సడెన్‌గా అర్థరాత్రి ఇంట్లోకి వచ్చిన రాజీవ్‌ను చూసి షాక్ అవుతుంది వసుధార. ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటూ చేయి పట్టుకొని లాగుతాడు. వద్దని వారిస్తుంది వసుధార. ఇద్దరం వెళ్లిపోదామంటాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరుగుతుంది. ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే రిషి అక్కడే ఉన్న రిషి అడ్డం పడతాడు.
రాజీవ్‌పై చేయి చేసుకొని వసుధార చేయి పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య కొట్లాడ జరుగుతుంది. వసుధార టెన్షన్ పడుతుంది. రిషిని వసుధార ఆపుతుంది. ఇంతలో తనతో తెచ్చుకున్న చాకుతో రిషిని గాయపరిచి పారిపోతాడు.
గాయమైన రిషికి కట్టుకుడుతుంది. కంగారుపడుతుంది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం తప్పైందని అంటారు రిషి. వెళ్లి లగేజ్ సర్దుకొని రమ్మని చెప్తాడు.
రిషి వాళ్ల ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. చాలా రాత్రి అయినా ఇంకా రాకపోవడంతో ఆందోళనలో ఉంటారు. దేవయాని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఫోన్‌లో ట్రై చేయడం కాదని... అది ఇక్కడ ఎవరికీ ప్రేమ లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంది. కొడుకు రాలేదని బాధ, బాధ్యత మహేంద్రకు లేదని అడ్డదిడ్డగా మాట్లాడుతుంది.
రిషితో కారులో వస్తున్న వసుధార ఏడుస్తుంటుంది. అది చూసి రిషి కారు పక్కన ఆపుతాడు. దిగమంటాడు. ఎందుకు ఏడుస్తున్నావంటాడు.. అప్పుడు రిషి చేతులు పట్టుకొని మళ్లీ ఏడుస్తుంది. ఇవాళ సమయానికి మీరు రాకుంటే ఏమయ్యేది అని ప్రశ్నిస్తుంది. అందరూ ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఉందని గుక్కపెట్టి ఏడుస్తుంది. ఇంతలో రిషి మాట్లాడుతూ.. నిన్ను రక్షించుకునే బాధ్యత నాకు ఉందని అంటాడు. వాడు ఎప్పుడైనా వస్తాడని రాత్రంతా కాపాలాగా ఉన్నానని చెప్తాడు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి, ఎలా ఉండాలి ఏం చేయాలి ఇలా అన్ని సమాధానాలు లేని ప్రశ్నలే నా లైఫ్‌లో ఉన్నాయి కదా అంటూ ఏడుస్తుంది వసుధార. కాసేపు ఆలోచించి నీ ప్రశ్నలకు సమాధానం నేనే అని చెప్తాడు. వసుధారకు అర్థం కాదు. అవును వసుధార.. నీ కష్టాలకు, నీ భవిష్యత్ లక్ష్యాల సాధనకు నేను అండగా ఉంటానని హామీ ఇస్తాడు. ఎందుకని మాత్రం ప్రశ్నించవద్దని మనసులో అనుకుంటాడు. ఏం అర్థంకాని పరిస్థితిలో వసుధార ఉంటుంది. కారు బయల్దేరుతుంది.
కారు రిషి ఇంటికి వస్తుంది. మీ ఇంటికి తీసుకొచ్చారేంటని కంగారుపడుతుంది వసుధార. ఏమీ అడక్కని చెప్తాడు. వద్దని వారిస్తుంది. పుష్ప వాళ్ల ఇంటికి వెళ్తాను అంటుంది. ఇంట్లో వాళ్లు అడిగితే ఏమని చెప్తారని ప్రశ్నిస్తుంది. ఏ బంధం అంటే ఏమంటారని అడుగుతుంది. నీవు ఉన్న పరిస్థితికి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తాడు. నన్ను నమ్మగలిగితే దిగమని చెప్తాడు. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్తారు .
రిషి, వసుధారను చూసి దేవయానికి షాక్ అవుతుంది. మిగతవాళ్లదీ అదే పరిస్థితి. రాజీవ్ ఈసారి కూడా మిస్ చేశాడా అని మనసులో అనుకుంటుంది దేవయాని. ఏంటిది.. ఈ టైంలో వసుధార మన ఇంటికి రావడం ఏంటని ప్రశ్నిస్తుంది. తనకో కష్టం వచ్చిందని చెప్తాడు రిషి. కష్టాలు అందరికీ వస్తాయి రిషి... కష్టాల్లో ఉన్న వారందరూ మన ఇంటికి రారు కదా అని అంటుంది. తను నా స్టూడెంట్ అంటాడు రిషి. అలా అందర్నీ తీసుకొస్తే హాస్టల్ అంటారేమో అంటుంది దేవయాని. ఎవరూ మాట్లాడరేమని అడుగుతుంది దేవయాని. సమాధానం చెప్పమని మహేంద్ర కూడా అడుగుతాడు. ఆమెను తీసుకురావడానికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నిస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది...
రేపటి ఎపిసోడ్...
వంటగదిలో వసుధార, రిషి వంట చేస్తుంటారు. కాఫీ చేసి రిషి ఇస్తాడు. ఇంతలో అది చూసిన దేవయాని... వసుధార పిలిచిందని జగతికి కాల్ చేస్తుంది. వసుధార, జగతి ఒకద్దరకి చేరేసరికి దేవయానికి కూడా వచ్చి నేనే కావాలనే రమ్మని చెప్పానంటోంది...