మనసులో మాట చెప్పేందుకు రెడీ అవుతాడు రిషి. వసుధారకు ఇవ్వాలని మంచి గిఫ్ట్ రెడీ చేస్తాడు. గిఫ్ట్ ఇస్తే తీసుకునేవాళ్ల కంటే ఇచ్చేవాళ్లకు ఇంత ఆనందం ఉంటుందని మొదటిసారిగా ఫీల్ అవుతాడు. 


వసుధారను ఎగ్జామ్‌ రాయనియ్యకుండా చేయాలని ప్లాన్ చేసిన సాక్షి... ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి రిషికి ఫోన్ చేస్తుంది. డిస్టర్బ్‌ చేయొద్దని మెసేజ్ చేస్తాడు. డిస్టర్బ్ చేయడానికే వచ్చిన దాన్ని అలా చేయకుండా ఎలా ఉంటానంటుంది. 


ఎగ్జామ్‌ బాగా రాశానని... రిషికి ఫోన్ చేస్తుంది వసుధార. ఎగ్జామ్‌లో టాప్ ర్యాంకు వస్తుంది... దీనికి కారణం మీరే అంటూ రిషిని పొగడ్తలతో ముంచెత్తుతుంది. మంచి ర్యాంకు వస్తుందని ముందే తెలుసని... అందుకే మంచి గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్తాడు. 
హాల్‌లో కూర్చొని ఉన్న దేవయాని రాగాలు తీస్తు ధీమాగా కూర్చొని ఉంటుంది. దీంతో పక్కనే ఉన్న జగతి. ధరణి అనుమాన పడతారు. ఏదో చేసి ఉంటుందని... రిషికి ఫోన్ చేసి కనుక్కోమంటుంది జగతి. ధరణి ఫోన్ చేస్తే కట్‌ చేసి తర్వాత చేస్తానంటూ మెసేజ్ పంపిస్తాడు. దీంతో ధరణి, జగతి ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. 


ఎగ్జామ్ హాల్‌ బయటకు గిఫ్ట్‌తో వచ్చి రిషి వెయిట్ చేస్తుంటాడు. వసుధార రాలేదేంటని అనుకుంటాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుంది. కంగారు పడతాడు. వసుధార వచ్చాక తన మారిపోయానంటూ అనుకుంటా ఉంటాడు. వసుధార తనను పూర్తిగా మార్చేసిందంటూ అనుకొని.. ఎగ్జామ్‌ హాల్ లోపలికి వెళ్తాడు. వసుధార ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటుంది. 


దగ్గరకు వెళ్లి ఏమైందని అంటాడు రిషి. నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు రిషి. బాగా రాశానని చెప్పి ఇచ్చిన పెన్ తిరిగి ఇచ్చేస్తుంది. ఏన్నో మంచి పనులకు సంతకం పెట్టిన ఈ పెన్‌ మీ దగ్గరే ఉండాలి అంటుంది. నాలో మార్పు గమనించావా అని రిషి అడిగితే... ఏదేదో చెప్పి మార్పు సహజమని కలర్ ఇస్తుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయల్దేరుతారు. 


నాలో మార్పునకు కారణం నువ్వే అంటూ చెప్తాడు రిషి. నేనా అంటూ ఆశ్చర్యపోతుంది వసుధార. ఇంతలో మనతో ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటామని కవర్ చేస్తాడు రిషి. 


సాయంత్రం అయ్యేసరికి రిసార్ట్‌కు వెళ్లి మనసులో మాట చెప్పడానికి ట్రై చేస్తాడు. రిషి ఇప్పుడు లేడని... మొత్తం వసుధారలా మారిపోయాడని చెప్తాడు. తను తీసుకొచ్చిన గిఫ్ట్‌ను ఇచ్చి ఐలవ్‌యూ చెప్పేస్తాడు. వసుధార కూడా తన మనసులోని మాట బయటపెడుతుంది.