Guppedanta Manasu Serial Today Episode: దేవయాని, శైలేంద్ర ఇద్దరూ కలిసి అనుపమ, మనుల గురించి అలోచిస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య గొడవ మను తండ్రి గురించి ఉండొచ్చని దేవయాని అంటుంది. ఎంటి మమ్మీ మొత్తం తెలిసినట్లే, స్టడీ చేసినట్లే చెబుతున్నావు అంటూ శైలేంద్ర అనగానే కొన్ని విషయాల్లో స్టడీ చేయాల్సిన అవసరం లేదు నాన్నా అంటుంది దేవయాని. ఆ మనుగాడు చిన్నప్పటి నుంచి తండ్రి విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. అదే వాళ్లిద్దరి మధ్య గొడవలకు దారి తీసి ఉండొచ్చు అని దేవయాని చెప్తుంది. దీంతో ఆ మనుగాడిని ఎలా ఆడుకుంటానో చూడు. వీలు చేసుకుని మరీ వాడి దగ్గర వాళ్ల నాన్న విషయం తీసుకొస్తాను. వాన్ని వదిలిపెట్టను అంటాడు. మరోవైపు ఎంజేల్ అనుపమను రూంలోకి తీసుకొస్తుంది.
ఎంజేల్: ఎమైనా కావాలా అత్తయ్యా? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా?
అనుపమ: ఎందుకు?
ఎంజేల్: అదే మీ కొడుకుతో కలిసి భోజనం చేశారు కదా? మీరు పైకి కోపంగా చూసినా మనసులో మాత్రం సంతోషంగా ఉంటుందని మాకు తెలుసు. మీతో పాటు మా బావతో కలిసి భోజనం చేసినందుకు నాక్కూడా సంతోషంగా ఉంది అత్తయ్యా.
వసు: మేడం చిన్న రిక్వెస్ట్ మీరు ఒప్పుకుంటానంటే అడుగుతాను మేడం.
అను: ఈ మద్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అనుకున్నవి అనుకున్నట్లు చేసేస్తున్నారు కదా? నా ఇష్టాఇష్టాలతో నా అంగీకారంతో పనిలేదు కదా
వసు: మను గారిని మళ్లీ కాలేజీకి పిలిపించడం కరెక్టు మేడం.
అను: ఏం ఇప్పుడు తను కాలేజీకి రాకపోతే ఏమౌతుంది. ఇంతకు ముందు తను లేకుండా మీరంతా కాలేజీ నడిపారు కదా?
వసు: అవును మేడం నడిపాం కానీ కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు తనే కాలేజీ మన చేజారిపోకుండా కాపాడారు.
అను: తను కాలేజీలో మళ్లీ వర్క్ చేయడానికి అయిష్టంగానే ఉన్నట్టున్నాడు కదా? అయినా ఎం చేసుకుంటారో మీ ఇష్టం
వసు: మేం అడిగితే మను గారు రానన్నారు మేడం.
అను: రాను అన్నప్పుడు బతిమాలడం ఎందుకు?
వసు: బతిమాలడం కాదు మేడం మీరు కాలేజీకి రమ్మని చెబితే వస్తాడేమో?
అనగానే అనుపమ ఆలోచిస్తూ ఉటుంది. మరోవైపు శైలేంద్ర కాలేజీలో మను రాడని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మను వస్తాడు. వీడేంటి రాడనుకుంటే వచ్చాడు వీడు కూడా మానం మర్యాద వదిలేశాడా ఏంటి అని మనసులో అనుకుంటుంటాడు.
మను: ఎంటి షాకై చూస్తున్నావు కాలేజీకి రాననుకున్నావా? నువ్వేదో మనసులో అనుకుని ఉంటావు కదా? నాకు చీము నెత్తురు అన్నీ ఉన్నాయి. తప్పులు చేసే గుణమే లేదు.
శైలేంద్ర: అవునా? అయినా మంచి క్వాలిటీయే కదా బ్రదర్. అయినా నేను మనసులో అనుకుంటుంది భలే కనిపెట్టేశావు?
మను: నువ్వు ఇంతకన్నా బెటర్‌గా ఆలోచిస్తావని నేనెలా అనుకుంటా? మొన్న జరిగిన ఇష్యూకి వీడు రాడు అనుకున్నావేమో.. కానీ ఏ చిన్న ఇష్యూ జరిగినా నేను ఊరుకోను పుచ్చ లేచిపోద్ది జాగ్రత్త.
అంటూ మను వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. శైలైంద్ర కోపంగా మనును చూస్తూ ఒరేయ్ మను నువ్వు నా మనసులో ఉన్నది కనిపెట్టావు కానీ నా అసలు ఉద్దేశ్యం కనిపెట్టలేవు అని మనసులో అనుకుంటాడు. మరోవైపు కాలేజీలో ఉన్న వసుధార మను గురించి ఆలోచిస్తుంది. తాను వస్తాడో రాడోనని అనుకుంటుండగానే అటెండర్ వచ్చి ఫైల్ ఇచ్చి మీరు సైన్ చేశాక మను సార్ సైన్ చేస్తానన్నారు అని చెప్పగానే వసు హ్యాపీగా ఫీలవుతుంది. ఇదే విషయం అనుపమకు చెప్పి థాంక్స్ చెప్తుంది వసుధార. తర్వాత వసు, మను దగ్గరకు వెళ్లి థాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ:టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్