వసుధార గురించి గౌతమ్ మాట్లాడితే నాకెందుకు కోపం వస్తుందని ఆలోచిస్తున్నాడు. వసుధార నాకెందుకు ఇంత డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటాడు రిషి. వసుధార ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేసుకొని రెస్టారెంట్‌కు వస్తుంటాడు.
వసుధార ఇంటికెళ్లే సరికి రాజివ్ షాక్ ఇస్తాడు. ఆమెకు తెలియకుండానే ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. నువ్విక్కడేంటీ అని అడుగుతుంది వసుధార. రాజీవ్ తీరుపై వసుధారకు అనుమానం వస్తుంది. దానికి ఏదో వేదాంతం చెప్తాడు రాజీవ్. అప్పుడే రిషి ఫోన్ చేస్తాడు. రాజివ్ ముందు మాట్లాడలేనని కట్ చేస్తుంది. మళ్లీ చేస్తాడు... మళ్లీ చేస్తానని చెప్తుంది వసుధార. ఇంతలో రాజీవ్ గొంతు వింటాడు రిషి. ఎక్కడో విన్నట్టు ఉందని అనుకుంటాడు. మళ్లీ ఇక్కడకు రావద్దని రాజీవ్ కూడా వసుధార గట్టిగానే చెప్తుంది. వెళ్తుండగానే తలుపు వేసేస్తుంది. నిన్ను ఎలాగైనా వదలను అనుకొని రాజీవ్ వెళ్లిపోతాడు.
రిషి డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కు వస్తాడు. వసుధార ఇంకా రాలేదని అనుకుంటాడు. గదికి వెళ్దామంటే ఎవరో వచ్చి ఉన్నారంటాడు. ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది. సార్ మీరు ఎప్పుడు వచ్చారని అడుగుతుంది. ఫోన్ ఎందుకు కట్ చేశావని అడుగుతాడు. తర్వాత చెప్తాను అంటుంది. ఇంతలో రాజీవ్ పిలిచి ఆర్డర్ తీసుకోమని చెప్తుంది. రిషిని విష్ చేస్తాడు. అప్పుడు రిషికి సీన్ అర్థమవుతుంది.
ఎప్పుడూ మీ రిషీ సేవలోనే తరిస్తావా... నాకు సేవలు చేయవా అని అడుగుతాడు. కోపంతో రగిలిపోతుంది వసుధార. రూమ్‌కి వచ్చి ఏమైనా గొడవ చేశాడా అని రిషి అడుగుతాడు. లేదని చెప్తుంది వసుధార.
నువ్వు రిషి ప్రాపర్టీ కావని అంటూ కామెంట్ చేస్తాడు రాజీవ్. రిషి కోపంతో లేచి ఏంట్రా అని మీదికి వెళ్లబోతాడు. వసుధార సహా రెస్టారెంట్ మేనేజర్ అడ్డుకుంటారు. ఇంతలో రాజివ్ రెండు సెంటిమెంట్ డైలాగ్స్‌తో వసుధారను బుట్టలో పడేయాలని చూస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి కూడా కోపంతో వెళ్లిపోతాడు.
కారులో వెళ్తున్న రాజీవ్ వసుధార గురించి ఆలోచిస్తాడు. రిషి అడ్డంకిలా మారడని అనుకుంటాడు. అప్పుడే రిషి వెనుకాలే ఫాలో అవుతున్న సంగతి గమనిస్తాడు. కారును వేగంగా పోనిచ్చి తప్పించుకుంటాడు.
రాజీవ్‌ను చూసిన రిషి నిజంగా వెళ్తున్నాడా.. లేకా యాక్ట్ చేస్తున్నాడా అని ఫాలో చేయాల్సి వస్తుంది అనుకుంటాడు. రాజీవ్ వెళ్లిపోయాడని అనుకొని కారు దిగి వసుధారకు ఫోన్ చేస్తాడు. నువ్వేమీ భయపడకు..వాడు వెళ్లిపోయాడని చెప్తాడు. జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వసు థాంక్స్ చెప్తుంది.
ఇంతలో రిషి రావడం లేట్ అయిందని మహేంద్ర, జగతి కంగారు పడతారు. ఫోన్ చేయమని అడుగుతుంది జగతి. మహేంద్ర ఫోన్ చేస్తాడు. వస్తున్నానని చెప్పి పడుకోమంటాడు. రిషిని ఎలా అర్థం చేసుకోవాలా తెలియడం లేదని మహేంద్ర అంటాడు. రిషిని ఇబ్బంది పెట్టొద్దని రిక్వస్ట్ చేస్తుంది జగతి.
వసుధారకు ఏదో భయంతో నిద్ర పట్టదు. లేచి నీళ్లు తాగుతుంది. ఇంతలో కిటికిలో ఏదో నీడ కనిపిస్తుంది. కంగారు పడుతుంది. రిషికి ఫోన్ చేస్తుంది. రెస్టారెంట్ వద్దే ఉన్నప్పటికీ రిషి ఫోన్ కారులోపల ఉంటుంది లిఫ్ట్ చేయడు. బయట ఉన్న రాజివ్ లోపలికి వచ్చేస్తాడు.
రేపటి ఎపిసోడ్
వసుధారను రక్షిస్తాడు రిషి. వసుధార అన్ని ప్రశ్నలకు తానే సమాధానం అని చెప్తాడు. నువ్వు ఒంటరిదాని కాదని అంటాడు. ఇంతలో రాజివ్ రిషిపై ఎటాక్ చేస్తాడు. రిషికి గాయమవుతుంది.