Guppedantha Manasu January 13 th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 13 ఎపిసోడ్)


వసుధార దగ్గరకు వెళ్లాలి...లేదంటే..వసుధారని రప్పించాలని భద్ర ప్లాన్ చేస్తాడు.  మేడంని, వాళ్ల నాన్నగారిని ఇక్కడకు తీసుకొస్తే సరిపోతుంది కదా అంటాడు.. మహేంద్ర మాత్రం వెళ్లి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించి తీసుకురా అని అక్కడి నుంచి పంపించేస్తాడు...


మరోవైపు శైలేంద్ర..ధరణి ద్వారా రిషి గురించి తెలుసుకోవాలని ఫిక్స్ అయి.. ధరణి వినేలా ఫేక్ కాల్ మాట్లాడుతాడు. రిషి దొరికాడా, అక్కడే ఉండండి నేనే వాడిని చంపాలి ..కేర్ ఫుల్ గా ఉండండి..ఇప్పుడే బయలుదేరుతున్నా అంటాడు. ఆ ఫోన్ కాల్ విని ధరణి భయపడుతుంది. ఇప్పుడేం చేయాలి...ఎలాగైనా రిషిని కాపాడాలి అనుకుంటుంది. 


అనుపమ-మహేంద్ర
అనుపమ: భద్ర ప్రవర్తన నాకు అంతుపట్టడం లేదు...వాడు చేసిన పనులన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి
మహేంద్ర: నీకెలా రోడ్డుపై పరిచయం అయ్యాడో నాక్కూడా అలానే పరిచయం అయ్యాడు...మాటలు, చేతలు డిఫరెంట్ గా ఉంటాయి.. మొన్న వసుధార వాళ్లింటికి వెళ్లడమే నాకు అంతుపట్టలేదు.. 
అనుపమ: సెక్యురిటీగా వచ్చినవాడు అలాగే ఉండాలి కానీ..అనవసర ప్రశ్నలు వేయకూడదు కదా. ఇవన్నీ చూస్తుంటే తను శైలంద్ర మనిషే అనిపిస్తోంది
మహేంద్ర: తనని పనిలోంచి తీసేద్దామా
అనుపమ: తనే మానేస్తాను అంటున్నాడు కదా..తను వెళ్లిపోతే అన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి..తనని ఇక్కడే ఉంచి మనం ఓ కన్నేసి ఉంచాలి. వాడు నిజంగానే మన శత్రువు పంపించినవాడే అయితే మన సమాచారం లీక్ చేయడం కాదు..తననుంచే మనం సమాచారం తెలుసుకోవాలి... ఇప్పుడప్పుడే వాడిని పీకిపారేయకుండా కొన్నాళ్లు ఇక్కడే ఉంచు అంటుంది..
ఇంతలో భద్ర ఎంట్రీ ఇస్తాడు...మహేంద్ర-అనుపమ షాక్ అవుతారు...
మీరు పెట్రోల్ కొట్టించుకుని రమ్మన్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు కదా అంటాడు..
కార్డ్ ఇచ్చి పంపించేస్తాడు మహేంద్ర...మనం మాట్లాడుకున్నది విన్నాడా అని అనుపమ అంటే..ఒకవేళ విన్నాకానీ వాడే పోతాడులే అంటాడు..


Also Read: 'భగవంత్ కేసరి' స్టైల్లో ఫైట్, రిషికి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయిన శైలేంద్ర!


శైలేంద్ర ఉచ్చులో చిక్కుకున్న ధరణి...రిషికి ఏమైందో అనే టెన్షన్ తో వసుధారకి కాల్ చేస్తుంది. రిషిని మా ఆయన పట్టుకున్నారంట, రిషిని చంపేస్తారంట అని కంగారుగా చెబుతుంది... అటు వసుధార మాత్రం మీరేం కంగారుపడకండి మేడం అంటూ మాట్లాడుతుంటే శైలేంద్ర ఫోన్ లాక్కుంటాడు. ఆ విషయం తెలియని వసుధార..రిషి సార్ కి ఏం కాదు అంటుంది. ఇంకా ఏదో చెప్పబోతుంటే ధరణి ఫోన్ లాక్కుని కట్ చేస్తుంది. 
ధరణి: అత్తయ్యగారు నాకు జ్యూస్ తీసుకురావడం, ఎప్పుడూ లేని ప్రేమ నాపై ఒలకబోస్తుంటే అర్థంకాదు అనుకోకండి..
దేవయాని: ఇప్పుడు నువ్వేం చేయలేవు
ధరణి: రిషి మీ ఆట కట్టిస్తాడు..క్రూరంగా నవ్వుతున్న శైలేంద్రని చూసి...ఇప్పుడే నవ్వుకోండి రిషి వస్తే మీ జీవితాల్లో ఏడుపు తప్ప ఇంకేం మిగలదు..
అదేంటి అలా మాట్లాడుతుంది అంటే..వదిలెయ్ మమ్మీ అంటాడు శైలేంద్ర. ఇక నా ఆట మొదలవుతుంది అనుకుంటాడు.


Also Read: రిషికి మొత్తం చెప్పి అసలు విషయం దాచిన వసు, ధరణికి దొరికిపోయిన శైలేంద్ర!


ఈ రోజు రిషిని కనిపెట్టి వాడిని చంపేయాలి అనుకుంటాడు.. చక్రపాణి ఇంటి గోడదూకి లోపలకు వెళతాడు.. ప్రతిరూమ్ వెతుకుతూ ఉంటాడు.. ఇంతలో లైట్ వెలగడంతో కంగారుగా చూస్తుంటాడు... వసుధార బయటకు వస్తుంది...
శైలేంద్ర: వసుధారా అది అని ఏదో మాట్లాడబోతుంటాడు...
వసు: మరీ ఇంత నీచానికి దిగజారుతావా..కుక్కలైనా బెటర్..నువ్వు అంతకన్నా నక్కి నక్కి వస్తున్నావ్. అసలు ఎందుకొచ్చావ్, ఎవరి పర్మిషన్ అడిగి వచ్చావ్
శైలేంద్ర: నా తమ్ముడిని చూసేందుకు నాకు పర్మిషన్ ఎందుకు
వసు: ఛీ.ఆపు..తమ్ముడేంటి..నువ్వు అలా పిలిస్తే చికాకుగా ఉంటుంది
శైలేంద్ర: రిషిని నువ్వే దాచిపెట్టావని నాకు తెలుసు, ఈ  నాటకాలు వద్దులే..రిషిని ఎక్కడ దాచావ్.
వసు: నాకు తెలియదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్లు..గెటౌట్...
శైలేంద్ర: రిషిని పట్టుకుంటా..వాడిని వేసేసి వెళ్లిపోతా..నేను మృగాన్ని నాకు బంధాలు, ఏమోషన్స్ ఏవీ ఉండవు..నాకు రిషి కావాలి వాడిని వేసేయాలి.. ఎక్కడున్నాడో చెబుతావా లేదా..లేదంటే నేనే వెతుక్కుంటా అంటూ వెళుతుంటాడు...వసుధార అడ్డుకుంటుంది..


Also Read:  భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!


మహేంద్రకి ధరణి కాల్ చేస్తుంది...మా ఆయన మళ్లీ ఏదో ప్లాన్ చేస్తున్నారంటూ జరిగినదంతా చెప్పి కంగారుపడుతుంది.. వెంటనే మహేంద్ర వసుధారకి కాల్ చేస్తాడు...కానీ లిఫ్ట్ చేయదు.. వసుధారని పక్కకు నెట్టేసి రిషి ఉన్న రూమ లోకి దూసుకెళతాడు శైలేంద్ర...డోర్ తీసి షాక్ అవుతాడు...


ఎపిసోడ్ ముగిసింది...