Guppedanta Manasu  Serial Today Episode:  ఇలాంటి పరిస్థితుల్లో కూడా వసుధార తనకు నిజం  చెప్పడం లేదని మను కోపంతో రగిలిపోతుంటాడు. అయితే  శైలేంద్రను కలిసి నిజం తెలుసుకున్నారని నాకు తెలుసు.. అందుకే మీరు మహేంద్ర సార్‌ మీద అటాక్‌ చేయించారు అంటుంది వసుధార. దానికి  ఈ అటాక్‌ కు సంబంధ ఏంటని మను అడిగితే ఇన్నాళ్లు తండ్రిపై కోపం పెంచుకున్నారు. ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసాక చంపేయాలని చూశారు అంటుంది.


మను: మహేంద్ర సార్‌ నా నిజమైన తండ్రి కాదు కదా?


వసుధార: లేదు మహేంద్ర సారే మీ నిజమైన తండ్రి. ఈ విషయం నీకు తెలుసని నాకు తెలుసు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి ఎవరని అనుపమ మేడం మిమ్మల్ని పెంచిన తల్లి మాత్రమే.


మను: లేదు.. నా కన్నతల్లి అనుపమ మేడమే.. నాకు తెలుసు కదా?


వసు: నీ కన్నతల్లి ఎవరనేది కూడా అనుపమ మేడంకు తెలుసు. ముందు మా మావయ్యపై దాడులు చేయడం ఆపేసి మీ అమ్మ ఎవరో తెలుసుకోండి.


 అని వసు చెప్పగానే అది తర్వాత కానీ మహేంద్ర సార్‌ మీద నేను అటాక్‌ చేయలేదు. మీరు చెప్పేవరకు నాకు ఆ విషయమే తెలియదు అని మను వెళ్లిపోతాడు. దీంతో వసుధార మరి ఎవరు చేశారని ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు దేవయాని, శైలేంద్రను తిడుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో మహేంద్రపై ఎందుకు అటాక్‌ చేయించావని నిలదీస్తుంది. నువ్వు ఇలా చెత్త ప్లాన్స్ వేయడం వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయని ఏదైనా చేసేటప్పుడు నాకు చెప్పి చేయమని చెప్పాను కదా అని తిడుతుంది దేవయాని.  ఇంతలో ఫణీంద్ర రావడం చూసి ఇద్దరు మౌనంగా ఉండిపోతారు.


దేవయాని: ఏవండి మహేంద్రపై అటాక్‌ జరగడం ఏంటి?


ఫణీంద్ర: అవును దేవయాని నాకు అర్థం కావడం లేదు. మాకెందుకు శత్రువులు ఉన్నారో తెలియట్లేదు. నా తమ్ముడికి ఏమైనా జరిగితే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేదు. అటాక్  చేయించినవాడిని రిషి కచ్చితంగా పట్టుకుంటాడు. ఇక వాడికి చివరి రోజులే.


ధరణి: మీరెందుకు భయపడుతున్నారు. ఇంత కూల్‌ వెదర్‌లో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి.


శైలేంద్ర: బాబాయ్‌పై అటాక్ జరగడం చూశా కదా. అందుకే చెమటలు పడుతున్నాయి.


 అంటూ శైలేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు వసుధార మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు మను. అనుపమను నువ్వు నా కన్నతల్లివేనా అని ప్రశ్నిస్తాడు. దీంతో అనుపమ షాక్‌ అవుతుంది. ఇంకా నన్ను జీవితాతం బాధపెట్టాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే. నేను వినాల్సిందే అని మను పట్టుబడతాడు. మరోవైపు వసుధార ఇంటికి రావడంతో అటాక్‌ చేసింది ఎవరో తెలుసుకున్నావా? వసుధార అని రిషి అడుగుతాడు. దీంతో నేను మనును తప్పుగా అర్థం చేసుకున్నానని వసుధార చెప్పగానే ఆ అటాక్‌ చేయించింది శైలేంద్ర అని రిషి చెప్తాడు.  వసుధార షాక్ అవుతుంది. మీకెలా తెలుసని అడుగుతుంది. నాకు తెలుసు.. నేను అన్ని గమనిస్తున్నాను కాబట్టే డాడీని కాపాడుకోగలిగాను అంటాడు రిషి. ఇంతలో రాధమ్మ, సరోజ వస్తారు.  రిషి, వసుధార షాక్‌ అవుతారు.


రాధమ్మ: నాన్నా రంగ ఎలా ఉన్నావు. నాకు చెప్పకుండా ఇలా ఎందుక వచ్చావు నాన్నా.. ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు ప్రశాంతంగా ఉంది నాన్నా..


సరోజ: నేను ఎంత చెప్పిన అమ్మమ్మ వినలేదు బావ.. అందుకే నీ అడ్రస్ తెలుసుకుని వచ్చాము.


రాధమ్మ: మన ఇంటికి మనం పోదాం రా రంగా


మహేంద్ర: రంగా ఎవరు


రాధమ్మ: ఇతనే మా రంగా


మహేంద్ర: మీ మనవడు ఏంటీ. రంగా ఏంటీ? మీరు పొరపాటు పడుతున్నారు. తను రిషి. నా కొడుకు


 అని మహేంద్ర చెప్తుంటే రిషి డాడ్‌ మీరు ఆగండి అంటూ తాను రంగా కాదని రిషినే అని రాధమ్మకు చెప్తాడు. నేను మీ మనవడిని కాదు. వసుధార భర్త రిషిని అంటాడు. రాధమ్మ, సరోజ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.