గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 1st Today Episode 570)


కనీసం జాబ్ లో జాయిన్ అయిన విషయం నాకు చెప్పాలనిపించ లేదా, నా దగ్గర ఇంతకు ముందు అసిస్టెంట్గా చేసేదానివి అదైనా గుర్తుందా అని రిషి అడిగితే..నాకు గుర్తుంది సార్ అప్పుడు జీతం తీసుకుని అసిస్టెంట్ గా చేశాను, ఇప్పుడు జీవితాంతం మీతో నడిచి అసిస్టెంటుగా ఉంటున్నాను అంటుంది
రిషి:ఏమీ జరగనట్టు ఇంత నార్మల్ గా మాట్లాడుతోందని మనసులో అనుకుంటాడు
వసు: అభి ప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన, ప్రేమ కరిగిపోదు కదా సార్ 
ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి మినిష్టర్ గారు రమ్మంటున్నారు, వెళ్లమని చెబుతాడు.. రిషి చెయ్యి ఏలా వుంది అని జగతి అడుగుతుంది, పర్వాలేదు మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళతారు. కారులో రిషి-వసుధార ఇద్దరూ సైలెంట్ గా ఉంటారు. మాట్లాడొచ్చు కదా అని ఎవరికి వాళ్లే అనుకుంటారు. అప్పుడు వసుధార రిషిచేతిపై చేయి వేస్తుంది. తీయు అని రిషి అనడంతో చేయి వదలను సార్ అంటూ.. కార్ ని ఆపండి అని చెబుతుంది. ఏంటో ఈ మధ్య నన్ను కమాండ్ చేస్తోంది అనుకుంటూ కారు ఆపుతాడు. మహేంద్ర ఏదో ఆలోచిస్తూ ఈ రెండువేళ్లలో ఒకటి పట్టుకో అని జగతిని అడుగుతాడు అంతలో గౌతమ్ అక్కడకు రావడంతో నువ్వు పట్టుకో అంటాడు. గౌతమ్ ఓ వేలు పట్టుకోగానే...ఎస్..ఇద్దరూ మళ్లీ కలసిపోతారని సంతోష పడతాడు.


Also Read: మన గురించి ఏమీ చెప్పొద్దు బంగారం అంటూ మోనితతో అత్యంత చనువుగా దుర్గ, డిస్ట్రబ్ అయిన కార్తీక్


కారు ఆపి దిగిన రిషి చేతికి ట్రీట్మెంట్ చేస్తుంది వసు. నా మనసు తెలిసి కూడా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని రిషి ప్రశ్నిస్తాడు.
రిషి: తల్లిదండ్రులు పిల్లలకు బొమ్మలు తెచ్చిస్తారు కానీ ప్రమాదకరమైన బొమ్మలు తెచ్చి ఇవ్వరు కదా.. కొన్ని విషయాలు అంతే మీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ నాకు కాదంటుంది. రిషి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది... ఈ చెయ్యి నాకు కాలేజీలో సీటు ఇచ్చింది, ఈ చెయ్యి నాకు అండగా ఉంది..ఈ చేయి నన్ను నడిపించింది..మీరు అరిచినా కోప్పడినా మీమీదున్న గౌరవం ఏ మాత్రం తగ్గదు సార్..
రిషి: చేతికి అయిన గాయం తగ్గిపోతుంది కానీ మనసుకి అయిన గాయం బాధ ఎన్నేళ్లైనా పోదు..బాల్యం నుంచి అనుభవిస్తోన్న ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు..నీకు తెలియదు కదా..నువ్వు చెప్పినట్టే నేనొక ఉదారహణ చెబుతాను... నాకు కడుపునొప్పి వచ్చిందనుకో..పక్కనే ఉన్న ఫ్రెండ్ ట్యాబ్లెట్ వేసుకో, నీళ్లు తాగు తగ్గుతుందని చెప్పేస్తాడు కానీ ఆ కడుపునొప్పి బాధేంటో నాకు మాత్రమే తెలుస్తుంది
వసు: బాధకు కొలమానాలు ఉండవు సార్..కానీ రిషి వసుధార ఇద్దరూ రిషిధార అయినప్పుడు ఒకరి బాధను ఒకరు పంచుకోగలం, ఒకరి సమస్యలను ఒకరు పరిష్కరించుకోగలం
రిషి: నాకు కావాల్సిన పరిష్కారం నీ దగ్గరుంది..కానీ..నేను భరించలేనంత మొండితనం నువ్వు చూపిస్తున్నావ్
వసు: కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నే వెతుక్కుంటుంది సార్.. వెళదాం పదండి...
మనిద్దరు మనసులు దూరం అవుతున్నాయేమో అనే భయంగా ఉందని అనుకుంటాడు రిషి.. ఇన్నాళ్లూ మనం దూరం ఉన్నాం, మనసులు కలిశాయ్ చిన్న చిన్న వాటికోసం మనసు పాడుచేసుకోవద్దు సార్ అని వసు మనసులో అనుకుంటుంది.
మినిస్టర్ దగ్గర కూర్చుంటారు రిషి-వసు... వసుని పొగిడేస్తాడు మినిస్టర్. తనకి ఈ జాబ్ కరెక్ట్ కాదని తెలుసు కానీ తనే పట్టుబట్టి ఈ జాబ్ చేస్తానంది కాదనలేకపోయానంటాడు. వసుధార సివిల్స్ కి వెళ్లినా అవలీలగా మంచి జాబ్ కొట్టేస్తుంది అంటాడు. వసుధార మంచి అమ్మాయి ఎప్పుడూ తనని వదులుకోకు అని సలహా చెబుతాడు... ఆ మాట విని రిషి మినిస్టర్ గారు మా మద్య గొడవలు తెలిసినట్టే మాట్లాడుతున్నారేంటి అనుకుంటాడు...మిషన్ ఎడ్యుకేషన్ లానే ఈ ప్రాజెక్ట్ కూడా విజయవంతం చేయాలని సలహా ఇస్తాడు...


Also Read: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార




రిషి ఇంకా రాలేదేంటని జగతి కంగారుపడుతుంటే..రిషి..వసుతో కలసి వెళ్లాడు కదా..తిరగనీ.. వాళ్లిద్దరి మధ్యలో కోపం మంచులా కరిగిపోవాలి మంచిగా కలసిపోవాలి అంటాడు...అంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటే, కోపంగా ధరణి అని అరుస్తుంది దేవయాని...



దేవయాని: జీవితాన్ని సరాదాగా తీసుకోకు..రిషి జీవితం నాశనం చేయొద్దు..
మహేంద్ర: నేను ఏమన్నాను..
దేవయాని; మీరిద్దరూ ఒకేమాటపై ఉంటారు..ఒకే విషయాన్ని ఆలోచిస్తారు..రిషి వసుధారతో ఉన్నప్పుడు నీకు ఈ ఆనందం ఏంటి.. జగతికి ఏనాడూ పట్టదు..తండ్రిగా నీకు బాధ్యత లేదా..జగతి ఇంటికి రాగానే రిషిని గాలికి వదిలేశావా...జగతి ఇంటికి రాకముందు రిషి అంటూ తిరిగేవాడివి..పెళ్లాం రాగానే కొడుకు చేదయ్యాడా
మహేంద్ర: జగతికి నేను మానసికంగా ఎప్పుడూ దూరమవలేదు..
దేవయాని: రిషిని పట్టించుకోవడం లేదు.. తలతిక్కగా మాట్లాడుతూ పెద్దలంటే గౌరవం లేని ఆ వసుధారని ఇంటి కోడలిగా తీసుకొద్దాం అనుకుంటున్నారా..నిజం చెప్పు..ప్లాన్లు వేస్తున్నారు కదా...
జగతి: మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు
దేవయాని: వసు..రిషి జీవితంలోకి రావడానికి కారణం నువ్వేకదా.. మొగుడు పెళ్లాలు ఇద్దరూ కలసి నాటకాలు ఆడుతున్నారా .  ఈ మహాతల్లి రిషిని వదిలివెళ్లిపోతే రిషిని పెంచి పెద్దచేసింది నేను..మీకు నచ్చిన వాళ్లని రిషికి అంటగడతానంటే నేను ఒప్పుకోను.. తన జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను
మహేంద్ర: అలా ఎలా వదినగారు..రిషికి ఏం కావాలో మేం కదా డిసైడ్ చేయాల్సింది.. 
దేవయాని: రిషితో నాకు సంబంధం లేదా..రిషి నీ కన్నకొడుకు అని నన్ను దూరం పెడుతున్నావా.
మహేంద్ర: రిషి సంతోషాన్ని పాడుచేస్తే ఊరోకనని మీరంటున్నారు..ఆ మాట నేను అనాలి..రిషి నా కొడుకు.. అవును రిషి మా కొడుకే..మా జీవితాన్ని గందరగోళం చేసారు, మా ఇద్దరి విషయంలో ఎన్నో కుట్రలు చేశారు.. ఒక్క మాట మీగురించి అన్నయ్యకిచెప్పినా,రిషికి చెప్పినా మీ స్థానం ఎక్కడో ఆలోచించుకోండి... మన మంచితనం సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు.. మీరు ఇక్కడితో ఆగండి..ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. రిషి-వసుజీవితాలు వాళ్లకే వదిలేయండి.. మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు.. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు..
ఎపిసోడ్ ముగిసింది...