గుప్పెడంతమనసు జూన్ 17 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu June 17 Episode 479)


వసు నిద్రపోకుండా రిషి గురించే ఆలోచిస్తూ..రిషికి సారీ సారీ అంటూ  మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన రిషి వీటికి తక్కువ లేదంటూ ఫోన్ విసిరేస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన మహేంద్ర క్యాచ్ పట్టుకుంటాడు. 
మహేంద్ర-రిషి
ఎందుకొచ్చారని రిషి అడిగితే.. రాత్రంతా నీతో కబుర్లు చెబుదామని వచ్చానంటాడు. చందమామ కథలు చెప్పకండి అనడంతో ఎందుకంత సీరియస్ అని మహేంద్ర అడుగుతాడు. నేను సీరియస్ గా ఉన్నానని ఇప్పటికి గమనించారా..నన్ను నన్నులా వదిలేయండి అంటాడు. నీకు నిన్ను వదిలేస్తే నీతో నువ్వు మాట్లాడుకుంటావా అని ప్రశ్నిస్తాడు. మన మనసుని వేరేవాళ్లు అర్థం చేసుకోనప్పుడు ఏం చేస్తాం అంటాడు. ఈ మనసుంది చూశావా అని మొదలుపెట్టిన మహేంద్రతో..ఇప్పుడు మనసుపై చర్చ వద్దంటాడు. ఆపండి డాడ్ అన్న రిషి..గుడ్ చెప్పి బయటకు పంపించేస్తాడు. తండ్రి వెళ్లిపోయన తర్వాత నేను ఇలా బిహేవ్ చేస్తున్నానేంటి.. ఇదంతా నీవల్లే వసుధారా అని ఫీలవుతాడు రిషి.


జగతి-మహేంద్ర
అటు రూమ్ కి చేరిన మహేంద్రని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంది జగతి. అదేంటి మహేంద్రసార్ అప్పుడే వచ్చారేంటి.. రేపటి వరకూ కనిపించను అన్నారని సెటైర్ వేస్తుంది. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి.. నీ దగ్గర నీ కొడుకు దగ్గర ఈ వెటకారాలకు తక్కువ లేదంటాడు. ఏమైందని అడిగితే..గుడ్ నైట్ చెప్పి వెళ్లిపొమ్మన్నాడు.. వసుపై కోపాన్ని ఎవరిపై తీర్చుకోవాలో అర్థం కాలేదేమో అంటాడు. వసుపై కోపం ఎందుకు...ఆమె రెజెక్ట్ చేసిన బాధనుంచి బయటపడ  లేకపోతున్నాడు.. రిషి మనసుని బాధపెట్టిన వసుధారే ఆ భారాన్ని తగ్గించాలి..అది మన చేతుల్లో లేదు మహేంద్ర అంటుంది జగతి.


Also Read: తింగరే హిమ అని తెలిసిన జ్వాల ఏం చేయబోతోంది, కుట్రల్లో మోనితను మించిపోతున్న శోభ!


వసుధార
రూమ్ లో కూర్చుని నిద్రపోకుండా ఇంకా రిషి గురించే ఆలోచిస్తుంటుంది. మెసేజ్ పెట్టి డిలీట్ కొట్టేలోగా చూసేశారేంటో అనుకుంటుంది. కాల్ చేద్దామా అనుకుని కాల్ చేయాలి అనుకుంటుంది. అదే సమయంలో అక్కడ రిషి ఫోన్ ఆన్ చేసి పెడితే sorry పర్వం కొనసాగుతుందేమో అనుకుంటూ స్విచ్చాఫ్ చేసేస్తాడు. రిషి ఆలోచనల్లోనే ఉన్న వసు..ఈ రోజు ఎలాగైనా రిషి సార్‌తో మాట్లాడతాను, కోపం వచ్చినా ఓకే, తిట్టినా ఓకే, క్లాస్ నుంచి గెటవుట్ అన్నా పర్వాలేదు మాట్లాడుతానని ఫిక్సవుతుంది. 


కాలేజీలో
కాలేజీకి రాగానే రిషి..అటెండర్ ని పిలిచి జగతి మేడంని నా క్యాబిన్‌కి రమ్మని చెప్పండి. ఆ వెనుకే ఆటో దిగుతుంది వసుధార. ఉత్సాహంగా గలగలా మాట్లాడుకుంటూ లోపలకు వెళుతుంటుంది వసుధార. ఏంటి నువ్వేనా హుషారుగా కనిపిస్తున్నావ్ అని అడుగుతుంది పుష్ప. ఈ రోజు నాకున్న కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అందుకే ఇలా ఉన్నానంటుంది వసుధార. మరోవైపు క్లాస్ రూమ్ లో వసు కూర్చునే బెంచ్ వైపే చూస్తూ అక్కడ వసు ఉన్నట్టు ఊహించుకుంటాడు రిషి. అంతలోనే నేను మిమ్మల్ని ప్రేమించలేను అన్న మాట మనసులో మెదలడంతో బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 


దేవయాని-గౌతమ్
దేవయాని: రా గౌతమ్ కూర్చో..ఏంటీ ఈ మధ్య నాతో మాట్లాడటం లేదు. రిషి ఎలా ఉన్నాడు, తన సంగతులేంటి
గౌతమ్: నా గురించి అడగండి చెబుతాను
దేవయాని: నువ్వేంటో నాకు తెలుసు రిషి గురించి చెప్పు అంటుంది. అన్నీ తెలిసినట్టే ఉన్నా మనకు అర్థంకాడు. రిషి-వసుధార మధ్యలో ఏం జరుగుతోందో నాకేం అర్థంకావడం లేదు
గౌతమ్: కొన్ని అర్థం కాకపోతేనే బావుంటాయ్ అని మాట స్కిప్ చేసి..వాళ్లిద్దరి పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోవడం బావోదని తేల్చేస్తాడు. ఇంతలో కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు
గౌతమ్-దేవయాని డిస్కషన్ విన్న సాక్షి..''దేవయాని ఆంటీ ప్లాన్ ఫాలో అయితే రిషిని చేరుకోలేను..ఆంటీ ప్లాన్ విన్నట్టు నటిస్తూనే నా మనసు చెప్పింది చేయాలని అనుకుంటూ వెనక్కు వెళ్లిపోతుంది.


Also Read: పెదవి దాటని వసు ప్రేమ - థ్యాంక్స్ చెప్పి డైలమాలో పడేసిన రిషి, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తరంగాలు


రిషి క్యాబిన్లో
సార్ మీరు ఏమంటున్నారని జగతి అడిగితే..ఏం మాట్లాడొద్దు నేను చెప్పింది చేయండని క్లియర్ గా చేప్పేస్తాడు రిషి. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార..మినిస్టర్ గారికి పెట్టిన మెయిల్ చెక్ చేయమని అడగ్గా మేడం ఆ పనులన్నీ మీరు చూసుకోండి అనేసి అక్కడి నుంచి రిషి కోపంగా వెళ్లిపోతాడు. ఇక్కడ తప్పించుకున్నా క్లాస్ రూమ్ లో తప్పించుకోలేరు అనుకుంటుంది వసుధార. క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన రిషికి సాక్షి ఎదురుపడుతుంది. 


సాక్షి:మళ్లీ ఎందుకొచ్చావ్ అంటూ రొటీన్ క్వశ్చన్స్ వేయొద్దన్న సాక్షి నేను నిన్ను కలవడానికి రాలేదు..డీబీఎస్టీ కాలేజీలో పోస్టులున్నాయని తెలిసి అప్లై చేశాను ఇంటర్యూకి వచ్చానంటుంది. ఇప్పటి వరకూ ఏ ఇంటర్యూలోనూ రిజెక్ట్ అవలేదు..కాస్త లేటైనా కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తావ్..ఈ ఇంటర్యూలో కూడా సెలెక్ట్ అవుతాను, ప్రతిరోజూ నీముందే తిరుగుతాను, నాకు ఈ జాబ్ అవసరం లేదు..నువ్వు రోజూ కనిపిస్తానంటే శాలరీ తీసుకోకుండా పనిచేస్తాను. నాకు బెస్టాఫ్ లక్ చెప్పవా అంటుంది.


రిషి: ఇక్కడ నీకు పోస్టులున్నాయని ఎవరు చెప్పారో కానీ ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్ చెప్పమన్నావ్ కదా ..వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకు..


సాక్షి: నువ్వెంత దూరం వెళితే నేను అంత దగ్గరగా వస్తాను.. నువ్వు వద్దన్నా నీ మనసులోకి వచ్చేస్తాను అనుకుంటుంది. దేవయాని ఆంటీ ఇంటర్యూ ఐడియా ఇచ్చారు కానీ ఇది బెడిసికొట్టింది. అయినా తన ఐడియాల మీద నేనెందుకు ఆధారపడతాను..నేనేంటో నాకు క్లారిటీ ఉంది.


క్లాస్ రూమ్ లో: ఈ రోజు రిషి సార్ రాగానే టపాటపా పది డౌట్లు ఆడిగేస్తాను అనుకుంటూ మాట్లాడుకుంటుంది. ఏంటే ఇంత ఉత్సాహంగా ఉన్నావ్ అని పుష్ప అడిగితే ఏదేదో మాట్లాడుతుంది. అప్పుడే క్లాస్ లో ఎంట్రీ ఇస్తాడు రిషి. సార్ నాకో డౌట్ అన్న వసుధారతో ఇంకా క్లాస్ మొదలవలేదు అప్పుడే డౌటా అంటాడు. మీరు క్లాస్ అయ్యాక దొరకరు కదా అంటూ మీ కోపం ఎప్పుడు తగ్గుతుందంటూ ఏదేదో మాట్లాడుతుంది..ఇంతలో గుడ్ మార్నింగ్ మేడం అంటూ స్టూడెంట్స్ అంతా లేచి నిల్చుంటారు. రిషి సార్ రాలేదా జగతి మేడం వచ్చారు అనుకుంటుంది. 
ఏపిసోడ్ ముగిసింది


రేపటి ( శనివారం) ఎపిసోడ్ లో
రిషి కారు కీ కిందపడానే అప్పడే అక్కడకు వచ్చిన వసుధార తీద్దామని వంగుతుంది. రిషి కూడా చూసుకోకుండా ఇద్దరూ తల కొట్టుకుంటారు. సార్ ఒక్కసారి కొట్టుకుంటే కొమ్ములొస్తాయ్ అంటుంది. ఆల్రెడీ కొమ్ములున్నవాళ్లకి అని అడుగుతాడు రిషి. అయినా తగ్గకుండా మరోసారి ఢీ కొట్టి కారు కీ రిషి చేతిలో పెట్టి వెళ్లిపోతుంది.