రిసార్ట్‌కు వెళ్తున్న టైంలో తన మనసులో మాట చెబుతాడు రిషి. ఈ మధ్య కాలంలోనే నేనేంటో నాకు అర్థమైందంటాడు రిషి. నన్ను నేను కొత్తగా తెలుసుకున్నానని చెప్తాడు. ఎప్పుడూ ఒంటరిని అనే భావన ఉండేదని.. దాన్ని నువ్వు మార్చేశావని.. నన్ను నా మనసును ఏ మార్చేశావంటాడు. రిషిలో వసు చేరిందో... ఏమాయో అర్థం కాకుండా ఉందంటాడు. మొత్తంగా నాలో నువ్వు పూర్తిగా నిండిపోయావని అంటాడు.
వెంటనే కారు వద్దకు వెళ్లి గిఫ్టు తీసుకొచ్చి వసుధారకు ఇస్తాడు రిషి. గిఫ్టును విప్పి చూస్తుంది వసుధార. ఐ లవ్‌యూ పేరుతో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. వసుధార కూడా తనకు తెలియకుండానే ఐలవ్‌యూ చెప్పేస్తుంది. రిషి కూడా అదే చెప్తాడు. వెంటనే రిషిని వసుధార కౌగింలించుకుంటుంది. నాకు కూడా మీరంటే చాలా ఇష్టమని తన మనసులో మాట చెప్పేస్తుంది.
కట్ చేస్తే ఇదంతా రిషి డ్రీమ్ నుంచి బయటకు వస్తాడు. ఇంకా వసుధార ఆ గిఫ్ట్‌ను చూస్తుంటుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని స్థితిలో ఉంటుంది.
కాసేపటికి మీరంటే కూడా నాకు ఇష్టమని చెప్పేస్తుంది. జగతి మేడం కొడుకుగా, మంచి వ్యక్తిగా చాలా ఇష్టమని చెబుతుంది. లైఫ్‌లో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదంటుంది. నాకోసం ఎన్నో చేశారని... ఈ విషయంలో చాలా నేను అదృష్టవంతురాలని అని అంటుంది.
జగతి, సాక్షి కారణంగానే నేను ఎవరితో క్లోజ్‌గా ఉండలేకపోయానంటాడు రిషి. వెంటనే సాక్షి, రిషి మధ్య జరిగిన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని చెప్తాడు. తనపై ఇప్పుడు నాకు ఎలాంటి అభిప్రాయం లేదంటాడు. చాలా ఆనందంగా ఉందని చెప్తాడు రిషి.
ఎందుకు ఆనందం అని ప్రశ్నిస్తుంది రిషి. మీరేదో గిఫ్టు తీసుకొచ్చి ఐలవ్‌యూ అనగానే నేను కూడా అలా అంటానని ఎలా అనుకున్నారని ప్రశ్నిస్తుంది వసుధార. మీతో చాలా ఆత్మీయంగా ఉండటం కూడా నాకు సమస్యగా మారిందని చెబుతుంది. మీది ప్రేమ కాదేమో అని వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎలా చప్తావని ప్రశ్నిస్తాడు రిషి. మీలో ఈ ప్రేమ ఎప్పుడు కలిగిందని అడుగుతుంది వసుధార. ఈ మధ్యే అంటాడు. ఇన్నాళ్లు ఎందుకు అనుకోలేదని ఎదురు ప్రశ్న వేస్తుంది. అప్పుడు అలా అనిపించలేదని చెప్పేసరికి... అప్పుడు అనిపించనిది ఇప్పుడు ఎందుకు అనిపించిందో చెబుతుంది వసుధార. సాక్షి వల్లే అలాంటి అభిప్రాయం కలిగిందని వివరిస్తుంది. సాక్షి మళ్లీ తిరిగి వచ్చిందని నాపై ప్రేమ పుట్టిందని... లేకుంటే ఇదిప్రేమ అని తెలిసేది కాదంటుంది వసుధార. వెంటనే సీరియస్ అవుతాడు రిషి.