే చెప్పేసుంటే చక్కగా కాపురం చేసుకునేదాన్ని కానీ మీరే నా జీవితం నాశనం చేశారని నాకు చావే గతి అని శ్రీవల్లి చాలా ఏడుస్తుంది.
రామరాజు తాను నమ్మిన బంటు సింహాద్రి మోసం చేయడం గురించి తలచుకుంటూ ఢీలాపడిపోతాడు. ఇంకా అదే ఎందుకు ఆలోచిస్తారు అని వేదవతి అడిగితే నమ్మిన వాడే మోసం చేస్తే అంత అమాయకంగా మనం ఉన్నామా.. అంత గుడ్డిగా ఎదుటి వాళ్లని నమ్మామా అన్న బాధ గుండెని తొలి చేస్తుంది బుజ్జమ్మా అని ఏడుస్తాడు. పొరపాటున నా వాళ్లు నా ఇంట్లో వాళ్లు ఏదైనా మోసం చేస్తే అక్కడికి అక్కడే నా గుండె ఆగిపోతుందేమో అని రామరాజు అనడంతో అందరూ షాక్ అయిపోతారు.
రామరాజు ప్రేమతో అమ్మా ప్రేమ ఇందాక వల్లీ గురించి ఏదో చెప్పాలి అన్నావ్ ఏంటమ్మా అది అని అడుగుతాడు. ప్రేమ రామరాజుతో వల్లి వాళ్ల గురించి మీకు చాలా నిజాలు తెలియాలి అని అంటుంది. ఏంటమ్మా అది అని రామరాజు అడుగుతాడు. నర్మద ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో భాగ్యం, ఆనంద్‌రావు బస్తీ గెటప్‌లో ఎంట్రీ ఇస్తారు. భాగ్యం, ఆనంద్ రావుల గెటప్ చూసి ఏమైంది అని అందరూ షాక్ అయిపోతారు.
భాగ్యం, ఆనంద్‌రావులు రామరాజు కాళ్ల మీద పడి ఏడ్చి మేం రోడ్డున పడిపోయాం అన్నయ్యా గారు మా ఆస్తులు బంగ్లాలు అన్నీ పోయావని మోసపోయామని ఏడుస్తారు. ఏమైందని అడిగితే ఫైనాన్స్ ఇచ్చిన అందరూ ముంచేశారని ఐపీ పెట్టేశారని ఏడుస్తారు. తిరుపతి వాళ్లతో నిన్న మా ఇంటికి సూటు బూటు వెసుకొని వేసుకొని వచ్చారు ఉదయానికే కోట్ల ఆస్తి పోయింది అంటే ఎక్కడో తేడా కొడుతుందని అంటాడు. ఆస్తి పోయి ఇప్పటికే వారం అయిపోయిందని అలా చెప్తే అత్తారింట్లో మా అమ్మడుని చులకనగా చూస్తారని చెప్పలేదని.. దేవుడి లాంటి అన్నయ్యగారికి నిజం తెలియాలి అని చెప్పానని ఏడుస్తుంది. అందరూ భాగ్యం మాటలకు షాక్లో ఉంటారు. ఏం మాట్లాడరు.
ప్రేమ రామరాజుని పిలిచి నిజం చెప్పబోతుంది.. ఇంతలో నర్మద ప్రేమని ఆపేసి పక్కకి తీసుకెళ్తుంది. ప్రేమ నర్మదతో నిజం చెప్తుంటే నువ్వేంటి అక్క నన్ను ఆపావు.. ఇక్కడికి తీసుకొచ్చావు.. అని అడుగుతుంది. మామయ్యకి నిజం తెలిస్తే తట్టుకోలేరని నర్మద అంటుంది. వాళ్ల బండారం బయట పడితే ఇకనైనా జాగ్రత్త పడతారు అని ప్రేమ అంటే ఈ నిజం తెలిస్తే మామయ్య తట్టుకోలేరు.. ఇందాక సింహాద్రి విషయంలో ఎంత బాధ పడ్డారో చూశావు కదా.. కొడుకు విషయంలో మోసపోయాను అని తెలిస్తే తట్టుకోగలరా మానసికంగా కృంగిపోతారని అంటుంది. నిజం తెలియాలి అక్క భవిష్యత్ బాగుంటుంది అని ప్రేమ అంటుంది. సొంత వాళ్లే మోసం చేశారని.. కొడుకు జీవితం నాశనం అయిపోయినట్లు మామయ్య గుండె పగిలి చనిపోతారని అంటుంది. దానికి ప్రేమ వాళ్లు మోసం చేశామని కొంచెం కూడా పశ్చాత్తాప పడటం లేదు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటికైనా వాళ్లని అడ్డుకోవాలి అంటే నిజం చెప్పేయాలి అక్క అని ప్రేమ అంటుంది. నర్మద మాత్రం మామయ్య ప్రాణాల కోసం క్షమించి వదిలేయాలి అంటుంది. ఇప్పుడు చెప్పకపోతే జీవితంలో చెప్పలేమని ప్రేమ అంటుంది. ప్రేమ ఎంత చెప్పినా నర్మద వద్దని చెప్తుంది. ఏం మాట్లాడకుండా ఆపేస్తుంది.
రామరాజు నర్మదతో ప్రేమ వల్లి గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంది అంటే ఏం లేదని నర్మద అనేస్తుంది. ప్రేమతో కూడా ఏం లేదని చెప్పించేస్తుంది. ఇక రామరాజు భాగ్యంతో ఆస్తులు పోయావని మిమల్ని వదిలేసే వాడికి కాదని వాళ్లని లోపలికి తీసుకెళ్తారు. తర్వాత భాగ్యం, ఆనంద్ రావు అల్లుడి కాళ్లు పట్టేస్తారు. విషయం మొత్తం మీకు అర్థమైంది కదా బాబు.. మీకు క్షమాపణ చెప్పడం కంటే ఏం చేయలేం బాబు అని పదిలక్షలు ఇవ్వలేమని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.