క్లాస్‌కు వచ్చిన వసుధార లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఆ మాట విన్న రిషి ఒక్కసారిగా స్టూడెంట్స్‌పై సైలెన్స్‌గా ఉండాలని కోప్పడతాడు. ప్రోబ్లమ్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. ఎవరూ ముందుకు రాకపోయేసరికి సీరియస్ అవుతాడు. క్లాస్ బయట ఉన్న వసుధార నేను చేస్తానంటూ చెబితే మరింత మండిపడతాడు. క్లాస్‌కు టైంకు రావాలని.. అందుకే బెల్ కొట్టడాలు, ఇవన్నీ ఉంటాయంటాడు. టైమింగ్స్ పాటించడం మంచి అలావాటని వసుధారకు ఇండైరెక్ట్‌గా చెప్తాడు. క్లాస్‌కు లేట్‌గా వచ్చిన వాళ్లు క్లాస్‌ను, క్లాస్‌ చెప్పే వాళ్లను డిస్టర్బ్ చేస్తున్నారని అంటాడు. ముందుగా చెప్పినట్టు ఈ ప్రోబ్లమ్ కష్టంగానే ఉంటుందంటాడు. ఇందులో చిన్న లాజిక్‌ ఉందని అది తెలిస్తే ఈజీగా సాల్వ్‌ చేయవచ్చని అంటాడు. క్లాస్ పూర్తైందని అంతా వెళ్లిపోతారు. వసుధార కూడా వెళ్లిపోతుంది.  


క్లాస్‌ రూమ్‌లో ఉన్న రిషి.. వసుధార కూర్చున్న చోటులో కూర్చొని.. ఆలోచిస్తాడు. పక్కనే ఆమె కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే టైంలో బయటకు వెళ్లిపోతున్న వసుధార కూడా సార్‌కు నాపై ఎందుకంత కోపం.. కాస్త లేట్‌గా వస్తే తప్పేంటి అని.. ఈ విషయమేంటో తేల్చుకోవాలని అనుకుంటుంది. 


రిషి, వసుధార మధ్య జరిగిన విషయాన్ని మహేంద్రకు జగతి వివరిస్తుంది. ఇన్నాళ్లు రిషి వైపు నుంచే మనం ఆలోచించామని... ఇప్పుడు వసుధార వైపు నుంచి ఆలోచించలేదంటుంది. ఇద్దరూ తోడు దొంగలే ఎవరూ బయటపడటం లేదనుకున్నాం కానీ... ఇలా అవుతుందని అనుకోలేదనుకుంటారు. ఇద్దరూ చనువుగా తిరిగారు... అంత క్లోజ్‌గా ఉన్న వసుధార... ప్రేమను రిజెక్ట్ చేయడమేంటని అనుకుంటారు. ఇంతలో సడెన్‌గా వసుధారను గురుదక్షిణ అడిగిన సంగతి మహేంద్రకు గుర్తుకు వస్తుంది. ఏమన్నావని మహేంద్రను జగతి అడుగుతుంది. గురుదక్షిణ ఏంటని నిలదీస్తుంది. చిన్న పొరపాటు నావైపు నుంచి జరిగిందని ఎప్పుడో అడిగిన మాట వివరిస్తుంది. జగతిని, రిషిని కలపాలని... అదే గురుదక్షిణగా ఇవ్వాలని కోరినట్టు చెప్తాడు మహేంద్ర. అదే కరెక్ట్ కాదని... ఆమె వ్యక్తిత్వం అది కాదని జగతి చెబుతుంది. రిషి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడమే ఊహించని పరిణామమని... వసుధార రిజెక్ట్ చేయడం కూడా అంతకు మించిన పరిణామమని అనుకుంటారు ఇద్దరు. వసుధారకు ఏదో అడ్డుపడుతుందని అనుకుంటారు. ఇంతలో ఇదంతా అక్కడే ఉన్న గౌతమ్ వింటాడు. అమ్మ రిషిగా వసుధారకు ఐలవ్‌యూ చెప్పావా అని ఆశ్చర్యపోతాడు. నమ్మలేకపోతున్నారా బాబు అంటాడు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే వసుధార నేను అలా ఆలోచించే వాడినే కాదనుకుంటాడు. ఈ భారాన్ని ఎలా మోస్తున్నావో అనుకొని వెళ్లిపోతాడు.


ఓవైపు దేవయాని, సాక్షి ... రిషీని టార్గెట్ చేసుకున్నారు. వసుధార కూడా ఇలా చేసింది. వీటిని రిషి ఎలా తట్టుకుంటాడో అనుకుంటారు మహేంద్ర జగతి. తనకు తానే రిషి బలంగా నిలబడాలని అంటుంది జగతి. 


నాకు రిషి మధ్య ఉన్న అడ్డుగోడ వసుధారను తొలగించుకున్నానని ఇప్పుడు తను ఏంటో చూపిస్తాననుకుంటుంది సాక్షి. అసలు నేను వచ్చిందే వేరే గోల్‌ కోసమని... రిషిని మాత్రమే కావాలనుకున్నానని అంటుంది. తన కెరీర్‌ ను తాత్కాలికంగానే పక్కన పెట్టానని అసలు విషయాన్ని రివీల్ చేస్తుంది. దేవయాని ఆడించే తోలు బొమ్మను కాదని.. అందర్నీ ఆడిస్తానంటుంది. ఏం చేస్తున్నావు రిషీ... వసుధారను నువ్వు మర్చిపోవాల్సిందేనంటుంది. 


ఇంకా క్లాస్‌ రూంలో కూర్చొని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు రిషి. బోర్డుపై వసుధార పేరు రాసి చూస్తూ ఉండిపోతాడు. తన సంగతి ఏంటో అడిగేద్దామని వసుధార వస్తుంది. చేసిన తప్పేంటో అడుగుతానని కోపంగా వస్తుంది. 


అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్‌ వసుధారను పిలుస్తాడు. ఏంటని అడుగుతుంది. నీతో మాట్లాడాలని చెప్తాడు గౌతమ్. దీన్ని అక్కడే ఉన్న రిషి వింటాడు. పదండీ సార్ అంటూ వసుధార, గౌతమ్ వెళ్లిపోతారు. ఎవరూ లేని చోటుకు వసుధారను తీసుకెళ్లిన గౌతమ్‌... రిషని ఎందుకు రిజెక్ట్ చేశావని అడుగుతాడు. నీ మనసులో నిజంగా రిషి లేడా అని ప్రశ్నిస్తాడు. నీవు ఎవర్నీ ప్రేమించలేదా అని అడుగుతాడు. రిషి గురించి అన్ని తెలుసుకున్నావు ఎందుకు కాదన్నావని అడుగుతాడు. ఆ టైంలోనే ప్రేమ లేఖ రాసింది, బొమ్మ గీసింది రిషి అని రివీల్ చేస్తాడు గౌతమ్. మొదట షాక్ అయిన వసుధార... తర్వాత కవర్ చేసుకొని రిషిలో ఉన్న ఆర్టిస్ట్‌ను గౌరవిస్తానని.. కానీ ప్రేమ లేదంటుంది. నువ్వు అబద్దం చెప్తున్నావ్‌ వసుధార... నువ్వు రిషిని ప్రేమిస్తున్నావని గట్టిగానే చెప్తాడు గౌతమ్‌. నేను నా లక్ష్యాన్ని ప్రేమిస్తున్నానని.. నా కలను ప్రేమిస్తున్నానని... మనసులో లేనిది లేనట్టు చేస్తే తప్పు... మనసులో ఉన్నది ఉన్నట్టు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తుంది. అక్కేడ ఉండి వింటున్న రిషి వెళ్లిపోతుంటాడు. ఇంతలో ఫోన్ మోగుతుంది. రిషి విన్నాడన్న సంగతి వసుధార  గౌతమ్ అప్పుడు గుర్తిస్తారు. షాక్ తింటారు. 


రేపటి భాగం
నీతో మాట్లాడాలని జగతి రిషితో చెబుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మాట్లాడటానికి ఏముందని అంటాడు. రిజెక్ట్ అవ్వడానికే పుట్టినట్టు ఉన్నానని కన్నీరు పెట్టిస్తాడు రిషి. ఈ మనసులు బాధను మోస్తూ బతకడం అలవాటై పోయిందంటాడు. ఇది నాకు తల్లి ఇచ్చిన వరమని అంటాడు. రిషి నుంచి ఫోన్ వస్తుంది. ఆనందంతో ఎత్త బోతుంది వసుధార.