Guppedanta Manasu  Serial Today Episode: అనుపమ నిద్రలోంచి మహేంద్ర అంటూ ఉలిక్కిపడి లేస్తుంది. ఆ అరుపులకు  వసుధార వస్తుంది. ఏమైంది మేడం అని అడుగుతుంది. మను, మహేంద్రను చంపినట్టు పీడకల వచ్చిందని చెప్తుంది. దీంతో వసుధార షాక్‌ అవుతుంది. మను తండ్రి మహేంద్ర అన్న నిజం నువ్వు మనుకు చెప్పినట్టు.. మను కోపంతో మహేంద్రను చంపినట్లు కల వచ్చిందని నువ్వు ఎప్పటికీ మనుకు నిజం చెప్పొద్దని అనుపమ అంటుంది. దీంతో సరే మేడం నేను ఎప్పటికీ చెప్పను. కానీ మీరు ముందు ఒక పని చేయాలని అడుగుతుంది. మరోవైపు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న మనుకు ఆనౌన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది. మీ నాన్న గురించి నాకు తెలుసు అని చెప్తాడు. నేను చెప్పిన ప్లేస్‌కు మీరు వస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పగానే ఇప్పుడే వస్తున్నా అని మను వెళ్తాడు. రాజీవ్‌ మహేంద్ర మాస్క్‌ వేసుకుని వస్తాడు.


రాజీవ్‌: చూడు ఇతను మీ నాన్న.. ఏంటి ఆశ్యర్చపోతున్నావా? అంటే తొందరలో నిన్ను దత్తత తీసుకోబోతున్నాడు కదా.. దత్తత తీసుకుంటే ఇతనే మీ నాన్న అయిపోతాడు కదా.. ఏమంటావు నేను చెప్పింది కరెక్టా కాదా?


అంటూ మాస్క్‌ తీస్తాడు. రాజీవ్‌..


 మను: ఒరేయ్‌ రాజీవ్‌ నువ్వు నాకు ఫోన్‌ చేసినప్పుడే డౌట్‌ వచ్చిందిరా.. మా నాన్న ఎవరో తెలుసు అని గొంతు మార్చినప్పుడే డౌట్‌ వచ్చిందిరా.. కానీ మా నాన్న ఎవరో తెలుసుకుందామనే వచ్చాను. నా ఎమోషన్‌తో ఆడుకుంటావా? నువ్వు..


రాజీవ్‌: మరి నా ఎమోషన్‌తో ఎన్ని సార్లు ఆడుకున్నావురా నువ్వు. ఏంటి అర్థం కాలేదా? వసు విషయంలో ఎన్నిసార్లు నా గుండె ముక్కలు చేశావు. ఎన్ని సార్లు నా మనసును గాయపరిచావు. అసలు వసు అంటే ఎవరు అనుకున్నావురా? నా హార్ట్‌ నా లవ్వు.. అలాంటి వసును నాకు దక్కకుండా చేస్తున్నావు.


మను: చీచీ ఎం బతుకురా నీది బురదలో పంది బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు. ఒక అమ్మాయి అంతలా చీ కొడుతున్నా.. నువ్వు వెంటపడుతున్నావంటే ఈ లోకంలో నీఅంత వెదవని నేను చూడలేదు.


రాజీవ్‌: నేను వెదవనే దుర్మార్గుడినే.. రాక్షసుడినే.. కానీ నాకు వసు కావాలి.


మను: వరెస్ట్‌ కాండిడేట్‌ అని ముద్ర వేయడం ఏంటి? నువ్వు వరెస్ట్‌ కాండిడేట్‌ వే.. ఇంకోసారి ఇలా ఫోన్‌ చేస్తే.. నిన్ను చంపేస్తాను.


రాజీవ్‌: నువ్వు నన్ను చంపడం ఏంటిరా నేను నిన్ను చంపాలనే ఇక్కడకు ఫోన్‌ వచ్చేలా చేశాను.


అంటూ గన్‌ తీసి మనుకు ఎయిమ్‌ చేస్తాడు. దీంతో మను రాజీవ్‌ను తోసేయగానే గన్‌ కిందపడిపోతుంది. వెంటనే రాజీవ్‌ తన గన్‌ తీసి రాజీవ్‌కు ఎయిమ్‌ చేస్తాడు. నాన్న అనే నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నావు. నేను ఆ ఎమోషన్‌ తీసి పక్కన పెడితే నేను నీకన్నా కంత్రి గాణ్నిరా.. అంటూ రాజీవ్‌ను షూట్‌ చేస్తాడు మను. మరోవైపు వసుధార, అనుపమ.. మను గురించి మాట్లాడుకుంటుంటారు. వసు, మనుకు కాల్‌ చేసినా మను లిఫ్ట్‌ చేయడు. దీంతో అనుపమ ఫోన్‌ నుంచి కాల్‌ చేయగానే మను లిఫ్ట్‌ చేస్తాడు. దీంతో వసుధార రేపు దత్తత కార్యక్రమం అయిపోయాక మీ తండ్రి గురించి తెలిసే అవకాశ ఉంది అని చెప్తుంది. దీంతో చెప్పే వాళ్లు చెప్పే వరకు నా తండ్రి గురించి నాకు తెలియదు అనగానే మీరు రేపు దత్తత కార్యక్రమానికి తప్పకుండా రావాలని వసు చెప్తుంది.  ఈ దత్తత కార్యక్రమం అనుపమ మేడంకు ఇష్టమైతే వస్తాను అని మను చెప్పగానే అనుపమ నాకు ఇష్టమే అని చెప్తుంది. దీంతో మను షాక్‌ అవుతాడు. మరోవైపు ఫణీంద్ర, ఇంట్లో అందరినీ పిలిచి మీరింకా రెడీ అవ్వలేదని అడుగుతాడు.


దేవయాని: మేము రాలేమని చెప్పాను కదండి.. మళ్లీ అడుగుతారేంటి?


ఫణీంద్ర: నేను కూడా చెప్పాను కదా మనం వెళ్తున్నామని.. అయినా కూడా అలా మాట్లాడతావేంటి?


దేవయాని: మేము రాము మీరు కూడా వెళ్లకండి..


ఫణీంద్ర: మనం ఇప్పుడు అక్కడకు వెళ్లకపోతే మహేంద్ర ఫీలవుతాడు. చాలా బాధపడతాడు.


దేవయాని: తను ఫీలవుతాడో.. బాధపడతాడోనని ఇప్పుడు మనం అక్కడికి వెళ్లితే తర్వాత మనం ఫీలవ్వాల్సి వస్తుంది.


ఫణీంద్ర: ఫైనల్‌గా అడుగుతున్నాను మీరు వస్తారా? రారా


అని అడగ్గానే శైలేంద్ర సరేనని రెడీ అవుతామని చెప్పగానే సరే త్వరగా రెడీ అవ్వండని చెప్పి ఫణీంద్ర పైకి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు