Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ఇంటి తాళాలు వేదవతికి ఇస్తుంటే నర్మద ఆపుతుంది. తాళాలు నీ దగ్గరే ఉండాలి అక్క.. ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాలి అక్క.. మామయ్య గారు నీ మీద ఎంతో నమ్మకంతో తాళాలు ఇచ్చారు. నాలుగు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తే నీ గురించి ఏమనుకుంటారు చెప్పు. అందుకే నీ దగ్గరే ఉండాలి అక్క అని ప్రేమ, నర్మదలు అంటారు.
శ్రీవల్లి, భాగ్యం, ఆనంద్‌రావు నర్మద, ప్రేమలు అలా మాట్లాడటంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆనంద్ రావు కంగారుతో వద్దమ్మా తాళాలు వల్లి దగ్గర ఉండకూడదు అంటాడు. నర్మద ఆనంద్‌రావుతో మీరు ఎందుకు ఆ తాళాలు గురించి అంత కంగారు పడుతున్నారు అని అడిగితే లేకపోతే జైలుకి వెళ్తాను కదా అని అనేస్తాడు. ఏమన్నారు అని నర్మద అడగటంతో ఇంటి తాళాలు వదిన దగ్గరే ఉండాలి అంటున్నారని భాగ్యం కవర్ చేస్తుంది. మెడలో పాముని శివయ్య డీలింగ్ చేసినట్లు మరెవరూ చేయలేరు కదా అని ఆనంద్ రావు అంటాడు. బాబాయ్ మీర ఆ దొంగ గురించి భయపడుతున్నారా వాడిని పట్టించి మా మామయ్యతో బడిత పూజ చూయించి జైలు పాలు చేస్తామని నర్మద అంటుంది.
వల్లి నర్మద, ప్రేమల్ని ఆపి మామయ్య మాట కాదలనలేక ఇంటి తాళాలు తీసుకున్నా అత్తయ్యగారండీ కానీ ఈ తాళాలు ఈ ఇంటి పెత్తనం మీ దగ్గర ఉండటమే ధర్మం తీసుకోండి అని అంటుంది. వేదవతి తీసుకోకపోవడంతో భాగ్యం మీ మామయ్య గారికి ఇవ్వు అని చెప్తుంది. ప్రేమ రామరాజుకి తాళాలు ఇస్తుంది. రామరాజు తీసుకుంటాడు. వేదవతికి రామరాజు తాళాలు పక్కకి వెళ్లిపోతుంది. రామరాజు వేదవతి దగ్గరకు వెళ్లి బుజ్జమ్మా ఈ తాళాలు నీ దగ్గర తీసుకుంది నేనే తిరిగి ఇస్తుంది నేనే తీసుకో అని అంటాడు. వేదవతి సంతోషంగా తీసుకుంటుంది. కొడుకులు, కోడళ్లు అత్తామామల చుట్టూ చేరి సరదాగా నవ్వుకుంటారు. ఇక శ్రీవల్లి పక్కకి వెళ్లిపోతుంది.
రామరాజు పెద్ద కూతురు కామాక్షి శ్రీవల్లి ఇచ్చిన బంగారం తీసుకొని మార్చడానికి మార్వాడీ షాప్‌కి వెళ్తుంది. వల్లి ఆడపడుచు కట్నం కింద రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్నే మోసం చేస్తావా నీ సంగతి చెప్తా అని పుట్టింటికి బయల్దేరుతుంది. మరోవైపు తాళాలు ఇచ్చేసినందుకు శీవల్లి డల్ అయిపోతుంది. ఆలోచిస్తూ ఉంటే చందు వల్లి దగ్గరకు వెళ్లి మీ అమ్మానాన్నల్ని తీసుకురా పది లక్షల గురించి అడగాలి అంటాడు. ఈ రోజు ఆ పది లక్షల సంగతి తేలిపోవాలి మీ అమ్మానాన్నల్ని పిలుచుకొని రా అని అంటాడు. వల్లి వెళ్లినట్లే వెళ్లి ఏడుస్తుంది. నేను అంటే మీకు అస్సలు ప్రేమ లేదు మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నారు అని అంటుంది. ఈ రోజు నా పుట్టిన రోజు నన్ను సంతోషంగా ఉంచడం మానేసి డబ్బు డబ్బు అని విసిగిస్తున్నారు అని నాటకం మొదలు పెట్టేస్తుంది.
అసలు నువ్వు నాకు మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.. నన్ను ఎవరు బాధ పెట్టినా తట్టుకుంటాను కానీ నువ్వు బాధ పెడితే తట్టుకోలేను.. నన్ను ఏడిపించకు బా.. అని ఏడుస్తుంది. చందు కరిగిపోతాడు. వల్లిని దగ్గరకు తీసుకుంటాడు. నీకు నచ్చినట్లు ఉండు అని చందు అనేస్తాడు. దాంతో వల్లి హమ్మయ్యా ఈ రోజు ఏదో ఒకలా మ్యానేజ్ చేశానని అనుకుంటుంది. మరోవైపు ఇంటికి కామాక్షి వస్తుంది. పది లక్షల గురించి వల్లి, భాగ్యం మాట్లాడుకుంటారు. వల్లీ వల్లీ అని కామాక్షి ఆవేశంగా అరుస్తుంది. భాగ్యం, వల్లీలతో పాటు నర్మద, ప్రేమలు షాక్ అయి చూస్తారు.
వల్లి వెళ్తుంది. కామాక్షిని చూసి వల్లి వదినా వదినా ఏమైంది అని అంటే ఇలా వదినా వదినా అనే నన్ను మాయ చేశావ్.. అని రింగ్ చేతిలో పెట్టి రోల్డ్ గోల్డ్ అని చెప్తుంది. ఇది రోల్డ్ గోల్డ్ ఏంటి ప్యూర్ గోల్డ్ అని వల్లి అంటే ఆ ప్యూర్ గోల్డా పంచదార పాకం ఏం కాదు ఇప్పుడే గోల్డ్ షాప్కి వెళ్లి వచ్చా వాడు గీకి గీకి చూపించాడు అది రోల్డ్ గోల్డ్ అని అంటుంది. నర్మద, ప్రేమలు బయట నుంచి వల్లి దొరికిపోయే టెన్షన్‌లో ఇలా కంగారు పడుతుంది. కామాక్షి వదిన వస్తే విషయం తెలుస్తుందని అంటుంది. కామాక్షి తండ్రికి విషయం చెప్తానని బయటకు వస్తే వల్లి, భాగ్యం ఇద్దరూ కామాక్షిని ఆపుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.