జ్వాలతో నిరుపమ్ వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావని శోభకు క్లాస్ తీసుకుంటుంది. ఏదో ఒకటి చేసి వాళ్లను కలవనీయకుండా చేయమంటుంది. నా తెలివి తేటలతో ఆ జ్వాలను సిటిలోనే లేకుండా చేస్తానంటూ శపథం చేస్తుంది. ఆ జ్వాల తెలివితేటల కంటే నిరుపమ్ మంచితనంతోనే సమస్య అని స్వప్న భయపడుతుంది. ప్రేమ్ కాస్త గడుసుగా ఉంటాడు కానీ... నిరుపమ్ చాలా మెతకని చెబుతుంది. నిరుపమ్ భవిష్యత్ మొత్తం నాదే అంటుంది శోభ.
ఆనంద్ ఇంటికి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది హిమ. జ్వాల వస్తుందా అని అడుగుతుంది. రావడం లేదని చెప్తాడు ఆనంద్. మరిచిపోయినట్టు ఉందని బాధపడతాడు. డబ్బులు పంపిస్తుంది కానీ... చూడటానికి రావడం లేదని చెప్తాడు. ఇంతలో జ్వాల అక్కడకు వస్తుంది. హిమను ఆనంద్ ఇంటి వద్ద చూసి షాక్ అవుతుంది. ఆనంద్‌పై హిమకు ఎందుకీ శ్రద్ధ అని అనుమానం పడుతుంది.
జ్వాల ఆటో తగలబెట్టినందుకు స్వప్నపై రివేంజ్ ప్లాన్ చేశాడు ఆమె బాబాయ్. కారు టైర్ పంక్చర్ చేసి బాబాయ్ పిన్ని ఇద్దరూ కలిసి స్పనతో ఆడుకుంటారు. ఆమె నుంచి నాలుగు వేలు కొట్టేస్తారు.
నిరుపమ్ ఫొటోలు ఫోన్‌లో చూసి మురిసిపోతుంటుంది జ్వాల. ఆసుపత్రిలో జరిగిన సీన్ తలచుకొని సంతోష పడుతుంది. ఇంతలో పిన్ని వచ్చి ఏం చూస్తున్నావని ప్రశ్నిస్తుంది. ఏం లేదని మాట మార్చేస్తుంది. తర్వాత అంతా చెబుతానంటూ కవర్ చేస్తుంది. అసలు నిరుపమ్‌తో పెళ్లికి స్వప్న ఒప్పుకుంటుందా అని అనుమాన పడుతుంది జ్వాల. ఇంతలో వేరే ఫోన్ రావడంతో అర్జెంట్‌గా బయటకు వెళ్లిపోతుంది.
హిమ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసరికి ప్రేమ్ ఉంటాడు. మనసులో ఏముందో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. ప్రేమ్‌ను చూసిన కాస్త కంగారు పడుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటారు.
షేట్ దగ్గరకు వెళ్తుండగానే ఆటో రిపేర్ వస్తుంది. ఇంతలో అటుగా వచ్చిన నిరుపమ్ ఆమెను చూసి కారు దిగి పలకరిస్తాడు. నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు. నీ పట్టుదల అంటే ఇష్టమంటాడు. కష్టపడే తత్వం ఇష్టమంటాడు. ఏమైందని అడుగుతాడు. క్లచ్ వైర్ తెగిపోయిందని... రిపేర్ చేస్తున్నట్టు చెప్తుంది. ఇంతలో మళ్లీ ఫోన్ వస్తే... రానని చెప్పమంటాడు నిరుపమ్. పని ఉందని తనతో రమ్మంటాడు. కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. మొత్తానికి ఆ పని ఎగ్గొట్టి నిరుపమ్‌తో వెళ్లేందుకు జ్వాల ఓకే చెబుతుంది. హిమకు ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని జ్వాలతో చెప్పిస్తాడు నిరుపమ్. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్తారు.
రేపటి ఎపిసోడ్
జ్వాల, నిరుపమ్ రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటారు. ఇంతలో హిమ వస్తుంది. మీ ఇద్దరూ వచ్చాక నన్ను ఎందుకు పిలిచారని నిష్టూరుస్తుంది. అనుకున్నట్టుగానే హిమ మనసులో అసూయ మొదలైందనుకుంటాడు.