Guppedanta Manasu Serial Today Episode: మహేంద్ర, మను, ఎంజేల్, అనుపమ నలుగురు కలిసి భోజనం చేస్తుంటారు. ఫణీంద్ర ఇంటికి వెళ్లి వచ్చిన మహేంద్రను అక్కడ జరిగిన విషయాలు మను అడిగి తెలుసుకుంటాడు. ఇంతలో అనుపమకు ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తారు. నీ కొడుకు తండ్రి ఎవరో నాకు తెలుసని ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఉండాలంటే నువ్వు నీ కొడుకు ఈ సిటీ వదిలేసి వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇస్తాడు. దీంతో అనుపమ భయంతో ఫోన్ కట్ చేస్తుంది. మహేంద్ర ఎవరని అడగ్గానే ఏదో రాంగ్ నంబర్ అని చెప్తుంది. మరోవైపు రంగ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. వసుధార భోజనం చేయలేదని తెలిసి పిలుస్తాడు.
సరోజ: తర్వాత తింటుందిలే బావ వదిలేసేయ్.
రంగ: తర్వాత తినటం ఏంటి సరోజ.. అసలు ఎందుకు తినడం లేదో తెలుసుకోవాలి కదా?
సరోజ: తనకు ఆకలేస్తే తనే వస్తుంది కదా తన ఆకలి తనకు తెలియదా? ఏంటి? అయినా ఒక్కపూట తినకపోతే ఏం చచ్చిపోదులే
రంగ: ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు..
అంటూ వసుధారను పిలుస్తాడు. వసుధార వచ్చి తనకు ఆకలి లేదని చెప్పడంతో రాధమ్మ, రంగ కొంచెం తినమని రిక్వెస్ట్ చేస్తారు. సరోజ మాత్రం నేను తినలేదంటే పట్టించుకోలేదు. ఇది ఎలా తింటుందో చూస్తానని వసుధార ప్లేట్ లో నీళ్లు పోస్తుంది సరోజ. దీంతో కోపంగా రంగ, సరోజను తిడతాడు. వసుధార భోజనం చేయనని లేచి వెళ్లిపోతుంది. రంగ భోజనం తీసుకుని వసుధార దగ్గరకు వెళ్తాడు. తినమని రిక్వెస్ట్ చేస్తాడు. తాను తిననని మీరో నాతో రావాలని అడుగుతుంది.
రంగ: ఎక్కడికి రావాలి?
ALSO: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!
వసుధార: మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి సర్.
రంగ: నన్ను నాకు పరిచయం చేయడం ఏంటి మేడం గారు.
వసుధార: ఇక్కడున్న వాళ్లందరూ మిమ్మల్ని రంగ అంటున్నారు. నేనేమో మీరే నా రిషి సార్ అంటున్నాను. కానీ ఎవ్వరూ నా మాట నమ్మడం లేదు. నేనేమో భ్రమ పడుతున్నాను అంటున్నారు. మీరు ఇప్పుడు నాతో పాటు మన ఇంటికి రండి సార్ అక్కడ మీ డాడీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన్ని మీరు చూశాక అప్పుడు నిజం బయటపడుతుంది.
రంగ: మేడం గారు మనిషిని పోలిన మనిషి ఉంటారు కదా? ఎందుకు ఈ విషయం అర్థం చేసుకోవడం లేదు.
వసుధార: మనిషిని పోలిన మనిషి ఉంటారేమో కానీ రిషి సర్ ని పోలిన రిషి సర్ ఉండరు కదా? సర్ మీ ప్రతి కదలిక నాకు తెలుసు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రాణం లాంటి కాలేజీ కష్టాల్లో ఉందన్నా కూడా మీ మనసు కరగడం లేదు. అయినా మీకెందుకు సార్ ఇంత పంతం.
రంగ: పొగరు అసలు తగ్గదు కదా?
వసుధార: అవును సార్ నాకు పొగరే.. రిషి సార్ విషయంలో నేను అసలు తగ్గను ఇప్పుడేమంటారు.
అనగానే రంగ సరే నేను మీతో పాటు వస్తాను. రంగా లాగే నేను మీతో పాటు వచ్చి మిమ్మల్ని అక్కడ దిగబెడతాను అనగానే వసుధార హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత రంగ, వసుధార గురించి ఆలోచిస్తుంటే సరోజ వస్తుంది. తనేదో ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. తను నిన్ను మళ్లీ రిషి సార్ అంటుందా? అనగానే లేదని తను వాళ్ల ఇంటికి వెళ్తానంటుంది అని రంగ చెప్పగానే సరోజ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు అనుపమకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మను తండ్రి మహేంద్ర అని నాకు తెలుసు? నువ్వు నీ కొడుకు ఈ సిటీ వదిలి వెళ్లకపోతే ఈ నిజం అందరికీ చెప్తాను అనడంతో అనుపమ భయపడుతుంది. మరోవైపు సరోజ, వసుధార దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ చెప్తుంది. దీంతో సర్‌ని అక్కడికి తీసుకెళ్లి రిషి సార్ అని ఫ్రూవ్ చేయడానికే తీసుకెళ్తున్నాను అంటూ చెప్పగానే సరోజ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత వసుధార రాధమ్మ దగ్గరకు వెళ్లి మీరు మీ మనవడి విషయంలో ఏదైనా దాస్తున్నారా? అని అడగ్గానే రాధమ్మ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.