Illu Illalu Pillalu Serial Today Promo ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు రోజుకూ చాలా ఆసక్తికరంగా మారింది. ప్రేమ ధీరజ్‌ని ప్రేమించడం.. బావని ప్రేమిస్తున్నానని ప్రేమ తెలుసుకొని ధీరజ్ వెంట పరుగులు పెట్టడం చూసి ధీరజ్ కూడా ప్రేమని అర్థం చేసుకొని ప్రేమిస్తే ఈ క్యూట్ జంట ఇంకా సంతోషంగా ఉండి ఫ్యాన్స్‌ని భలే ఎంటర్ టైన్ చేస్తారు అనుకునేలోపు కల్యాణ్ సునామిలా వచ్చి అంతా తారుమారు చేసేశాడు. ఈ తరుణంలో లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.
"ప్రేమ అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఏడుస్తూ నడిరోడ్డు మీదకి వెళ్తుంది. కల్యాణ్‌తో మాట్లాడుతూ ఎక్కడున్నావ్‌రా ఎక్కడున్నావ్‌రా నువ్వు అని అరుస్తుంది. కల్యాణ్ కూల్‌గా అడగ్గానే చెప్పేస్తా మరి.. పరుగెత్తు అదే భయంతో పరుగెత్తు నువ్వు ఇలా అడుగడుగునా భయపడుతూనే ఉండు.. పరుగెత్తు అని అంటాడు. ప్రేమ వీధి వీధిలోనూ పరుగెడుతూ ఉంటుంది. ఓ వీధిలో ధీరజ్ ఎదురు పడతాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. ధీరజ్ ప్రేమతో టైం పదకొండున్నర అవుతుంది. ఈ టైంలో ఇలా నువ్వు ఒక్కదానివే రోడ్ల మీద పరుగెడుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. నేను చెప్పనురా నా గురించి నీకు ఎందుకు అని ప్రేమ చెప్పి వెళ్లిపోబోతే ధీరజ్ ఆపుతాడు. కచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లమే నిన్ను భయపెడుతుందని నాకు అర్థమవుతుంది అదేంటో చెప్పు అని ప్రేమ చేయి పట్టుకుంటే. ప్రేమ ధీరజ్ చేయి విడిపించుకొని రేయ్ వదలని అంటే నీకు అర్థం కావడం లేదా అని పరుగులు తీయబోతే ధీరజ్ ఆపి ప్రేమ అని ప్రేమని కొడతాడు. అది ప్రేమ అన్న విశ్వ చూస్తాడు." దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.
ప్రేమ ధీరజ్‌కి విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ధీరజ్ వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ధీరజ్ ఎంత అడిగినా ప్రేమ చెప్పడానికి ఇష్టం పడటం లేదు. ఇద్దరూ అర్ధరాత్రి నడిరోడ్డు మీద ఉండటం. ప్రేమని నడిరోడ్డు మీద ధీరజ్ కొట్టడం ప్రేమ అన్నయ్య చూశాడు కాబట్టి తన చెల్లిని రాచి రంపాన పెడుతున్నాడని అనుకొని విశ్వ ఇంకా ధీరజ్ మీద పగపెట్టుకుంటాడు. ఇద్దరూ రోడ్డు మీద మరోసారి గొడవ పడొచ్చు. అంతే కాకుండా ప్రేమని తీసుకెళ్లిపోతానని విశ్వ అనొచ్చు.. ఇక ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇరు కుటుంబాల మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది.
కల్యాణ్ ఎందుకు ప్రేమని బెదిరించాడో.. అర్ధరాత్రి వాడి దగ్గరకు ప్రేమని రమ్మని చెప్పడమే కాకుండా ప్రేమనే తాను ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పడం వెనక కల్యాణ్ ఎలాంటి దురుద్దేశంతో ఉన్నాడో అర్థమవుతుంది. ఇక ప్రేమ వచ్చినప్పుడే వల్లీ కూడా ప్రేమని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రేమ, నర్మదల మీద ఫోకస్ చేసిన వల్లి ఇప్పటికే ప్రేమని అనుమానించి గది వెతకడం.. ప్రేమని ఓ కంట కనిపెడుతూనే ఉండటం వల్ల తను కూడా ప్రేమని ఫాలో అయిండొచ్చు. వల్లికీ కల్యాణ్ గురించి తెలిస్తే కల్యాణ్‌తో చేతులు కలిపి ప్రేమని చిత్రవధకు గురి చేయక మానదు. ప్రేమ గడప దాటడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.