Guppedantha Manasu Serial Today: మనుని తన కొడుకుగా మహేంద్ర చెప్పటంపై అనుపమ సీరియస్ అవుతుంది. నీకు మను సహాయం చేస్తే మరో రూపంలో సహాయం చేయాలి గానీ ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తుంది. తన తండ్రి విషయంలో మనో తల దించుకోకూడదనే ఇలా చేశాను అంటాడు. వసు కూడా అనుపమకే మద్దతు పలుకుతుంది. మీరు మంచి కోసమే చేశారు. కానీ ఇలా చేయటం వల్ల ఎంతమంది మెదడులో ఎన్ని ప్రశ్నలు నాటారో తెలుసా అంటుంది. అడిగిన వాళ్ళందరికీ, అవమానించిన వాళ్ళందరికీ తానే సమాధానం చెబుతానంతాడు మహేంద్ర. ఇంతలో మహేంద్ర కి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి అర్జెంట్గా మాట్లాడాలి ఇంటికి రమ్మని చెబుతాడు మహేంద్ర.. అక్క నుండి బయలుదేరుతాడు.
ఏదో ఆలోచిస్తునట్టు ఉన్న మహేంద్ర అన్న ఫణీంద్ర దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అతని భార్య దేవయాని. కావాలనే మహేంద్ర గురించి ఎత్తి మహేంద్ర వల్ల తమ కుటుంబాన్ని గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ఫణీంద్ర కి చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంత చెప్పినా ఫణీంద్ర తన తమ్ముడిపై తనకు నమ్మకం ఉంది అనడంతో అనుపమ గురించి అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.. కానీ ఫణింద్ర గట్టిగా అరవడంతో మాటలు ఆపేస్తుంది
మనుకి తన తండ్రి నేనే అని మహేంద్ర చెప్పిన మాట్లాడిన మాటలు గుర్తు వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడికి చేరుకుంటుంది వసుధార. మనుకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ‘మా బాధ మేం పడతాం కదండీ.. సార్ ఎందుకు అలా రియాక్ట్ కావాలి?? అని అడుగుతాడు మను.
వసుధార: మామయ్య మొదటి నుంచి మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. మీ ఇద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తున్నారు. జగతి మేడమ్‌ని రిషి సార్‌ని మీలో ఊహించుకుంటున్నారేమో. వాళ్ళిద్దరూ కూడా కూడా తల్లీ కొడుకులైనా కూడా మీలాగే మాట్లాడుకునే వారు కాదు.. వాళ్లని కలిపినట్టే మిమ్మల్నీ కలపాలనే ఇలా చేసి ఉంటారు.
మను: మీ మామయ్య తరుపున బాగానే మాట్లాడుతున్నావ్ కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మా బాధ తగ్గలేదు సరికదా ఎక్కువైంది.
ఫణీంద్ర దగ్గరకు వస్తాడు మహేంద్ర. నన్ను ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు.
దేవయాని: హా.. నువ్వు చేసిన ఘనకార్యానికి సత్కరించి పంపుదాం అని రమ్మాన్నాం
ఫణీంద్ర : దేవయానీ.. నోర అదుపులో పెట్టుకో.. చెప్పు మహేంద్రా.. నువ్వు చెప్పింది అబద్దం అని నాకు తెలుసు.. అందరి ముందు మను తండ్రి నువ్వే అని ఎందుకు అబద్దం చెప్పావ్ ?
మహేంద్ర: నేను చెప్పింది అబద్దం అని మీరు నమ్ముతున్నారు కదా అన్నయ్యా
ఫణీంద్ర : అవును, నమ్ముతున్నాను
మహేంద్ర: మీరు నమ్మినప్పుడు ఇందులో చెప్పడానికేం ఉంది.. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి
దేవయాని : అలా ఎలా వదిలేస్తారు?? పోయేది నీ పరువు కాదు.. ఈ కుటుంబం పరువు..
మహేంద్ర: నేను అంత పెద్ద తప్పు చేయలేదు వదినగారూ.. నాకు నేరాలు ఘోరాలు చేయడం రాదు. కుట్రలు పన్నలేను
శైలేంద్ర : ఇప్పుడు మేం అలా అన్నామా బాబాయ్.. మీరు ఎంత మంచి వారో మాకు తెలియదా? మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో ఉద్దేశం ఉంటే ఉంటుంది కదా.. అదే అడుగుతున్నాం.
మహేంద్ర: మను తండ్రి గురించి అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చూసి తట్టుకోలేకపోయాను.. నా మనసుకి బాధగా అనిపించింది. మను అందరిలో తల దించుకోవడం నాకు కష్టంగా అనిపించింది. అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. అందరి నోరూ మూయించాలనే నేను మను తండ్రిని అని చెప్పాను. ఇందులో మరో ఉద్దేశం లేదు.
దేవయాని: అంతేనా ఇంకేం లేదా?
ఫణీంద్ర : ఏం లేదని చెప్తున్నాడు కదా.. ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావ్
దేవయాని: మహేంద్ర గురించి మనకి తెలుసు కాబట్టి నమ్ముతాం.. మరి బయట జనానికి ఏం చెప్తావ్. మనోని ఎవరో వేధిస్తున్నారని అందుకే నేను తండ్రిని అని చెప్పానని, నిజానికి కాదని చెబుతావా? అప్పుడు తండ్రి అని , ఇప్పుడు కాదు అని అంటావా?
శైలేంద్ర: ఏంటి బాబాయ్.. మీరు ఏం చెప్తున్నారో మాకే అర్ధం కావడం లేదు.. బయట వాళ్లకి ఏం చెప్తారు.. మాలాంటి వాళ్లకి చెప్పాల్సిన మీరే.. ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటి?
మహేంద్ర: నేను తీసుకున్న నిర్ణయం సరైనదే,
ఇదే సమయం అని అటు దేవయాని, ఇటు శైలేంద్ర రెచ్చిపోతారు . మను మీ బాబాయ్ కొడుకేనా అని అందరూ తనను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారని, వారికి ఏమని సమాధానం చెప్పాలి అంటూ మహేంద్రను ప్రశ్నిస్తాడు శైలేంద్ర. రేపటి నుంచి మేము ఎలా బయటతిరగాలి. నువ్వు చేసిన తప్పుకు మేము ఎందుకు శిక్ష అనుభవించాలి అంటూ మహేంద్రపై ఫైర్ అవుతుంది దేవయాని. కుటుంబానికి నువ్వు పెద్ద మచ్చ తెచ్చావని కోప్పడుతుంది. మీరు చేసిన పనికి నేను అవమానంతో కృంగిపోతున్నానని శైలేంద్ర గొంతు మార్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరో అవమానంతో బాధపడుతున్నారని.. సొంత మనుషుల్ని బాధపెడతావా? అంటూ దేవయాని రెచ్చిపోతుంది. దేవయాని మాటలను మహేంద్ర పట్టించుకోడు. అన్ని ఆలోచించుకునే నేను మను తండ్రిని అని చెప్పాను. అందులో ఎలాంటి తప్పు, స్వార్థం లేదని అంటాడు. అది కాదు మహేంద్రా అని ఫణీంద్ర అనేసరికి.
మహేంద్ర: సారీ అన్నయ్యా.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. నేను మాత్రం నా మాటకి కట్టుబడే ఉంటాను. మను కోసం నేను ముందడుగు వేస్తానే కానీ.. వెనకడుగు వేయను. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి అన్నయ్యా..
అని చేతులెత్తి క్షమాపణ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?