Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ చీర తీసుకోమని నర్మదని బతిమాలుతాడు. నర్మద తీసుకోదు గతంలో సాగర్ చేసిన తప్పులన్నీ గుర్తు చేస్తుంది. దాంతో సాగర్ తప్పు అయింది కోపం ఉంటే కొట్టు అని అంటాడు. దాంతో నర్మద ఒక్కటి పీకుతుంది. ఏదో మాట వరసకి అన్నానే అలా కొట్టావేంటి అని సాగర్ అంటాడు. ఎలాగూ కొట్టావ్ కదా కోపం పోయిందా అని సాగర్ అడిగితే నర్మద మళ్లీ కొడతాడు.
సాగర్ నర్మదతో అంత కోపమా నా మీద అని అంటాడు. ఇక సాగర్ నర్మదని కూల్ చేసేస్తాడు. నర్మద చీర తీసుకుంటుంది. చాలా బాగుంది అని అంటుంది. దాంతో సాగర్ మా పెద్దోడు సెలక్ట్ చేశాడని చెప్తాడు. ఇక చందు వల్లి దగ్గరకు చీర తీసుకొని వెళ్తాడు. వల్లి డబ్బులు అడగటానికి వచ్చాడని అనుకొని బా ఈ రోజు ఇంట్లో వ్రతం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ డబ్బులు గురించి ఎందుకు బా అని అడుగుతుంది. నేను డబ్బులు కోసం రాలేదులే నీకు చీర ఇవ్వడానికి వచ్చానని చందు చీర ఇస్తాడు. శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. చీర పట్టుకొని చాలా బాగుంది బా అని చెప్తుంది. ఇది మా తమ్ముళ్లు సెలక్ట్ చేశారని చందు చెప్పడంతో ఈ చీర సెలక్ట్ చేసింది మీ తమ్ముళ్లా అని అడుగుతుంది. అవును అని చందు చెప్పి వ్రతానికి చీర కట్టుకొని రా అని చెప్పి వెళ్లి పోతాడు. దాంతో వల్లి చీర విసిరికొట్టి తమ్ముళ్లు సెలక్ట్ చేశారంట ఈ చీరేంటో వ్రతమేంటో అసలు మా అమ్మ ఎక్కడ అనుకుంటుంది.
మరోవైపు ప్రేమ చీరలు ముందు వేసుకొని ఏది కట్టుకోవాలా అనుకుంటుంది. ఇంతలో ధీరజ్ చీర తీసుకొచ్చి వచ్చి నీ కోసం చీర తీసుకొచ్చా అని ఇస్తాడు. ప్రేమ తీసుకొని చాలా బాగుందిరా నీకు సెలక్షన్ తెలుసురా అనుకుంటుంది. హమ్మయ్యా నీకు నచ్చేసింది అది చాలు ఐఏఎస్ రాసిన వాడు రిజల్ట్ కోసం ఇంత టెన్షన్ పడడు కానీ నేను చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్స్ అంటాడు. నా కోసం చీర తెచ్చావు అంతే కదా.. అని చీర విసిరి కొడుతుంది. అబ్బా ఏమైందే నీకు అని ధీరజ్ అడుగుతాడు. న దృష్టిలో నేను ఒక వస్తువుని కదా వస్తువులు చీరలు కట్టుకోవు అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ మళ్లీ మొదలు పెట్టేశావా వ్రతంలో కొత్త చీర కట్టుకొని కూర్చొవాలి కదా ఎప్పుడో ఏదో అన్నాను కాబట్టి దాన్నే పట్టుకుంటావా అని అంటాడు. నేను నీ భార్యని కాబట్టి అందరిలో నీ పరువు పోకూడదు అని అందరి దృష్టిలో ధీరజ్ ఎంత మంచి భర్తో అని అనుకోవాలని ప్రేమ లేకుండా మొక్కుబడిగా తీసుకొచ్చిన ఈ చీర నాకు అవసరం లేదు.. వస్తువు అన్నావ్ కదా నన్ను అలా చావనివ్వు అంటుంది. దాంతో ధీరజ్ ఎన్ని సార్లు చెప్పాలే నువ్వు వస్తువు కాదు అంటాడు. అయితే నీ మనసులో నేను ఏంటి చెప్పురా అని అడుగుతుంది. నేను చెప్పలేను నాకేం తెలీదు నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నాను ఎవరినీ మెప్పించడానికి చీర తీసుకురాలేదు.. అందరి లాగే నువ్వు కలకల్లాడుతూ కనిపించాలి..అందుకే ఈ చీర తీసుకొచ్చా ప్రామిస్ నువ్వు నమ్మితే అర్థం చేసుకుంటే ఈ చీర తీసుకో లేదంటే నీ ఇష్టం అని అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు.
వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు మొదలవుతాయి. కామాక్షి, అమృతలు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. వేదవతి పనులు చేస్తుంటే ఆపి ఫొటోలు అని పిలుస్తారు. ఆపండే మీరు మీ ఫొటోలు అని అంటుంది. ముగ్గురు కోడళ్లు ఉన్నా పనులన్నీ నేనే చేయాలి అనుకుంటూ అంటుంది. ఇక కామాక్షి పిల్లలకు పనులు చేయమని అంటే 3 కోడళ్లు ఉన్నారు కదా అని అంటారు. మీ నాన్న మీకు ఎక్కువ గారాభం చేశారే అనుకుంటుంది. రామరాజు వచ్చి నా మీద అక్షింతలు మొదలు పెట్టావా అని అంటాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటే కొడుకులు తిరుపతి వస్తారు. రామరాజు, వేదవతి పారిపోతారు.
ముగ్గురు బ్రదర్స్ మాట్లాడుకుంటూ ఉంటే నర్మద సాగర్ ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. సాగర్ నర్మదని చూస్తూ నర్మద వెనకే వెళ్తూ మైమరచిపోతాడు. ఇంతలో ప్రేమ కూడా ధీరజ్ ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. ధీరజ్ కూడా చూస్తూ ఉండిపోతాడు. చందు తోసేయడంతో ప్రేమ ముందుకి వెళ్లి పడతాడు. ధీరజ్‌ని సాగర్, చందు కితకితలు చేసి ఆటపట్టిస్తారు. నర్మద, ప్రేమ నవ్వుకుంటారు. ఇంతలో వల్లి చందు ఇచ్చిన చీరలో కాకుండా వేరే చీరలో వస్తుంది. చందు డిసప్పాయింట్ అయిపోతాడు. చందు బాధ పడిన విషయం వల్లీకి అర్థమైపోతుంది. నర్మద ప్రేమలు ఒక్క చోట ఉండటం.. వల్లి సపరేట్‌గా ఉండటంతో భాగ్యం వెళ్లి కూతురిని పట్టుకొని నేను ఉన్నా అన్నట్లు నిల్చొంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో భాగ్యం వల్లితో వ్రతం నీ చేతుల మీదనే జరగాలి అని అడుగు అప్పుడు వాళ్లిద్దరూ గొడవకుఇస్తారు. నువ్వు దొంగ ఏడుపు ఏడ్చేయ్ నేను నా కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లిపోతాను అని అంటానని అంటుంది. దాంతో మీ మామయ్య వాళ్లని తిడతారని అంటుంది. ఎవరు పూజ చేస్తారు అని పంతులు అడిగితే నేను పెద్ద కోడలిని కదా నేను చేస్తాను అని శ్రీవల్లి అడుగుతుంది. ఏం గొడవ జరుగుతుందో అని వేదవతి మనసులో చాలా భయపడుతుంది. పండగపూట ముగ్గురు కోడళ్లు జుట్టులు పట్టుకుంటారేమో అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.