Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు మార్చి 19th ఎపిసోడ్)
మను టేబుల్ పై కొత్తజంట పోస్టర్స్ చూసి అనుపమ-వసుధార ఇద్దరూ అపార్థం చేసుకుంటారు. మను చెప్పాలనుకున్నది కూడా వినరు. కాలేజీ నుంచి వెళ్లిపోమని ఆర్డర్ వేస్తారు. మను ఏమీ మాట్లాడలేక ఆగిపోతాడు. అయితే ఇదంతా చూసి సంతోషించిన శైలేంద్ర... రాజీవ్ కి కాల్ చేసి గుడ్ న్యూస్ చెబుదాం అనుకుంటే..అప్పటికే రాజీవ్ కి సమాచారం చేరిపోతుంది...
శైలేంద్ర: కాలేజీకి లేని అప్పు నేను సృష్టిస్తే వాడు అది తీర్చినట్టు బిల్డప్ ఇచ్చి దేవుడు అయిపోయాడురాజీవ్: బోర్డ్ మెంబర్ గా జాయిన్ అయ్యాడు.. వసు బర్త్ డే కూడా చేశాడు కదాశైలేంద్ర: వాడు గట్టిగానే ప్రయత్నించాడు కానీ ఇలాంటిది జరుగుతుందని ఊహించి ఉండడురాజీవ్: కాలేజీలోకి ఎంత తొందరగా ఎంటరయ్యాడో..వసు మనసులోకి కూడా అంతే త్వరగా వచ్చాడు..ఎట్టకేలకు వెళ్లిపోతున్నాడు చాలు.. లేదంటే ప్రతి దానికీ అడ్డుపడుతున్నాడు.ఇక వాడు అడ్డు తొలగింది..శైలేంద్ర: నేను ఎవడికి అయితే టాస్క్ ఇచ్చానో వాడికి కాల్ చేసి ఆపేయమని చెబుతానంటూ...మనుని చంపమన్న రౌడీకి కాల్ చేసి వాడిని వదిలేమంటాడురౌడీ: నేను కమిటయ్యాడ మిడిల్ డ్రాప్ ఉండదు... వాడిని వేసేసి మీకు కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు...
Also Read:
అనుపమ కొట్టిన చెంపదెబ్బలు, అనుపమ-వసు అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కాలేజీ నుంచి బయటకు దీనంగా నడుస్తూ వెళుతుంటాడు.. అప్పుడే మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు...మహేంద్ర: ఎక్కడికి వెళుతున్నావ్... ఏంటి డల్ గా ఉన్నావ్..మా అందర్నీ హ్యాపీగా ఉంచి నువ్వుడల్ గా కనిపిస్తున్నావ్ ఏంటి..మను: అదేం లేదుసర్మహేంద్ర: నేను రిషి కోసం చేయించిన కంకణం ఇది..సరైన సమయం చూసి తనకి ఈ కంకణం తొడగాలి అనుకున్నాను. రిషి లేని సమయంలో మాకోసం మా సంతోషం కోసం ప్రయత్నిస్తున్న నీకు ఈ కంకణం తొడగాలి అనుకుంటున్నాను మను ఏమోషనల్ గా నిల్చుంటాడు..అనుపమ, వసుధార వాళ్ల మాటలు వింటుంటారుమను; వద్దు సర్..నాకు ఇలాంటివి ఇష్టం లేదు..మహేంద్ర: నీ మాటల్లో ఇష్టం లేదని వినిపించినంతమాత్రాన నీ మనసుకి ఇష్టం లేదనుకోను..నువ్వు ఇష్టం లేదన్నంతమాత్రాన నేను వదిలిపెట్టను.. వసుధార బర్త్ డే సెలబ్రేషన్ ఇష్టం లేదంది..కానీ నువ్వు సెలబ్రేషన్ చేసి నువ్వు మెప్పించావ్ కదా...మను: అది వేరు ఇది వేరు ఏమీ అనుకోకండి సర్..మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్స్ సర్..శైలేంద్ర కూడా చాటుగా వింటుంటాడు...మను: మీరు నన్ను కొడుకుగా ఎలా ఫీలవుతున్నారో నేను కూడా మిమ్మల్ని ఫాదర్ లా, గురువులా ఫీలవుతున్నాను...మహేంద్ర: నేను మాట్లాడుతుంటే వస్తువులు ప్యాక్ చేయమంటున్నావ్..ఎక్కడికి వెళుతున్నావ్మను: నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది...నేను వెళ్లిపోతున్నామహేంద్ర: వెళ్లొస్తా అనాలి కదామను: మళ్లీ వచ్చే ఉద్దేశం లేదు..నేను వచ్చినా కానీ చాలామందికి ఇక్కడ నచ్చదు..వెళ్లిపోతున్నా సర్..థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్..అసలు ఏం జరిగిందని మహేంద్ర అడుగుతాడు కానీ మను చెప్పడు...
మను వెళ్లిపోయిన తర్వాత..అనుపమ దగ్గరకు వెళ్లి నిలదీస్తాడు మహేంద్ర...అనుపమ: తనే వచ్చాడు వెళ్లాలి అనుకున్నాడు వెళుతున్నాడుమహేంద్ర: సడెన్ గా వెళ్లిపోతున్నా అని ఎందుకు అంటున్నాడునీకేమైనా తెలుసా వసుధారా అని ప్రశ్నిస్తాడు...
కాలేజీ నుంచి దీనంగా బయటకు వచ్చిన మనుని...శైలేంద్ర పురమాయించిన రౌడీ చూస్తాడు..అటాక్ చేసేందుకు ఇదే మంచి సమయం అని ఫిక్సవుతాడు.. శైలేంద్ర చెట్టుచాటు నుంచి గమనిస్తుంటాడు... రౌడీ కత్తి తీసుకుని అటాక్ చేసేందుకు పరిగెత్తుతూ వస్తుంటాడు... ఆ రౌడీని గమనిస్తుంది అనుపమ...( గతంలో వసుధార-రిషిపై అరకులో దాడి చేసిన వాడే)..మనుని తప్పించబోయి ఆ కత్తిపోటు అనుపమై పడుతుంది... అది చూసి మను వెంటనే అమ్మా అని అరుస్తాడు...అప్పుడే అక్కడకు వచ్చిన మహేంద్ర-వసుధార అమ్మా అనే పిలుపువిని షాక్ అవుతారు... వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు...అదే మాట విన్న శైలేంద్ర కూడా అంటే వీడు అనుపమ కొడుకా అనుకుంటాడు...
మను గతంలో జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటాడు..నువ్వు నన్ను అమ్మా అని పిలవొద్దు - మనమధ్య ఏం బంధం లేదు - నాకంటూ ఎవరూ లేరు..నీకూ ఎవరూ లేరు అన్న మాటలు గుర్తుచేసుకుంటుందిమను: నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను..పొరపాటు జరిగింది నన్ను క్షమించమ్మా అనుపమ: మను చేయి తీసి తలపై ఒట్టువేయించుకుంటుంది..మరోసారి నన్ను అమ్మా అని పిలిచావంటే నేను చచ్చినంత ఒట్టు అంటుందిమను ఏమీ మాట్లాడలేక ఆగిపోతాడు... అది గుర్తుచేసుకుంటాడు మను... ఐసీయూలో ఉన్న అనుపమని చూసి బాధపడతాడు...( ఇంతకీ మను అంత పెద్ద తప్పు ఏం చేశాడో ..వీళ్ల గతం ఏంటో ఇంకా రివీల్ కాలేదు)
గుప్పెడంత మనసు మార్చి 19 ఎపిసోడ్ ముగిసింది....
గుప్పెడంత మనసు మార్చి 20 ఎపిసోడ్ లో మను-అనుపమ గతం రివీల్ కానుంది....
Also Read: నేటి రాశి ఫలాలు (19/03/2024) - ఈ రాశులవారు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మంచిది!