వసుధార రూమ్‌కి వెళ్లిన జగతి... ఏమైంది ఎందుకు రమ్మన్నావని అడుగుతుంది. లేదని చెప్తుంది వసుధార. ఇంతలో దేవయాని వచ్చి నేనే రమ్మన్నానని అంటుంది. ఏదో పూర్వ జన్మఫలమని చెప్పి జగతి ఇక్కడి వచ్చింది వసుధార ఎందుకు వచ్చిందని అడుగుతుంది. ఏ అర్హతతో వచ్చావని నిలదీస్తుంది. మధ్యలో మాట్లాడవద్దని హెచ్చరిస్తుంది. ఏదో వసుధారను మధ్యలో పెట్టుకొని రిషిని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నవని ఆరోపిస్తుంది దేవయాని. ఇల్లు నాది పెత్తనం నాది అంటు ఇక్కడ తనకు తెలియకుండా ఏం జరగడానికి లేదని అంటుంది. చాపకింద నీరులా రిషికి ఉచ్చు వేసి వలపు వలతో బందించాలని చూస్తున్నారని తీవ్రంగా మాట్లాడుతుంది. నేను బతికి ఉండగా మీ ఆటలు సాగవని అంటుంది దేవయాని.
ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరి పిలిస్తే వెళ్లిపోతారా అని దెప్పి పొడుస్తుంది దేవయాని. రిషి ఇంటికి రావడానికి బావను ఏర్పాటు చేసుకొని ఉంటారని బాంబు వస్తుంది. అది కూడా తనపై వేసేస్తారని అంటుంది దేవయాని. ఇదంతా జగతి బుర్రలో పుట్టిన ఆలోచన అని అభండాలు వేస్తుంది. సూటిపోటి మాటలతో ఇద్దర్నీ చిత్రవధ చేస్తుంది.
ఇంతలో మహేంద్ర రావడంతో దేవయాని వెళ్లిపోతుంది. ఏం జరిగిందని అడుగుతాడు మహేంద్ర. వసుధార మాట్లాడుతూ ఇక్కడ ఉండి అందర్నీ బాధ పెట్టడం కంటే నేనే బాధ పడతానంటుంది. వసుధార వెళ్లిపోతావా... నువ్వు వెళ్లిపోతే రిషి ఓడిపోతాడని అంటాడు మహేంద్ర. రిషి తీసుకొచ్చాడు.. వెళ్లమని హక్కు రిషికే ఉందని చెప్పి ఆమెను ఓదారుస్తాడు. ఈ ప్రశ్నలకు రిషి ఒక్కడే సమాధానం చెప్పగలడని మహేంద్ర అని వెళ్లిపోతాడు. జగతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తెల్లారేసరికి హాల్‌లో కూర్చొని ఉన్న దేవయానికి అప్పుడే తన ఆట మొదలు పెడుతుంది. ఇల్లు అన్నాదాన సత్రంలా మారిపోయిందని ఎవరెవరో వస్తున్నారని అంటుంది. ఇంతలో బ్యాగ్ పట్టుకొని వసుధార బయటకు వస్తుంది. అంతా ఆశ్చర్యపోతారు.. ఒక్క దేవయాని తప్ప.
నీకు నచ్చిన పనే చేస్తున్నాను మేడం అని వసుధార దేవయానితో అంటుంది. ఇక్కడ తప్ప ఎక్కడైనా ఉండగలనంటుంది. అప్పటికీ వద్దన్నా రిషి మాత్రమే బలవంతం చేశాడని అంటుంది. అర్హత ఏంటన్నది కరెక్టే కదా అనుకుుటుంది.
ఇంతలో రిషీ ఎంట్రీ ఇస్తాడు. వసుధార అని పిలుస్తాడు. ఎందుకు వెళ్లిపోతున్నావో చెప్పమని అడుగుతాడు రిషి. ఎందుకు ఉండాలో ఒక్క కారణం చెప్పమని అడుగుతుంది వసుధార. ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది.
రేపటి ఎపిసోడ్.
వసుధార వెళ్లిపోయిన తర్వాత కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.