రిషి, వసుధార ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇంతలో ఆ బస్తీలో వ్యక్తి వీళ్లిద్దరి గురించి ఆరా తీస్తుంది. భోజనం పూర్తైన తర్వాత నీ వంటలు చాలా బాగున్నాయని చెప్పి వెళ్లిపోతాడు. బస్తీలో ఉన్న వ్యక్తులు వీళ్ల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఇల్లు ఇచ్చి తప్పు చేశామేమో అనుకుంటారు. ఇంతలో రిషి వెళ్లిపోతాడు.
బస్తీ వ్యక్తి వచ్చి వసుధారను నిలదీస్తారు. ఈ కథలేంటని అడుగుతుంది. సార్ అయితే కాలేజీలో పాఠాలు చెప్పాలి కానీ ఇంటికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తారు. బస్తీ అన్నాక అందరి చూపులు అందరిపై ఉంటాయని గట్టిగా క్లాస్ పీకుతుంది. ఆయన నీకు ఏమవుతారని ప్రశ్నిస్తుంది. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోమని హెచ్చరించి వెళ్లిపోతారు.
ఏడుస్తూ రూమ్‌కి వెళ్లిపోతుంది. ఆ బస్తీ వ్యక్తి దేవయానికి ఫోన్ చేసి చెప్పిన పని చెప్పినట్టు చేశానని చెబుతుంది. జగతి, వసుధారకు ఇద్దరికీ ఒకేసారి ప్లాన్ చేశానని హెచ్చరిస్తుంది. ఇంతలో వెనుకాలే ఉన్న ధరణి ఉంటుంది. దాన్ని గమనించిన దేవయాని... ఎందుకు వచ్చవాని అడుగుతుంది. జ్యూస్ డబుల్ పంచదార వేసి తీసుకురమ్మని చెబుతుంది.
తెల్లారుతుంది. గౌతమ్, రిషి ఇద్దరూ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు. మహేంద్రను పిలుస్తాడు గౌతమ్. రిషి వద్దంటాడు. ఇంతలో మళ్లీ సాక్షి ప్రస్తావన తీసుకొస్తాడు గౌతమ్. ఆ టాపిక్ నా ముందు తీసుకురావద్దని రిషి వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఇంతలో రిషికి సాక్షి ఫోన్ చేస్తుంది. ఫోన్‌లో మాట్లాడుకునేంత చనువు మన ఇద్దరి మధ్య లేదని... నా ఫ్రెండ్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు. నీ యాటిట్యూడ్ ఏమీ మారలేదని మనసులో అనుకుంటుంది.
ఇంతలో ఫ్రెండ్ అంటే గౌతమ్ తన గురించి అనుకుంటాడు. నీతో అన్నానా అంటు ట్విస్ట్ ఇస్తాడు. అక్కడకు జగతి జ్యూస్ తీసుకొస్తుంది. కానీ రిషి దాన్ని పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గౌతమ్ పిలిచి మరీ చెబుతాడు జ్యూస్ తీసుకోమంటాడు. తర్వాత అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది జగతి. అయినా తాగకుండా వెళ్లిపోతాడు.
సీన్ మళ్లీ వసుధార రూమ్‌కు షిప్టు అవుతుంది. వసుధార సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంది. ఇంతలో మార్కెటింగ్ ఫోన్లు వస్తాయి. డిస్టర్బ్ చేయొద్దని పెట్టేస్తుంది. ఇది జరుగుతుండగానే రిషి ఫోన్ చేస్తాడు. మార్కెటింగ్ ఫోన్ అనుకొని చెడామడా తిట్టేస్తుంది. రిషి గట్టిగా నేను అనేసరికి సారీ చెబుతుంది. నీ రూమ్ దగ్గరే ఉన్నాను త్వరగా రమ్మంటాడు. మళ్లీ బస్తీలో దేవయాని మనిషి వీళ్లిద్దర్నీ చూస్తుంది. ఇద్దరూ కారులో బయల్దేరడాన్ని కూడా చూస్తుంది.
కారులో వెళ్తూ ఎక్కడకు వెళ్తున్నామో అని అడుగుతుంది వసుధార. బ్రేక్ ఫాస్ట్ చేశావా అని అడుగుతాడు. లేదంటే... టైంకి తినాలని క్లాస్ పీకుతాడు. మార్కెటింగ్ కాల్‌కు నా కాల్‌కు తేడా లేదా అని డౌట్ వస్తుంది. అయితే ఫోన్ నెంబర్ చూడలేదని చెబుతుంది.
దారిలో వీళ్లిద్దరు వెళ్లడాన్ని ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తి కూడా చూస్తాడు. ఇంతలో వసుధార రూమ్‌కు జగతి, మహేంద్ర వస్తారు.
దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది..
రేపటి ఎపిసోడ్
రిషి ఇంట్లో ఉండగానే సాక్షి వచ్చి ఉంటుంది. ఆమె ఈ ఇంటికి సరైన కోడలని దేవయాని గట్టిగా చెబుతుంది. అప్పుడు రిషి నోట మాట రాదు. ఇంతలో కారులో వెళ్తూ వసుధారకు ఫోన్ చేస్తాడు. నేను వస్తున్నాను అని చెప్తాడు. ఏదో భయపడుతూ మాట్లాడుతుంది వసుధార. వద్దని చెప్పేలోపు రిషి తన రూమ్ డోర్‌లు తీస్తాడు. షాక్ అవుతుంది వసుధార.