అమాయకుడిని చేసి రిషిని ఆడిస్తున్నారని దేవయాని ఎత్తి పొడుస్తుంది. అక్కడే దేవయాని, జగతి, మహేంద్ర మధ్య చిన్న సైజ్ ఫైట్ నడుస్తుంది. ధరణితో మాట్లాడిన జగతి.. అక్కయ్య బీపీ లెవల్స్‌ డిస్టర్బ్‌ అయ్యాయని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. దానికి మహేంద్ర కూడా వంతపాడుతాడు. వదిన ఆరోగ్యాన్ని జాగ్రత్త అంటూ వెళ్లిపోతాడు. పొద్దుపోయింది త్వరగా పడుకోండని చెప్పి గుడ్‌నైట్‌ చెప్పి జగతి వెళ్లిపోతుంది. అలా ఇద్దరూ వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఏంటీ ధరణీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ చెప్పి పంపిస్తుంది. 


అప్పుడు దేవయానికి ఓ వసుధార బావకు ఫోన్ చేస్తుంది.  నీకేమైనా డబ్బులు అసరమా అని అడుగుతుంది. అతను నవ్వుతాడు. గతంలో నీకో పని చెప్తే సగం సగం చేసి వెళ్లిపోయావని గుర్తు చేస్తుంది. ఈసారి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు అంటుంది దేవయానికి. అప్పుడు నా టైం బ్యాడ్ అని... ఇప్పుడు రాజీవ్ టైం నడుస్తుందని ఏ పని అయినా అయిపోతుందని కోతల కోస్తాడు. ఏం చేయాలో చెప్పమంటాడు. నాకు అవసరం లేనిదీ... నీకు అవసరమైంది అని... ఆ మనిషి నా కంటికి కనిపించకూడదని చెబుతుంది. నాకు కావాల్సిందెవరో నాకు తెలుసు అంటాడు రాజివ్‌. నేను మళ్లీ తిరిగి వచ్చిందే అంటాడు. అడ్వాన్స్‌ కొడితే పని స్టార్ట్ చేస్తానంటాడు. 


వసుధారా నన్నే ఎదిరిస్తావా.. రిషి వెంట తిరుగుతావా.. నువ్వు రిషి చుట్టూ తిరుగుతున్నావ్‌.. జగతి నన్ను ఇబ్బంది పెడుతుంది... దీంతో నీ చాప్టర్ క్లోజ్ అంటూ వార్నింగ్ ఇస్తుంది. 


సీన్ వసుధార రూమ్‌కి షిప్టు అవుతుంది. అప్పటికే పడుకొని ఉంటుంది. ఉదయాన్ని రిషి మెసేజ్‌లు చూసి టెన్షన్ పడుతుంది. స్పెషల్ ట్యూషన్‌కు వెళ్లాలి కదా రెడీ అయ్యావా అంటాడు. రెడీ అవుతున్నాను అంటుంది. రిషిని ఉదయాన్నే వెళ్లడాన్ని చూసి దేవయాన్ని అనుమానం పడుతుంది. ఎప్పుడూ కోపంగా ఉండే రిషిలో మార్పు వచ్చిందని అనుకుంటుంది. రిషిని అడిగితే చిన్న పని ఉందని బయటకు వెళ్తున్నాను అంటాడు. 


ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర దేవయానికి గుడ్‌మార్నింగ్ చెప్తాడు. ఈ వయసులో ఆరోగ్యం సరిగా చూసుకోవాలని హితబోధ చేస్తాడు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఇప్పుడు గెలిచావని పొంగిపోతున్నావు కానీ మిమ్మల్ని ఎలా ఓడించాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. 



హడావుడిగా ట్యూషన్‌కు బయల్దేరుతుంది. లేట్ అయిందనుకుంటుంది. ఇంతలో రిషిని చూసి షాక్‌, ఆనందం, అన్నీ కలిపిన ఎక్స్‌ప్రెషన్ పెడుతుంది. వెళ్దామా అని రిషి అడుగుతాడు. కారులో ఎక్కుతూ మీరు ఇక్కడికి వస్తారని అసలు అనుకోలేదు అంటుంది వసుధార. ఆ టెన్షన్‌లో గుడ్‌మార్నింగ్‌ చెప్పలేదని వివరణ ఇస్తుంది. ఇలాంటివి మానేసి స్కాలర్‌షిప్‌ టెస్టుపై దృష్టి పెట్టమంటాడు. 


వసుధార, రిషిని వెనుకాలే ఉన్న వసుధార బావ రాజీవ్‌ చూస్తాడు. వసుధారను రక్షించుకోవాలంటే జాగ్రత్త పడాలి అనుకుంటాడు. అమాయకంగా ఉన్న వసుధార ఇప్పుడు అంతుచిక్కని వసుధారా మారిందని అంటాడు. నాకు నీపై ఉన్న ఆశ, ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటాడు. అందుకే తొందరపడక తప్పదని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో దేవయానికి ఫోన్ చేస్తాడు. తొందర్లోనే పని పూర్తి అవుతుందని చెప్తాడు. తొందరగా పని పూర్తి కావాలని వారిస్తుంది. మేడంకు ఓపిక తక్కువగా ఉంది.. తక్కువ మాట్లాడుతుందని అనుకుంటాడు. 


నేను సముద్రం లాటిందన్ని అయితే నువ్వు అక్వేరియం లాటిందనివి వసుధారా పోలుస్తుంది దేవయాని. నాకు నీవు నీతులు చెప్తావా... నా ముందు నీకన్నా తెలివైన జగతే తట్టుకోలేకపోయింది. ఈసారి నిన్ను ఆ జగతి కాపడలేదు... మహేంద్ర కాపాడలేడు.. ఆఖరికి రిషి కూడా కాపాడలేడు అంటుంది. 


ఇంతలో రిషి, వసుధార రావడం చూస్తుంది దేవయాని. షాక్ అవుతుంది. రిషి పొద్దుపొద్దున్నే ఇంటి నుంచి వెళ్లి చేసింది ఇదా అంటుంది. ధరణీ, జగతి పుస్తకాలు రెడీ చేస్తుంటారు. రిషి ఈ బుక్స్ ఇవ్వమన్నాడు అంటూ చెప్తుంది ధరణి. ఏం జరుగుతుందని అడుగుతుంది. వసుధార గురించి రిషి చాలా శ్రద్ద తీసుకుంటుంది. ఇవాల్టి నుంచి రోజూ ఇంటికి వస్తుంది. స్కాలర్‌షిప్‌ టెస్టు అయ్యే వరకు కోచింగ్ ఇవ్వాలని చెప్పాడు. ఇద్దరూ రిషి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు కాసేపు. 


ఇవన్నీ వసుధారకు వస్తాయి కదా... ఇంటికి పిలిపించి నేను చెప్పడం ఎందుకూ అని అనుకుంటుంది జగతి.



ఇంతలో సీన్‌ బాల్కనీలోకి షిప్టు అవుతుంది. అక్కడ బోర్డు పుస్తకాలు అన్నీ ఉంటాయి. అక్కడకు వచ్చిన వసుధార, రిషి మాట్లాడుకుంటారు. ఎలాగైనా హార్డ్‌ వర్క్‌ చేసి టెస్టులో మంచి ర్యాంక్‌ తెచ్చుకోవాలి అంటాడు రిషి. జగతి కూడా అదే చెప్తాడు. ఎలాంటి డిస్టబెన్స్ ఉండదని ఏకాగ్రతతో ఉండాలని చెప్తాడు. వసుధార టెన్షన్ పడుతుంది.. ఇది మన ఇద్దరి టెస్ట్ అని సర్ధి చెబుతుంది జగతి.


వసుధారకు జ్యూస్ తీసుకెళ్తున్న ధరణిని ఆపుతుంది దేవయాని. వసుధార ఎందుకు వచ్చిందని అడుగుతుంది. అప్పుడే వచ్చిన రిషి.. వసుధారను జాగ్రత్తగా చూసుకోమని దేవయానికి చెప్తాడు. అప్పుడు ఏమనాలో అర్థం కాక కన్ఫ్యూజ్‌లో పడుతుంది. 


జగతి, మహేంద్ర చేస్తున్న పన్నాగం రిషికి తెలియడం లేదని.. ఎలాగైనా వీళ్ల ఆటలు సాగనివ్వకూడదని అనుకుంటుంది. 


రేపటి ఎపిసోడ్‌


అక్కడి స్టూడెంట్స్‌ వసుధార, రిషి కోసం వల్గర్గా మాట్లాడుకుంటారు.. అది వసుధార వింటుంది. బాధపడుతుంది. వీళ్లందరూ ఇలా మాట్లాడుతున్నారేంటని అనుకుంటుంది. ఇంతలో రిషీ ఫోన్ చేసి వస్తానంటాడు.. వద్దని చెబుతుంది.  అప్పుడే రాజీవ్‌ కూడా వస్తాడు. హలో చెప్తాడు. అంతే షాక్ అవుతుంది.