గుప్పెడంతమనసు మార్చి 23 ఎపిసోడ్
వంటలు బావున్నాయి పెద్దమ్మ చేసిందేమో అనగానే వసు బుంగమూతి పెడుతుంది. పొద్దున్నే లేచి కష్టపడి మీకు నచ్చిన వంటలన్నీ చేస్తే నా కష్టాన్ని గుర్తించలేదంటుంది. ఆ వంటల గురించి ఇద్దరూ కాసేపు ఫన్నీగా వాదించుకుంటారు. ఆ తర్వాత వంటలు బావున్నాయి థ్యాంక్స్ అంటాడు రిషి.లంచ్ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకుంటారు. స్పాట్ వాల్యూషన్ కి మన కాలేజీ ఎంపికకావడం సంతోషం అని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు. ఏ చిన్న పొరపాటు లేకుండా కాలేజీ గౌరవాన్ని కాపాడాలని తీర్మానించుకుంటారు. ఈ వర్క్ మొత్తానికి జగతి మేడం, మహేంద్ర సార్ ఇన్ ఛార్జ్ గా ఉంటారని క్లారిటీ ఇస్తాడు..
Also Read: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
ఇంటికి వెళ్లిన జగతి-మహేంద్ర ను రిషి-వసుధార గురించి నిలదీస్తుంది దేవయాని. ఇంటికి వస్తున్నారా ఎక్కడైనా తిరుగుతున్నారా అని అడుగుతుంది. ఫైర్ అయిన జగతి..రిషికి ఎలా ఉండాలో తెలుసు..తన భార్యని, బంధాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు , ఇతరుల విషయాలలోకి అది భార్యాభర్తల మధ్యలోకి తల దూర్చే అలవాటు నాకు లేదు..కొందరిలాగ అనేసి కోపంగా వెళ్లిపోతుంది జగతి..
మరోవైపు వసుధార..కాలేజీ బయట కూర్చుని మిషన్ ఎడ్యకేషన్ వర్క్ చేస్తుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రిషి.. ఎప్పుడు చేయాల్సిన వర్క్ అప్పుడు చేసుకోవాలి కాలేజీ టైమ్ అయిపోయింది కదా అని ల్యాప్ టాప్ క్లోజ్ చేస్తాడు. బయటకు వెళదాం పద అని పిలుస్తాడు. అప్పుడు వసుధార రిషి అడుగులో అడుగు వేస్తూ నవ్వుకుంటూ వెనకాలే వెళుతూ ఉంటుంది. రిషిని ఇమిటేట్ చేస్తుంటుంది.
ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ స్పాట్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు..ఎలా అయినా దానిని తనకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకుంటుంది దేవయాని. ఇందులో మనకేంటి లాభం అని దేవయాని అంటే.. అన్నింటిలో లాభనష్టాలు అంచనావేసుకుంటే ఎలా అని జగతి, వసుధార రిప్లై ఇస్తారు.
దేవయాని: మీకు కాలేజీ పేరు కనిపిస్తోంది..నాకు రిషి కష్టం కనిపిస్తోంది..అయినా ఎందుకు నాన్నా ఈ అదనపు భారం తలకెత్తుకుంటావ్
రిషి: అన్నీ రిషి సార్ పై ఎందుకు వదిలేస్తాం..మేం కూడా హెల్ప్ చేస్తున్నాం కదా
మహేంద్ర: ఈ స్పాట్ వాల్యూషన్ తో కాలేజీకి మంచి పేరొస్తుంది
జగతి: ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు
ఫణీంద్ర: కాలేజీకి పేరొస్తందంటే అడ్డుపడతావేంటి
దేవయాని: ఇలాంటి మాటలు చెప్పి మిషన్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు..దానికి అంతుపొంతు లేదనుకుంటూ వసుధారవైపు గుర్రుగా చూస్తుంది. అందరి కళ్లూ కాలేజీపైనే ఉంటాయి
మహేంద్ర: నిజమే..అందరి కళ్లూ కాలేజీపైనా, రిషి-వసుపైన ఉన్నాయి
పెద్దమ్మా మీరు కంగారుపడొద్దు..నేను చూసుకుంటానని రిషి అంటే..మేం ఉన్నాంకదా సార్ అంటుంది వసుధార...
Also Read: మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది
ఆ తర్వాత వసుధార పని చేస్తూ ఉండగా ఇంతవరకు వసుధార పని చేయడం ఏంటి అని రిషి అక్కడికి వెళ్లి పడుకోవచ్చు కదా అంటాడు. లేదుసార్ వర్క్ ఉందని అనడంతో గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతాడు. నిద్రవస్తోంది కాఫీ తాగితే బావుండును అనుకుంటుంది అంతలో రిషి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. కాఫీ తాగితే బావుండును అనుకుంటున్నా ఇంతలో మీరువచ్చారంటుంది. ఆతర్వాత ఇద్దరూ కలసి కాఫీ తాగుతారు. బయట చందమామ కనిపించాడా అంటే..చందమామతో కబుర్లు చెబుతూ కాఫీ తాగాలా..సరే నువ్వు చందమామతో చాటింగ్ చేయి నేను వెళతాను అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార వర్క్ చేసుకుంటుంది..రిషి అక్కడే నిద్రపోతాడు..రిషి తన రూమ్ లో పడుకోవడంతో వసుధార బయటకు వెళుతుంది.. నేను నీకు భర్తనే కానీ నువ్వు నా భార్యవు కాదన్న రిషి మాటలు గుర్తుచేసుకుని ఈ దొబూచులాట ఎన్నాళ్లు రిషిసార్ అనుకుంటుంది.