గుప్పెడంతమనసు మార్చి 22 ఎపిసోడ్


వసుధార రూమ్ కి వెళ్లిన రిషి..ఏదో మాట్లాడదాం అనుకుని ఇంకేదేదో మాట్లాడతాడు.. మళ్లీ తాళి గురించి ఇద్దరూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుకుంటారు. గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోతాడు రిషి. ఇదంతా చూస్తుంది దేవయాని. మర్నాడు కాలేజీకి వెళ్లిన రిషి..నేరుగా వసుధార క్యాబిన్ కి వెళతాడు.. స్టూడెంట్స్ ఇచ్చిన వసు రిషి పోస్టర్ గోడపై అతికించి ఉంటుంది..అది చూసి‘వసుధారా ఇలా ఎందుకు చేశావ్.. నువ్వు చేసిన ఒక్కపనితో నన్ను బాధపెడుతూ నువ్వు బాధపడుతున్నావ్ కదా? అనుకుంటాడు. అప్పుడే వసు వచ్చి.. ‘లోపలికి రావచ్చా సార్’ అంటుంది. 
రిషి: ‘ఇది నీ క్యాబినే కదా అని అడుగుతాడు. 
వసు: ‘నాదే కానీ.. మా ఎమ్‌డీ గారు ఉన్నారు కదా? అందుకే..సరే కానీ.. మీరేంటి ఇక్కడా?
రిషి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంటాడు..ఇంతలో సార్ అని పిలిచినవసుధార దగ్గరకు వెళుతుంది. రిషి ఏవేవో ఆలోచించుకుంటాడు కానీ రిషి షర్ట్ మీదున్న దారం పైకి తీసి చూపించి.. ‘మీరు జెంటిల్ మెన్ సార్.. ఇలాంటి చిన్న లోపం కూడా ఉండకూడదు’ అంటుంది వసు.
వసు: రిషి వెళ్లిపోతుంటే...‘సార్ ఇంతకీ మీరు నా క్యాబిన్‌లోకి ఎందుకొచ్చారో చెప్పలేదు’ 
రిషి: ‘మెసేజ్ చేస్తాను’ అని తప్పించుకుంటాడు రిషి
వసు:  ‘ఎప్పుడు సార్’ 
రిషి: ‘వెయిట్ చెయ్’ 


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం


దేవయాని ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని.. ధరణిని పిలిచి..భోజనం వడ్డించమంటుంది. చాలా ఐటమ్స్ తెచ్చి ముందు పెట్టిన ధరణీ.. ఇవన్నీ వసుధార చేసింది అత్తయ్యా అంటూ వడ్డిస్తూ ఉంటుంది.
దేవయాని: అయితే వసుధార వంట గదిని కూడా కబ్జా చేసిందా?
ధరణి: కబ్జా చేయడం ఏంటి అత్తయ్యా.. నాతో పాటు తనకి కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా
దేవయాని: ఏంటి కొత్తగా హక్కుల గురించి మాట్లాడుతున్నావేంటీ
ధరణి: తనకి కూడా బాధ్యత ఉంటుంది కదా అని.. నిజానికి హక్కు ఉంటేనే బాధ్యతగా ఫీల్ అవుతారు కదా
దేవయాని ఆ మాటలకు రగిలిపోతుంది..ఈ మధ్య తెలివి తేటలు బాగానే పెరిగాయి నీకు అంటూ విసుక్కుంటూనే తింటుంది


జగతీ మహేంద్రతో కాలేజ్ క్యాబిన్‌లో కూర్చుని..మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చెబుతూ ఉంటుంది. ‘జగతీ ఎంత సేపు మిషన్ ఎడ్యుకేషన్ ఫాన్స్ గురించి కాకుండా ఆపరేషన్ రిషి వసుధార ప్లాన్ ఆలోచించు.. వాళ్లని ఎలా ఒకటి చెయ్యలో ఆలోచించు జగతీ అంటాడు మహేంద్ర.
మహేంద్ర: జగతీ సాధారణంగా భోజనం సమయంలో కాస్త నిదానంగా ఉంటారట.. కోపం కూడా కాస్త తక్కువ శాతంలో ఉంటుందట.. అందుకే మనం జాగ్రత్త తప్పుకుని.. ఈ మధ్యాహ్నం వాళ్లిద్దరు మాత్రమే తినేలా చేస్తే ఎలా ఉంటుంది?’ 
జగతి: ఫర్లేదు మహేంద్ర నీకు మంచి ఐడియాలే వస్తున్నాయి.. అయితే నేను వసుకి కాల్ చేసి చెప్పేస్తా.. నువ్వు రిషికి చెప్పెయ్’
జగతి, మహేంద్ర...ఇద్దరూ వసు-రిషికి కాల్ చేసి భోజనానికి రావడం లేదని చెప్పేస్తారు...


Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు


కాలేజ్ గార్డెన్‌లో ఉన్న బెంచ్ మీద వర్క్ చేసుకుంటున్న వసుని.. రిషి తన క్యాబిన్ నుంచి చూస్తూ భోజనానికి రమ్మని మెసేజ్ చేస్తాడు. ‘మీరు తినండి నాకు ఆకలిగా లేదు’ అని మెసేజ్ చేస్తుంది వసు. రిషి వసుని చూస్తూనే ఉంటాడు. 
రిషి: నాకు బాగా ఆకలిగా ఉంది..నువ్వు వస్తేనే తింటాను
వసు: ఈ మధ్య రిషి సార్‌కి నాకంటే పట్టుదల ఎక్కువ అవుతుంది. నాకే పొగురు అంటారు కానీ.. ఆయనకి నాకంటే ఎక్కువ పొగరు’ అని తిట్టుకుంటూ భోజనానికి వెళ్తుంది. 
టేబుల్ కి అటు ఇటు కూర్చుంటారు..వసుధార ఫోన్ చూసుకుంటుంది
రిషి: ఏంటి ఫోన్ చూసుకుంటున్నావ్
వసు: ఉదయాన్నే మా ఎమ్‌డీ గారు మెసేజ్(క్యాబిన్‌లోకి ఎందుకొచ్చారో మెసేజ్) చేస్తా అన్నారు ఇంకాలేదు అని సెటైర్స్ వేసి.. మీకోసమే ఈ రోజు వంటలన్నీ నేనే చేశాను సార్..’ అనుకుంటుంది వసు.
రిషి: ‘వంటలు అద్భుతంగా ఉన్నాయి.. మా పెద్దమ్మ చేసినట్లు ఉన్నారు’ అంటాడు
వసు బుంగమూతి పెట్టి.. ‘సార్ అవి నేనే చేశాను’ అంటుంది కాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి..రిషి కూల్‌గా.. ‘నాకు తెలియదా ఏంటీ? కావాలనే అలా అన్నాను’ అంటాడు.