గుప్పెడంతమనసు ఆగస్టు 22 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 22 Episode 535)
రిషి చేయించిన ఎంగేజ్మెంట్ రింగ్ కి దారం కట్టి మెడలో వేసుకుని ఫోటోలు దిగుతూ ఉంటుంది వసుధార. ఇంతలో అక్కడికి రిషి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. టెన్షన్ పడుతూ భయం భయంగా ఏంటి సార్ ఈ టైం లో వచ్చారు అంటుంది. ఏదో తప్పు చేసినట్టు మొహం ఎందుకు అలా పెడుతున్నావ్ అంటే ఏమీలేదంటుంది వసు. అప్పుడు రిషి అక్కడ ఓ పుస్తకం తీసుకుని ఇవన్నీ ముఖ్యమైన లెసన్స్ ఇవి ఈరోజు రాత్రికి చదివి రేపు ఉదయం కల్లా నాకు చెప్పు అంటాడు. అప్పుడు వసు చేయు పట్టుకున్న రిషి 10000 రూపాయలు ఇచ్చి నీకు డబ్బు అవసరం ఉంది అని మేనేజర్ చెప్పాడు. అది ఎందుకో నాకు అనవసరం కానీ భవిష్యత్తులో దేనికి డబ్బు అవసరమైన నన్నే అడగాలి అని చెబుతారు. ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు డబ్బు తిరిగి మేనేజర్ కి ఇచ్చేయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
మరుసటి రోజు ఉదయం రిషి కాఫీ తాగుతూ వసుధారకి ఫోన్ చేద్దామా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. ఆ సమయంలో వసు,రిషికి ఫోన్ చేయడంతో ఆ ఫోన్ గౌతమ్ లాక్కుని మాట్లాడుతాడు. అప్పుడు గౌతమ్ ఏంటి వసు కింద హాల్లో ఉన్నావా అనడంతో రిషి అక్కడికి వెళ్తాడు. వసుధారని చూసి ధరణి ప్రేమగా పలకరిస్తుంది...ధరణిపై కోప్పడి అక్కడినుంచి పంపించేస్తుంది దేవయాని.
దేవయాని: ఏంటి పొద్దున్నే దయ చేశావ్
వసు: రిషి సార్ ఆర్డర్ మేడం
దేవయాని: ఏదైనా ఉంటే కాలేజీలో చూసుకోండి
వసు: కదా మేడం..రిషి సార్ రాగానే మీరు అడగమన్నారని అడుగుతాను
దేవయాని: మీరు మీరూ మాట్లాడుకోండి మధ్యలో నన్నెందుకు లాగుతావ్
ఇంతలో రిషి వస్తాడు..నువ్వు రమ్మన్నావంట అని దేవయాని అడిగితే..మీరు వెళ్లండి పెద్దమ్మా నేను మాట్లాడతాను అని రిప్లై ఇస్తాడు..
రిషి: ఏంటిలా వచ్చావ్
వసు: మీరే చెప్పారు కదా.. ఉదయానికల్లా ఆ చాప్టర్ నేర్చుకుని చెప్పారు కదా..రాత్రంతా కూర్చుని చదువుకున్నాను.. అది నేర్చుకున్నాక మీకు చెప్పాలికదా అందుకే వచ్చాను
రిషి: కాసేపైతే కాలేజీలోనే కలుస్తాం కదా..ఆగొచ్చు కదా
వసు: ఆగొచ్చు సార్..ఆ లోపు టైమ్ వేస్ట్ ఎందుకని వచ్చేశాను
హాయ్ వసుధార అంటూ గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు...
రిషి: వసు ఇంపార్టెంట్ పనిపై వచ్చింది..మేం ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం..నువ్విక్కడ ఉండడం అవసరమా..
మీరిద్దరూ ఇంపార్టెంట్ పనిపై డిస్కస్ చేసుకుంటున్నారా అని బయటకు అని..వెళతానులే కానీ కానీ అని వెళ్లిపోతాడు
రిషి: కాలేజీలో కలుద్దాం నువ్వెళ్లు...
Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది
మరోవైపు జగతి-మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఇంతలో గౌతమ్ వచ్చి వసుధార వచ్చింది వెళ్లిందని చెబుతాడు. అదేంటి ఇంటికి వచ్చి నన్ను కలవకుండా వెళ్లడం ఏంటనే ఆలోచనలో పడుతుంది జగతి. మరోవైపు బయటకు వెళ్లిన వసుధార..నేను ఇంటికి వెళ్లడం రిషి సార్ కి నచ్చలేదా..అయినా రిషి సార్ ని కలిసేందుకు నాకు అనుమతులు అవసరమా అనుకుంటుంది. ఇంతలో జగతి కాల్ చేసి ఇంటికొచ్చి కలవలేదేంటని అడిగితే..నేను వచ్చాను మీ అబ్బాయి వెళ్లమన్నారని చెబుతుంది. ఏదైనా గొడవపడ్డారా అని అడిగితే..గొడవపడలేదు మేడం అని క్లారిటీ ఇస్తుంది. జగతి కాల్ కట్ చేసి కాలేజీవైపు వెళుతుంటుంది వసుధార..ఇంతలో సాక్షి అడ్డుపడుతుంది...
సాక్షి: హలో వసుధార..
వసు: నా క్షేమ సమాచారాలు అడిగినందుకు థ్యాంక్స్..నేను బావున్నాను
సాక్షి: రిషి చేయించిన ఉంగరం నీ చేతికి లేదేంటి..
వసు: బంగారం లాంటి ఉంగరం వద్దనుకున్నావ్..ఇక బంగారం గురించి ఎందుకులే
సాక్షి: రిషి ఆ ఉంగర గురించి నీ గురించి చాలా చెప్పాడుకదా..ఈ పాటికి నీవేలికి ఉంగరం తొడిగే ఉంటాడనుకుంటాను
వసు: ఇంత జరిగినా నీకు తత్వం బోధపడలేదు..ఈ ప్రేమ, ఆప్యాయత మనసులో ఉండాలికానీ..ఉంగరాలు తొడిగితే ఉన్నట్టా
సాక్షి: నీది చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప ప్రేమకథ అనుకుంటున్నావా..రిషితో ప్రేమ ప్రయాణం అంటే ఎప్పుడో అప్పుడు మునిగిపోతావ్
వసు: నా బాగోగులు గురించి ఆలోచించిటైమ్ వైస్ట్ చేసుకోవద్దు.. నీగురించి నువ్వు సొంతంగా ఆలోచించు.. చిల్లు పడిన బోటులో ప్రయాణం చేస్తే నీళ్లలో ఈదుకుంటూ బతికి బయటపడే అవకాశం ఉంటుంది ...రిషి సార్ గురించి మాట్లాడే అర్హత నీకు ఏ రోజూ లేదు..జాగ్రత్త..వీలైతే నీ పెళ్లికి నాకు ఫోన్లో శుభలేఖ పంపించు ..బాయ్..
Also Read: రిషి చేయించిన రింగ్ మెడలో వేసుకున్న వసు, మళ్లీ రంగంలోకి దిగిన దేవయాని-సాక్షి
రిషి కారుముందు నిల్చుని..రిషిలా భావించి గలగలా మాట్లాడేస్తుంది వసుధార. మీరు చెప్పారని చదువుకుని వస్తే వెళ్లమన్నారు.. మీరు చెబితే నేను వింటాను వినాలి మరి..నేనేదైనా చెబితే వినరు, అర్థం చేసుకోరు ఎలా మీతో.. బాలేదు అస్సలు బాలేదు..మీ పద్ధతే అస్సలు బాలేదని కారుతో మాట్లాడుతుంటుంది. మీరు జెంటిల్మెన్..నేనేంటి చెప్పండి.. మాట్లాడరేంటి రిషి సార్..మీరు జెంటిల్మెన్ అయితే నేనేంటి..నేను మీపై అలిగాను..అలిగితే అలక తీర్చాలి..మీకు అవన్నీ తెలియదు.మీరు.. నా ఎదురుగా కనిపిస్తే టపాటపా ప్రశ్నలు అడిగేస్తాను..నేను ఏం అడుగుతానో ఏం మాట్లాడుతానో నాకే తెలియదు అంటుంది..ఇవన్నీ కారుకి అటువైపు నిల్చున్న రిషి విని..వసు ఎదురుగా వస్తాడు...
ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( మంగళవారం) ఎపిసోడ్
వసు నిన్ను ప్రేమిస్తోంది కదా..మీరిద్దరూ ఇప్పుడు విడిపోతే ఎప్పటికీ కలవలేరు అంటాడు గౌతమ్. మరోవైపు రిషి సార్ ని నాకు దూరం చేయకు నా మనసులో మాట రిషి సార్ వినేలా చేయమ్మా అని దండం పెట్టుకుంటుంది వసుధార. వెనక్కు తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు