Gomati Priya: తెలుగు, తమిళ టెలివిజన్ ప్రేక్షకులకు ముఖ్యంగా 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ ద్వారా ఎంతో దగ్గరైన నటి గోమతి ప్రియ. తన సహజసిద్ధమైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె లైఫ్, కెరీర్, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

Continues below advertisement

లైఫ్ & విద్యాభ్యాసం  

గోమతి ప్రియ తమిళనాడులోని మదురైలో జన్మించింది. మదురైలోనే ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే నటన, మోడలింగ్ వైపు ఆసక్తి పెంచుకుంది.

సీరియల్ కెరీర్  

చదువు పూర్తైన తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించిన ఆమెకు తమిళ టెలివిజన్ రంగంలో అవకాశం దక్కింది. విజయ్ టీవీలో ప్రసారమైన 'వేలైక్కారన్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. జీ తెలుగులో ప్రసారమైన హిట్‌ సీరియల్ 'హిట్లర్ గారి పెళ్లాం' ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో 'భానుమతి' పాత్రలో అమాయకంగా, చలాకీగా నటించి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళంలో 'ముత్తళగు' వంటి పాపులర్ సీరియల్స్‌లో లీడ్ రోల్ పోషించింది. 

Continues below advertisement

రెమ్యూనిరేషన్ 

గోమతి ప్రియ తనకున్న పాపులారిటీ, నటన ప్రతిభకు గానూ సీరియల్స్ లో లీడ్ రోల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ. 12,000 నుండి రూ. 18,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

 Also Read: 'గుండె నిండా గుడిగంటలు' అమూల్య గౌడ.. సీరియల్స్‌లో ఇలా, రియల్ లైఫ్‌లో అలా!

సోషల్ మీడియా  

ఇన్‌స్టాగ్రామ్‌లో గోమతి ప్రియ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ట్రెడిషనల్ శారీస్, మోడరన్ అవుట్‌ఫిట్స్‌లో ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తన సీరియల్ లొకేషన్ రీల్స్, ఫన్నీ వీడియోలు మరియు ట్రావెల్ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

ఆసక్తికర విషయాలు  

మాతృభాష తమిళం అయినప్పటికీ, తెలుగు సీరియల్‌లో నటిస్తున్నప్పుడు తెలుగు భాషను ఎంతో కష్టపడి నేర్చుకుని, డైలాగ్స్ చెబుతోంది. సోషల్ మీడియాలో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, నిజ జీవితంలో, స్క్రీన్ పైన ట్రెడిషనల్, హోమ్లీ లుక్స్‌లోనే కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. గోమతి ప్రియకు రకరకాల వంటకాలను రుచి చూడటం ఇష్టం. షూటింగ్ గ్యాప్‌లో సహనటులతో కలిసి సందడి చేయడం ఆమెకు అలవాటు. 

Also Read: తెలుగు బుల్లితెర 'చామంతి' మేఘన లోకేష్.. నాటకాలు టు సీరియల్స్.. లవ్ స్టోరీలో టెస్ట్