గుప్పెడంతమనసు మే 20 ఎపిసోడ్


రిషిని కాలేజ్ నుంచి బయట పంపించేందుకు ప్లాన్ చేసి ఫెయిల్ అవుతాడు శైలేంద్ర. కాలేజీకి వెళ్లిన రిషి...మెడికల్ కాలేజ్ కట్టడానికి బిల్డర్స్ గురించి..జగతి, ఫణీంద్ర, వసుతో చర్చిస్తాడు. బిల్డర్స్ కోసం టెండర్స్ ని పిలుద్దాం అనుకుంటారు..ఇంతలో శైలేంద్రవచ్చి నాకు తెలిసిన వ్యక్తి అని చెప్పాను కదా అంటూ సారధి అనే కొత్త క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడు.
జగతి: ‘అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ చేసిన మీరు.. ఈ కాలేజ్‌కి పని చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు?
సారధి: నేను ఈ డీబీఎస్‌టీ కాలేజ్ గురించి చాలా విన్నాను.. టీవీల్లో చూశాను.. ఇంత గొప్ప కాలేజ్‌కి పని చేయడం చాలా సంతృప్తిని ఇస్తుంది మేడమ్.. అందుకే శైలేంద్రగారు చెప్పగానే ఒప్పుకుని.. వచ్చేశాను’
వసు: ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ డెమో అయినా ఉందా చూపించండి అనగానే లేవంటాడు సారధి. ‘పోనీ ఫోన్‌లో కానీ ల్యాప్ టాప్‌లో కానీ ఉంటాయి కదా.. వాటినైనా చూపించండి.. ఏది చూడకుండా కాంట్రాక్ట్ ఇవ్వలేం కదా?’ 
శైలేంద్ర: అయ్యో సారధి గారు మీరు అవన్నీ తీసుకునే రావాలి కదా? మిమ్మల్ని పిలిచిన విషయమే దాని గురించి కదా?’ అంటాడు శైలేంద్ర సారధిని కవర్ చేస్తూ. రిషి నాకు తెలిసిన వ్యక్తి...పిన్ని, వసుధారకి ఇష్టం లేదేమో అనేస్తాడు.
ఫణీంద్ర:నీకు తెలుసు అన్నావు కదా ఇంతకన్నా ఏం కావాలి
రిషి: కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పేస్తాడు
కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.. ఫణీంద్ర కూడా వెళ్లిపోతాడు...శైలేంద్ర రూమ్ బయటకు వెళ్లి వసు-జగతి మాటలు వింటాడు. ఏంటిలా జరిగింది..ఇదంతా ఎక్కడకు దారితీస్తుందో అర్థంకావడం లేదని వసు అంటే.. మనం జాగ్రత్తగా ఉండాలని జగతి అంటుంది. శైలేంద్ర విషయం దాచిపెట్టినంతకాలం ఇలాగే ఉంటుంది..ఆల్రెడీ ఓసారి రిషి సార్ దగ్గర నిజం దాచి తప్పుచేశాం..అందుకే రిషి సార్ కి నిజం చెబుతాను అంటుంది. నవ్వు చెప్పినా నమ్మడు అని కొట్టిపడేస్తుంది జగతి. మనల్ని భయపెట్టాలని అలా చేస్తున్నాడు..భయపడుతుంటే ఇంకా భయపెడుతూనే ఉంటారు కచ్చితంగా రిషి సార్ కి చెప్పాల్సిందే అని డిసైడ్ అవుతుంది వసుధార.. శైలేంద్ర రగిలిపోతాడు...


Also Read: ఇంత అందంగా ఉండడం కూడా క్రైమే వసుధారా - అదుపుతప్పుతున్న మాస్టారి మనసు!


‘వసు ఆగు వసు నా మాట విను వసు’ అంటూ జగతి వెనుకే పరుగుతీస్తుంది. అంతా విన్న శైలేంద్ర.. ‘ఇలా ఉంది మీ సంగతి’ అన్నట్లు తలాడిస్తాడు కూల్‌గా. వసు మాత్రం ఆగదు. రిషి కింద ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే.. వసు రిషి దగ్గరకు వెళ్తుంది. జగతి వెనుకే వెళ్తుంది వసుని ఆపడానికి. ఇక సరిగ్గా రిషి బిల్డంగ్ ముందు నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే.. పైనున్న పూల కుండి రిషి పైకి పడబోతుంది. అది గమనించిన వసు.. రిషిని పక్కకు లాగేస్తుంది. జగతి కూడా కంగారుపడిపోతుంది. అక్కడున్న స్టూడెంట్స్ గుమిగూడతారు. జగతి పరుగు రిషి దగ్గరకు వెళ్లి.. ‘రిషి.. చూసుకోవాలి కదా’ అంటుంది కళ్లనిండా నీళ్లతో. వసు కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. శైలేంద్ర వచ్చి ఓవరాక్షన్ చేస్తాడు.
శైలేంద్ర: పొద్దున్నే పిన్ని ముఖం చూసి ఉంటావ్ మంచి జరుగిందంటాడు.  వెంటనే వసుధారా రిషిని తీసుకుని వెళ్లు.. అంటాడు. వెంటనే అక్కడే నిలబడి చూస్తున్న స్టూడెంట్స్‌ని కూడా పంపించేస్తాడు.


Also Read: రిషి నోట మొదటిరాత్రి మాట, ఈ సారి టార్గెట్ మిస్సవదన్న శైలేంద్ర!


‘పిన్నీ కుండీ ఎలా పడిందా అని చూస్తున్నావా? నేనే వేయించాను అంటాడు. జగతి షాక్ అవుతుంది. ‘జెస్ట్ మిస్ కదా పిన్నీ.. కనీసం కోమాలోకి పోయేవాడు’ అంటాడు నవ్వుతూ. ఇందాక నువ్వు వసుధార మాట్లాడుకోవడం నేను విన్నాను.. చాటుగా వినడం నాకు అలవాటే.. నేను కేవలం బెదిరించడానికే ఇవన్నీ చేస్తున్నా అనుకున్నారు కదా అందుకే ఈ సారి బెదిరించడం కాదు డైరెక్ట్‌గా చంపేద్దామనే డిసైడ్ అయ్యి పూల కుండీ తోయించాను’ అంటాడు
జగతి: బిత్తరపోతుంది. నిస్సహాయంగా ఏడుస్తుంది. ‘రేయ్ శైలేంద్రా నువ్వు అసలు మనిషివేనా?’ అంటుంది ఆవేదనగా.
శైలేంద్ర: ‘కాదు పిన్నీ మానవ రూపంలో ఉన్న మృగాన్ని.. ఆకలేసినప్పుడు తినడం.. ఆశపుట్టినప్పుడు ఆక్రమించుకోవడం మాత్రమే అలవాటు.. నాకు మిమ్మల్ని బెదిరించాలనో భయపెట్టాలనో అసలు ఉండదు. నాకు కావాల్సింది నేను చేసుకుంటూ పోతాను’ అంటాడు
జగతి: ‘అందరికీ చెబుతాను నీ విషయం.. ఇంతకాలం ఏదో తెలియని భయంలో ఉన్నాను కానీ ఇక ఆగను’
శైలేంద్ర: ‘నీ వల్ల కాదు పిన్నీ.. నీకు ఎమోషనల్ వీక్నెస్ ఉంది
జగతి: ‘నేను ఇంత దుర్మార్గుడ్ని అని మా డాడీకి చెబితే ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందోనని మీ భయం.. ఒకవేళ ఆయన గుండె నిబ్బరం చేసుకుని ఉన్నా ఈ విషయంలో బాబాయ్‌కి డాడీకి ఏం గొడవలు అవుతాయోనని భయం.. అన్నింటికంటే ముఖ్యంగా.. చెప్పిన మరుక్షణమే నేను రిషిని ఏం చేస్తానో అని భయం.. ఇప్పుడు కూడా అదే కదా జరిగింది. అందుకే రిషిని పంపించెయ్.. లేట్ చేయొద్దు’  నీకు మూడురోజులే టైమ్ ఇస్తున్నా....
జగతి నిస్సహాయంగా వింటూ ఉంటుంది.
శైలేంద్ర:పిన్నీ తుది నిర్ణయం నీదే. వాడు ప్రాణాలతో ఉండాలా.. అసలు భూమి మీదే లేకుండా పోవాలా? ఎమ్‌డీ సీట్‌లో కూర్చోవాలా.? ఎక్కడో చోట బతికుంటే చాలా? ఎక్కువ ఏడవద్దు పిన్నీ.. మీ కళ్లల్లో సాల్ట్‌నెస్ ఎక్కువ అనుకుంటా.. అందుకే త్వరగా కళ్లు ఎర్రబడుతున్నాయి..’
జగతి:  ‘శైలేంద్రా ప్లీజ్.. నా కొడుకుని వదిలెయ్.. ఎందుకు అలా పగబట్టావ్’?
శైలేంద్ర: ‘నా కంటే గొప్పగా ఎదిగాడు.. ఇది చాలదా పిన్నీ? ఎదుటివారి మీద పగ, కోపం పెంచుకోవడానికి?’ 


ఎపిసోడ్ ముగిసింది