Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లికి నగలు తీసుకురమ్మని చెప్పడంతో కలశంలో పెట్టి ఆ చెంబు మూతి కొట్టేస్తుంది. దాంతో అందరూ ఎంత ప్రయత్నించినా ఆ కలశంలోని నగలు తీయాలని తెగ ప్రయత్నిస్తారు కానీ ఎవరూ తీయలేకపోతారు. ఇక తిరుపతి పెద్ద ఓవర్ యాక్షన్ చేసి ఆ చెంబులో చేయి ఇరుక్కునేలా చేస్తాడు.
చెంబులో నుంచి చేయి రావట్లేదు బావా అని ఏడుస్తాడు. అందరూ మళ్లీ తిరుపతి చేయి ఇరుక్కున్నందుకు అందరూ చెంబు తీయడానికి తెగ ప్రయత్నిస్తారు. నలుగురు నాలుగు వైపులా లాగినా రాదు. దాంతో చెంబు కట్ చేద్దామని నర్మద అంటే భాగ్యం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వరలక్ష్మీ వ్రతం అని చెప్పడంతో ఆ చెంబు తన ఇంటి నుంచి తీసుకొచ్చానని వరలక్ష్మీ వ్రతం రోజు అలా చేయడం తప్పని అంటుంది. దాంతో నర్మద ఏం కాదు పిన్ని గారు నగలకు పూజ చేయిస్తే అంతా మంచే జరుగుతుందని అంటుంది. వల్లి నగలకు ఎలా పూజ చేయిస్తాం అని వేదవతి అడుగుతుంది.
నర్మద, ప్రేమ, శ్రీవల్లిలు పూజ చేస్తుంటే తిరుపతి కలశం పట్టుకొని కూర్చొంటాడు. దాంతో వ్రతం పూర్తి చేస్తారు. వల్లి తల్లి ఐడియాకు ఈ గండం నుంచి గట్టెక్కినందుకు తెగ సంబర పడిపోతుంది. తల్లిని పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంది. కొంపలు కూల్చడంలో మీ అమ్మ తల పండిపోయి ఎండిపోయిందని ఆనంద్ రావు అంటాడు. వల్లి ఈ రోజుతో నా పని అయిపోతుంది నేను మీతో వచ్చేయాలి అనుకున్నాను కానీ నువ్వు వాళ్ల ప్లాన్ తిప్పి కొట్టి వాళ్లని గూబ గుయ్యమనేలా చేశారని అంటుంది. భయపడకుండా వాళ్లని నువ్వు భయపెట్టాలని వల్లితో చెప్తుంది. ఇక ఎన్ని చేసినా మనల్ని పట్టుకోలేరని వాళ్లకి బాగా అర్థమైపోయింటుంది ఇక మన జోలికి రారు.. మన నిజస్వరూపం బయట పెట్టాలని ప్రయత్నించరు అని భాగ్యం అంటుంది. ఇక ఎవరికీ తెలీకుండా వెళ్లిపోవాలని భాగ్యం, ఆనంద్ రావులు అనుకుంటారు.
ఆనంద్ రావు బయటకు వెళ్తే నర్మద, ప్రేమలు రెండు వైపులా నిల్చొంటారు. నర్మద బాబాయ్‌తో మీరు చాలా పెద్ద బిజినెస్ మెన్ సెలబ్రిటీ కదా మీతో సెల్ఫీ తీసుకుంటా అని అంటుంది. ఫోన్ తీసుకురాలేదు అని ఆనంద్‌రావు ఫోన్ నుంచే ఫోటోలు తీసుకొని వాటిని పంపిచుకుంటామని చెప్పి లొకేషన్ కూడా పంపుకుంటుంది. ఇక నర్మద ప్రేమలకు తెలీకుండా భాగ్యం వాళ్లు పారిపోతారు. ప్రేమ నర్మదతో అక్క వాళ్లు ఏదో చిన్న చితాకా దొంగలు అనుకున్నా కానీ దేశాన్ని ముంచే టైపు అయినా చెంబులో నగలు వేయడం ఏంటి అక్క .. ఈరోజుతో వాళ్ల పని అయిపోయింది అనుకున్నాం కానీ తప్పించుకున్నారు. చూస్తుంటే వాళ్లని పట్టుకోవడం కష్టంలా ఉంది అక్క అని ప్రేమ అంటుంది.
భాగ్యం, ఆనంద్‌రావులు ఇళ్లు ఖాళీ చేసి చేసి వెళ్లిపోవాలని లగేజ్ అంతా ఆటోలో ఎక్కించుకుంటారు. ఆ పిల్ల బజ్చాలు మనల్ని పట్టుకోలేరు పారిపోదాం అనుకునే టైంకి నర్మద, ప్రేమలు ఎదురుగా నిల్చొంటారు. దాంతో భాగ్యం, ఆనంద్‌రావులు షాక్ అయిపోతారు. నర్మద, ప్రేమ ఇద్దరూ విష్ చేస్తారు. అమ్మనా ఇడ్లీనో దొరికిపోయాం భాగ్యం అని ఆనంద్ రావు అంటాడు. మోసం చేయడం వీళ్లకి ఇడ్లీ చట్నీతో పెట్టిన విద్య అని ప్రేమ అంటుంది. ఇక ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్లి చూసి మా దగ్గర నుంచి దాచేసిన ఇళ్లు చాలా బాగుంది అని అంటారు. మా అడ్రస్ ఎలా కనిపెట్టారు అని ఆనంద్ రావు అడిగితే నర్మద లొకేషన్ చూసి ఇలా అని చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసడ్ పూర్తయిపోతుంది.