గుప్పెడంతమనసు మే 18 ఎపిసోడ్


సిటీకీ దూరంగా లాండ్‌డ్రైవ్ కి వెళ‌తారు రిషిధార. త‌మ‌కు దొరికిన ఏకాంతాన్ని ఎంజాయ్‌చేస్తుంటారు. జగతి వద్దని చెప్పినా శైలేంద్ర మాత్రం వరుసగా కాల్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడున్నావని అడిగితే సిటీకి దూరంగా ఉన్నాం అంటాడు రిషి. తొందరగా వచ్చేయండి వెయిట్ చేస్తున్నాం అందరం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. ఎలాంటి  ఆప‌ద త‌ల‌పెడ‌తాడో అని జ‌గ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.


రిషి-వసు
మన నిశ్చితార్థం తర్వాత ఇది మొదటిరాత్రి అని రిషి అనగానే వసు నవ్వుతుంది. ఎందుకు నవ్వావో చెప్పు అంటే..ఎవరైనా పెళ్లితర్వాత మొదటిరాత్రి గురించి మాట్లాడుకుంటారు కానీ మీరు పెళ్లితర్వాత మొదటిరాత్రి అంటే నవ్వొచ్చిందని రిప్లై ఇస్తుంది. నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని రిషి అంటే ఇంట్లో పరిస్థితులు తలుచుకుని బాధపడతుంది. 


Also Read: మే 18 రాశిఫలాలు, ఈ రాశుల వారికి ఆర్థిక పురోభివృద్ధి!


ఆ తర్వాత శైలేంద్ర ఎవరికో కాల్ చేసి..ఈ సారి నేను అనుకున్నది జరగాలి, ఈ సారి మాత్రం టార్గెట్ మిస్ చేయొద్దు, పనయ్యాక కాల్ చేసి చెప్పండి అంటాడు. ఆ మాటలు విని జగతి కోపంగా వచ్చి ఫోన్లో ఎవరు,దేనిగురించి మాట్లాడుతున్నావని నిలదీస్తుంది. నా బిజినెస్ పార్టనర్స్ తో మాట్లాడుతున్నానంటే..నీ మాటలు నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయని ఫైర్ అవుతుంది. జగతి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన దేవయాని జగతిపై సీరియస్ అవుతుంది. నీ కొడుకు ఇంటికి రాక‌పోతే నా కొడుకు నిల‌దిస్తావా అంటూ ఎగిరిప‌డుతుంది. ఇంతలో రిషి-వసు ఇంట్లో అడుగుపెడతారు..


Also Read: అమ్మవారి సమక్షంలో ఒక్కటైన రిషిధార, పరమ రోతగా తయారైన శైలేంద్ర క్యారెక్టర్!


వసుపై కోపం చూపించిన జగతి
రిషి, వ‌సుధార ఇంట్లో అడుగుపెట్ట‌డంతోనే ఇద్ద‌రిపై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది జ‌గ‌తి. రిషిని ఏమీ అనలేక వ‌సుధార‌పై ఫైర్ అవుతుంది. ఏంటిది. ఏం చేస్తున్నారో మీకు అయినా అర్థం అవుతోందా..ఎప్పుడ‌న‌గా వెళ్లారు. ఎప్పుడొస్తున్నారు అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంది. జ‌గ‌తి మాట‌ల‌కు వ‌సుధార త‌డ‌బ‌డుతుంది. నిశ్చితార్థం జ‌రిగినంత మాత్ర‌నా చీక‌టి ప‌డే వ‌ర‌కు బ‌య‌ట ఉండొచ్చా కొంచెం కూడా బుద్ధిలేదా అంటూ వ‌సుధార‌ను నానా మాట‌లు అంటుంది. వ‌సుధార‌పై జ‌గ‌తి కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతో రిషి హర్ట్ అవుతాడు. వ‌సుధార‌ను తానే బ‌య‌ట‌కు తీసుకెళ్లాన‌ని, త‌న‌ను ఎక్క‌డికైనా తీసుకెళ్లే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని అంటాడు. మీరు ఇలా మాట్లాడ‌టం న‌చ్చ‌లేద‌ని ముఖం మీదే చెప్పిన రిషి..మీరు మా గురించి ఆలోచించ‌డం త‌గ్గించండి అని చెప్పివెళ్లిపోతాడు. వ‌సుధార‌కు న‌చ్చిన‌ట్లుగా ఉండాలి కానీ ఎవ‌రి కంట్రోల్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ంటాడు...


జగతి-వసు
వసుధార sorry చెబుతుంది..వసుని తన రూమ్ కి తీసుకెళుతుంది జగతి. శైలేంద్ర  విష‌స‌ర్పం అని, కాలేజీ ఎండీ సీట్ కోసం రిషిపై క‌క్ష క‌ట్టాడ‌ని చెబుతుంది. రిషిని కాపాడుకోవాల‌నే భ‌యంలో ఏం చేస్తున్నానో తెలియ‌డం లేద‌ు, రిషి త‌న‌ను అపార్థం చేసుకున్నా కోప‌గించుకున్నా భ‌రిస్తాన‌ని కానీ తనకి ఏదైనా జ‌రిగితే త‌న గుండె ఆగిపోతుంద‌ని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. రిషికి ఏం కాకుండా తాను చూసుకుంటాన‌ని జ‌గ‌తికి వ‌సుధార ధైర్యం చెబుతుంది.


శైలేంద్ర - ధరణి
శైలేంద్ర వేసిన ఎత్తుల‌ను చూసి దేవ‌యాని మురిసిపోతుంది.  నా ముందు సింహాస‌నం మీద కూర్చున్న రాజైనా త‌ల‌వంచాల్సిందే అంటాడు శైలేంద్ర‌. కాలేజీలో, సొసైటీలో రిషికే పేరు ప్ర‌ఖ్యాతులు ద‌క్క‌డం తాను త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని దేవ‌యాని అంటుంది. త్వ‌ర‌లోనే తాము అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ని త‌ల్లికి మాటిస్తాడు శైలేంద్ర‌. రిషిని మ‌ట్టిలో క‌లిపైనా స‌రే ఆ ప‌ని చేసి తీరుతాన‌ని అంటాడు. వారి మాట‌ల‌ను చాటుగా విన్న ధ‌ర‌ణి ఆ నిజాన్ని రిషికి చెప్పాల‌నిప్ర‌య‌త్నిస్తుంది. కానీ శైలేంద్ర వ‌చ్చి అడ్డుకుంటాడు. శైలేంద్ర‌ను చూసి నిజం చెప్ప‌డానికి ధ‌ర‌ణి భ‌య‌ప‌డుతుంది. రిషి వెళ్లిపోగానే ధ‌ర‌ణికి మ‌రోసారి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. నువ్వు జ‌నాభా లెక్క‌ల్లో ఉండాలంటే తెలిసిన నిజాన్ని మ‌న‌సులోనే దాచిపెట్టుకోమ‌ని బెదిరిస్తాడు.


రిషి-వ‌సుధార‌
వ‌సుధార ఏం చేస్తుందో అని రిషి ఆలోచనలో పడతాడు. త‌న రూమ్‌లోనే కూర్చుని బాధ‌ప‌డుతోంద‌ని అనుకుంటాడు కానీ వ‌సుధార మాత్రం లాన్‌లో ఉంటుంది. అక్కడకు వెళ్లిన రిషి..నువ్విప్పుడు డ‌ల్‌గా ఉంటావ‌ని తెలుసు. అది పొగోట్ట‌డానికే వ‌చ్చానన్న రిషి..నా ముందే మేడ‌మ్ నిన్ను అలా అన‌డం న‌చ్చ‌లేద‌ని చెబుతాడు.